Pitra Paksha : సెప్టెంబర్ 17న పితృపక్షం… ఈ సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pitra Paksha : సెప్టెంబర్ 17న పితృపక్షం… ఈ సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి…!

Pitra Paksha : హిందూమతంలో పితృపక్షంని పూర్వీకులకు నివాళులు అర్పించడానికి మరియు స్మరించుకోవడానికి పవిత్ర సమయంగా భావిస్తారు. ఇక ఈ సమయంలో పూర్వీకుల శాంతి కోసం కొన్ని నియమాలను సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ప్రధానంగా పూర్వీకుల ఆశీర్వాదాలు పొందడం కోసం కొన్ని నియమాలను గుర్తుంచుకోవడం చాలా మంచిది. ఇలా పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడం వలన పూర్వికులు ఆశీర్వాదాలను పొందవచ్చు. అదేవిధంగా ఇంట్లో ఐశ్వర్యం ఉంటుందని హిందువుల నమ్మకం. అయితే ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ 17వ తేది […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 September 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Pitra Paksha : సెప్టెంబర్ 17న పితృపక్షం... ఈ సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి...!

Pitra Paksha : హిందూమతంలో పితృపక్షంని పూర్వీకులకు నివాళులు అర్పించడానికి మరియు స్మరించుకోవడానికి పవిత్ర సమయంగా భావిస్తారు. ఇక ఈ సమయంలో పూర్వీకుల శాంతి కోసం కొన్ని నియమాలను సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ప్రధానంగా పూర్వీకుల ఆశీర్వాదాలు పొందడం కోసం కొన్ని నియమాలను గుర్తుంచుకోవడం చాలా మంచిది. ఇలా పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడం వలన పూర్వికులు ఆశీర్వాదాలను పొందవచ్చు. అదేవిధంగా ఇంట్లో ఐశ్వర్యం ఉంటుందని హిందువుల నమ్మకం. అయితే ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ 17వ తేది నుండి ప్రారంభమవుతుంది. అలాగే అక్టోబర్ 2వ తేదీన ముగుస్తుంది. కాబట్టి ఈ సమయంలో భక్తులు తమ పూర్వీకుల శాంతి మరియు ఆశీస్సులు పొందడం కోసం ప్రత్యేకమైన పూజలు కర్మలు చేస్తారు. ఇక పితృపక్షంలో పొరపాటున కూడా ఈ తప్పులను అస్సలు చేయకూడదు.

Pitra Paksha మాంసాహారం మద్యం

పితృపక్ష సమయంలో మాంసాహారాన్ని మధ్యాన్ని అసలు స్వీకరించకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే పూర్వికులు బాధపడతారు. అలాగే ఆగ్రహానికి గురవుతారని మరియు జీవితంలో కష్టాలు వస్తాయని భక్తుల నమ్మకం.

Pitra Paksha ఎరుపు బట్టలు.

పితృపక్ష సమయంలో ఎరుపు రంగు దుస్తులను ధరించడం నిషేధం. ఎరుపు రంగు కోపానికి చిహ్నం కాబట్టి ఇవి ధరిస్తే పూర్వీకులకు కోపం వస్తుంది.

అబద్ధం చెప్పడం.

పితృపక్ష సమయంలో అబద్ధాలు మాట్లాడకూడదు. పూర్వికులను ప్రసన్నం చేసుకోవడానికి కేవలం సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి.

కోపం, హింస.

పితృపక్ష సమయంలో కోపానికి మరియు హింసకు దూరంగా ఉండడం మంచిది. ప్రశాంతంగా ఉండి అందరి ప్రేమను దక్కించుకోవాలి.

అనైతిక చర్య.

ఈ సమయంలో అనైతిక చర్యకు పాల్పడితే అది పూర్వీకులను అవమానించినట్లు అవుతుంది.

పూర్వికులను సంతోషపెట్టే మార్గాలు.

– పితృపక్ష సమయంలో ఈ నియమాలను పాటించడం ద్వారా పూర్వికుల ఆశీర్వాదాలు పొందవచ్చు. దీనివల్ల కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు.

-పితృపక్షంలో శ్రద్ధ కర్మలను తప్పకుండా చేయాలి. అలాగే పూర్వికులకు పిండ ప్రధానం ఆహారం నీరు దక్షిణగా ఇవ్వాలి.

– ఈ సందర్భంగా దానాలు చేయడం చాలా పవిత్రమైనది.

Pitra Paksha సెప్టెంబర్ 17న పితృపక్షం ఈ సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Pitra Paksha : సెప్టెంబర్ 17న పితృపక్షం… ఈ సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి…!

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

పితృపక్ష సమయంలో మీ పూర్వీకులను ప్రసన్నం చేసుకోండి. పూర్వికుల పట్ల మీకు ఉన్న గౌరవాన్ని తెలపండి. పూర్వీకుల ఆశీర్వాదాలు పొందితే కచ్చితంగా మీరు జీవితంలో విజయాలను అందుకుంటారు. అంతేకాదు పితృ పక్షం సమయంలో పూర్వీకులు భూమి మీదకి వచ్చి వారి వారసులకు ఆశీర్వాదాలను అందిస్తారు. పితృల పేరుతో చేసే దానాలు తర్పణం,మరియు శ్రద్ధ కర్మలు వారి ఆత్మకు శాంతిని కలిగిస్తాయి . కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది