Karthika Masam : కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు… దీని ప్రాముఖ్యత ఏంటంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Masam : కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు… దీని ప్రాముఖ్యత ఏంటంటే…!

 Authored By ramu | The Telugu News | Updated on :14 November 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Karthika Masam : కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు... దీని ప్రాముఖ్యత ఏంటంటే...!

Karthika Masam : కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసం లో చాలామంది క్షేత్రాలలో ఉసిరితో దీపాలను వెలిగిస్తారు. అంతేకాదు కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేస్తే నీటిలో ఉసిరి వేసుకొని కూడా స్నానం చేస్తారు. అసలు ఉసిరికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఉంది..? అలాగే కార్తీక మాసానికి మరియు ఉసిరికి మధ్య సంబంధం ఏంటి..? ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే ఉసిరి చెట్టుని ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. కనుక ఈ మాసంలో ఉసిరి చెట్టుని పూజించి ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగిస్తారు. ఇలా దీపాలను వెలిగించడం వలన జీవితంలో కష్టాలన్నీ దూరమవుతాయని కుటుంబం సంతోషంగా ఉంటుందని నమ్మకం. ఇక ఈ విషయాలను వ్యాస మహర్షి తను రచించిన శివ మహా పురాణంలో వెల్లడించారు. అలాగే లక్ష్మీదేవికి కూడా ఉసిరికాయ ప్రతిరూపమని భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.

అయితే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాలను వెలిగిస్తే మంచిదని చాలామంది చెబుతుంటారు. ఆ రోజున ఉసిరి దీపాన్ని వెలిగించడం వలన శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. అంతేకాదు కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాలను వెలిగిస్తే నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు. అయితే కార్తీకమాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు.

Karthika Masam కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు దీని ప్రాముఖ్యత ఏంటంటే

Karthika Masam : కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు… దీని ప్రాముఖ్యత ఏంటంటే…!

కార్తీక పౌర్ణమి రోజున శివాలయం లేదా విష్ణు ఆలయ ప్రాంగణంలో నీటితో శుభ్రం చేసి వరి పిండితో ముగ్గు వేయాలి. తరువాత ఆ ముగ్గును పసుపు కుంకుమ పువ్వులతో అందంగా అలంకరించాలి. అనంతరం ఉసిరికాయ పై భాగంలో గుండ్రంగా కట్ చేసి అందులో ఆవు నెయ్యిని పొయ్యాలి. తామర కాండలతో తయారైన వత్తులను ఆవు నెయ్యిలో ముంచి ఉసిరికాయ మీద పెట్టాలి. ఆ తరువాత ఉసిరి దీపాన్ని అగర్బత్తితో వెలిగించి దీపాన్ని పసుపు కుంకుమ అక్షంతలతో అలంకరించాలి. ఆఖరిగా ఉసిరి దీపాలను వెలిగించే సమయంలో ” ఓం శ్రీ కార్తీక దామోదరామ నమః ” అనే మంత్రాన్ని పఠించాలి. ఈ విధంగా ఉసిరి దీపాలను వెలిగించడం వలన జీవితంలో కష్టాలు తొలగిపోయి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారని పురోహితులు చెబుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది