Numerology : ఒకటో నెంబర్ లో పుట్టిన వారు ఎలా ఉంటారు..? వారి లక్షణాలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి…? అలాగే ఒకటో నెంబర్ లో పుట్టిన వ్యక్తులు ఎవరు ఎలా ఉంటారు…?? ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకటో నెంబర్ లో పుట్టిన వారు అంటే ఏ నెలలో అయినా గాని 1,10,19, మరియు 28 లో పుట్టిన వారు ఒకటో నెంబర్ జాతకులు. డెస్టినీ నెంబర్ లో పుట్టిన తేదీ , నెల , పుట్టిన సంవత్సరం మొత్తం కూడితే డెస్టినీ నెంబర్ లో ఒకటవ నెంబర్ వస్తుంది. పుట్టిన 20 ఏళ్ల తర్వాత ఈ లక్షణాలు వర్తిస్తాయి. అయితే ఒకటో నెంబర్ లో పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఉండడంతో పాటు ఇతరులు కూడా నాయకులను చేయాలని చూస్తారు. వారు నాయకులు అవ్వడమే కాకుండా ఇంకా కొంతమంది నాయకులను చేస్తారు. సహజంగా రాజకీయాలలో ఈ నెంబర్ కలిగిన వ్యక్తులు ఎక్కువగా ఉంటారు.
అలాగే రాజకీయాల్లో వీరు బాగా రాణిస్తారు. అనుకున్నది బలంగా నమ్మి చేస్తారు. వీరు నమ్మనది వారు చేయరు. ఇతరులను కూడా చేయనీయరు. వీరు గొడవలకు వివాదాలకు దూరంగా ఉంటారు. ఒకవేళ వీరి పేరులో రాంగ్ నెంబర్ ఉంటే తప్ప సహజంగా వీరు గొడవలకు వెళ్లారు. వారి పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కయ్యానికి కాలు దువుతారు. వీరిని నెమ్మదిగా అడిగితే ఏ పనైనా చేస్తారు. బలవంతంగా చెబితే ఏ పని చేయరు. వీరికి తండ్రి యొక్క ఆశీర్వాదం చాలా ముఖ్యం. తండ్రి మాటను జవదాటకూడదు. ప్రతిరోజు తండ్రి కాళ్లకు నమస్కరించి తండ్రి ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే వీరు సహజంగా ప్రేమకు లొంగుతారు. ఒకవేళ వీరితో హక్కుగాను బలవంతంగానూ చేయించాలి అనుకుంటే అది జరగదు.
శనివారం నాడు తప్పకుండా తల స్నానం చేయాలి మద్యానికి మాంసానికి విలాసాలకు దూరంగా ఉండాలి. అలాగే ఆదివారం నాడు సూర్యనారాయణ ప్రార్ధించడం ఆదిత్య హృదయం పారాయణం చేయడం వీరికి జీవితంలో ఆరోగ్యాన్ని విజయాలను ఇస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.