Karthika Purnima : కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగించాలి… చదవాల్సిన మంత్రం ఏంటంటే…!
Karthika Purnima : ఈ ఏడాది కార్తీక మాసంలో ఇప్పటికే రెండు సోమవారాలు ఏకాదశులు ముగిశాయి. ఇక్కడ నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి నాడు దీపాలను వెలిగించేందుకు భక్తులు రెడీ అవుతున్నారు. అయితే కార్తీక పౌర్ణమి రోజున 365 వోత్తులు వెలిగించే సమయంలో చదవాల్సిన మంత్రం ఏమిటి…? దీనివల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది… ? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం… పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున 365 వొత్తులతో దీపారాధన చేయడం […]
ప్రధానాంశాలు:
Karthika Purnima : కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగించాలి... చదవాల్సిన మంత్రం ఏంటంటే...!
Karthika Purnima : ఈ ఏడాది కార్తీక మాసంలో ఇప్పటికే రెండు సోమవారాలు ఏకాదశులు ముగిశాయి. ఇక్కడ నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి నాడు దీపాలను వెలిగించేందుకు భక్తులు రెడీ అవుతున్నారు. అయితే కార్తీక పౌర్ణమి రోజున 365 వోత్తులు వెలిగించే సమయంలో చదవాల్సిన మంత్రం ఏమిటి…? దీనివల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది… ? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున 365 వొత్తులతో దీపారాధన చేయడం వలన ఆ దీపాలు దేవతలను సంతోషిస్తాయని చెబుతుంది. ఇక ఈ ఏడాది తెలుగు క్యాలెండర్ ప్రకారం కార్తీకమాసం శుక్లపక్ష పౌర్ణమి నవంబర్ 15వ తేదీన జరుపుకోనున్నట్లు పండితులు చెబుతున్నారు. అయితే కార్తీకదీపం నవంబర్ 15వ తేదీన శుక్రవారం ఉదయం 6:19 గంటలకు ప్రారంభమై మర్నాడు నవంబర్ 16వ తేదీ న శనివారం మధ్యాహ్నం 2:58 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం తిది ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఏడాది నవంబర్ 15వ తేదీ శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు.
Karthika Purnima కార్తీక పౌర్ణమి నాడు దీపం పెడుతూ చెప్పవలసిన శ్లోకం…
“కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః”
“జలే స్థలే యే నివసంతి జీవాః”
“దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః”
“భవంతి త్వం శ్వపచాహి విప్రాః”
హిందూమతంలో కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులను వెలిగించడం చాలా ముఖ్యమైనది. అలాగే ఈ రోజున గంగ స్నానము ,హవనము , పూజలు , దానాలు ఎంతో విశేషమైనవి. ఇక హిందూ సాంప్రదాయాలలో కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైన పౌర్ణమిగా భావిస్తారు. ఈరోజు నా భగవంతుడిని సంతోష పెట్టడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాలలో దీపారాధన చేయడం వలన ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యఫలితం లభిస్తుంది. అంతేకాదు పుణ్య నదులలో స్నానం ఆచరించిన ఫలం దక్కుతుంది. ఇంతటి పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువు ఆలయంలో స్తంభ దీపం పెట్టిన వారు స్వామివారికి ప్రీతివంతులు అవుతారు.
అలాగే ఈ దీపాన్ని ఎవరైతే చూస్తారో వారి పాపాలన్నీ పటాపంచలవుతాయని నమ్మకం. ఇక స్తంభ దీపం పెట్టకపోతే పితృదేవతలకు నరక విముక్తి కలగదని అంటారు. ముఖ్యంగా ఈ రోజున నది తీరాలలో అరటి దోప్పలలో దీపాలను వెలిగించి నదులలో వదులుతారు. ఒకవేళ అవకాశం లేనివారు తమ ఇంట్లో తెలుసుకోవడం వద్ద అరటి దోప్పలలో దీపం వెలిగించవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వలన లోకంలో సుఖ సౌఖ్యాలు జీవితనంతరం ముక్తి లభిస్తుందని చెబుతున్నారు.
ఏడాదిలో ఏదైనా ఊరికి వెళ్ళిన మరి ఏదైనా కారణం చేత దీపం వెలిగించకపోతే ఈ కార్తీకమాసంలో 365 వత్తుల దీపాన్ని వెలిగించి ఆ దోషాన్ని పోగొట్టుకోవచ్చట. ఈ క్రమంలోనే చాలామంది కార్తీక పౌర్ణమి రోజున 365 వోత్తులను దీపాలను వెలిగిస్తారని పండితులు చెబుతున్నారు.