Pitra Paksha : హిందూమతంలో పితృపక్షంని పూర్వీకులకు నివాళులు అర్పించడానికి మరియు స్మరించుకోవడానికి పవిత్ర సమయంగా భావిస్తారు. ఇక ఈ సమయంలో పూర్వీకుల శాంతి కోసం కొన్ని నియమాలను సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ప్రధానంగా పూర్వీకుల ఆశీర్వాదాలు పొందడం కోసం కొన్ని నియమాలను గుర్తుంచుకోవడం చాలా మంచిది. ఇలా పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడం వలన పూర్వికులు ఆశీర్వాదాలను పొందవచ్చు. అదేవిధంగా ఇంట్లో ఐశ్వర్యం ఉంటుందని హిందువుల నమ్మకం. అయితే ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ 17వ తేది నుండి ప్రారంభమవుతుంది. అలాగే అక్టోబర్ 2వ తేదీన ముగుస్తుంది. కాబట్టి ఈ సమయంలో భక్తులు తమ పూర్వీకుల శాంతి మరియు ఆశీస్సులు పొందడం కోసం ప్రత్యేకమైన పూజలు కర్మలు చేస్తారు. ఇక పితృపక్షంలో పొరపాటున కూడా ఈ తప్పులను అస్సలు చేయకూడదు.
పితృపక్ష సమయంలో మాంసాహారాన్ని మధ్యాన్ని అసలు స్వీకరించకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే పూర్వికులు బాధపడతారు. అలాగే ఆగ్రహానికి గురవుతారని మరియు జీవితంలో కష్టాలు వస్తాయని భక్తుల నమ్మకం.
పితృపక్ష సమయంలో ఎరుపు రంగు దుస్తులను ధరించడం నిషేధం. ఎరుపు రంగు కోపానికి చిహ్నం కాబట్టి ఇవి ధరిస్తే పూర్వీకులకు కోపం వస్తుంది.
అబద్ధం చెప్పడం.
పితృపక్ష సమయంలో అబద్ధాలు మాట్లాడకూడదు. పూర్వికులను ప్రసన్నం చేసుకోవడానికి కేవలం సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి.
కోపం, హింస.
పితృపక్ష సమయంలో కోపానికి మరియు హింసకు దూరంగా ఉండడం మంచిది. ప్రశాంతంగా ఉండి అందరి ప్రేమను దక్కించుకోవాలి.
అనైతిక చర్య.
ఈ సమయంలో అనైతిక చర్యకు పాల్పడితే అది పూర్వీకులను అవమానించినట్లు అవుతుంది.
పూర్వికులను సంతోషపెట్టే మార్గాలు.
– పితృపక్ష సమయంలో ఈ నియమాలను పాటించడం ద్వారా పూర్వికుల ఆశీర్వాదాలు పొందవచ్చు. దీనివల్ల కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు.
-పితృపక్షంలో శ్రద్ధ కర్మలను తప్పకుండా చేయాలి. అలాగే పూర్వికులకు పిండ ప్రధానం ఆహారం నీరు దక్షిణగా ఇవ్వాలి.
– ఈ సందర్భంగా దానాలు చేయడం చాలా పవిత్రమైనది.
ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
పితృపక్ష సమయంలో మీ పూర్వీకులను ప్రసన్నం చేసుకోండి. పూర్వికుల పట్ల మీకు ఉన్న గౌరవాన్ని తెలపండి. పూర్వీకుల ఆశీర్వాదాలు పొందితే కచ్చితంగా మీరు జీవితంలో విజయాలను అందుకుంటారు. అంతేకాదు పితృ పక్షం సమయంలో పూర్వీకులు భూమి మీదకి వచ్చి వారి వారసులకు ఆశీర్వాదాలను అందిస్తారు. పితృల పేరుతో చేసే దానాలు తర్పణం,మరియు శ్రద్ధ కర్మలు వారి ఆత్మకు శాంతిని కలిగిస్తాయి . కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.