Puja Flowers : హనుమంతుడు, లక్ష్మీదేవి, శివుడు ,శనికి కేవలం ఈ పూలతో ఆరాధించండి. మీ కోరికలు తీరడం తథ్యం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Puja Flowers : హనుమంతుడు, లక్ష్మీదేవి, శివుడు ,శనికి కేవలం ఈ పూలతో ఆరాధించండి. మీ కోరికలు తీరడం తథ్యం…

Puja Flowers ; దేవుళ్ళకి పూజలు చేసేటప్పుడు రకరకాల పువ్వులతో పూజ చేస్తూ ఉంటాం. అయితే కొన్ని పూలతో పూజ చేస్తే మంచి శుభ ఫలితాలు పొందవచ్చని మన నమ్మకం. ఏ పువ్వులు ముఖ్యమైనవో తెలుసుకొని ఆ పూలతోనే పూజిస్తే పూజ ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది. పూజలో పెట్టి కొన్ని పువ్వులు కూడా చాలా ప్రధానమైనవి.. పూజ సమయంలో ఏ దేవుడికి ఏ పూలు పెట్టాలో తెలుసా… శనికి, హనుమంతుడికి, లక్ష్మీదేవికి, శివుడికి కొన్ని సమర్పించాల్సిన పువ్వులు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :19 October 2022,7:30 am

Puja Flowers ; దేవుళ్ళకి పూజలు చేసేటప్పుడు రకరకాల పువ్వులతో పూజ చేస్తూ ఉంటాం. అయితే కొన్ని పూలతో పూజ చేస్తే మంచి శుభ ఫలితాలు పొందవచ్చని మన నమ్మకం. ఏ పువ్వులు ముఖ్యమైనవో తెలుసుకొని ఆ పూలతోనే పూజిస్తే పూజ ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది. పూజలో పెట్టి కొన్ని పువ్వులు కూడా చాలా ప్రధానమైనవి.. పూజ సమయంలో ఏ దేవుడికి ఏ పూలు పెట్టాలో తెలుసా… శనికి, హనుమంతుడికి, లక్ష్మీదేవికి, శివుడికి కొన్ని సమర్పించాల్సిన పువ్వులు వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఆ పువ్వులతో పూజ చేసినట్లయితే మీ కోరికలు కూడా తీరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

1) హనుమంతుడికి మందార పువ్వు, బంతి పువ్వు చెడు వికర్షణకుడిగా భావిస్తారు. మీరు కూడా హనుమాన్ భక్తులు అయితే పూజ సమయంలో బంతి పువ్వులు, మందార పువ్వులను పూజలో పెట్టవచ్చు. ఈ పువ్వులను అనుమంతునికి పెట్టడం వలన ఆయన భక్తుల కోరికలను నెరవేరుస్తాడు.

2) శని దేవుడు శమీ పువ్వులతో ప్రసన్నుడు అవుతాడు. శని దేవుని అనుగ్రహం పొందిన వ్యక్తి తన గృహంలో ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. శనిదేవునికి శమీ పువ్వులు చాలా ఇష్టమైనవి. శని దేవుని పూజించేటప్పుడు శమీ పుష్పాలను లేదా శనికి ఇష్టమైన నీలిరంగి పువ్వులను సమర్పించడం శ్రేయస్కరం. కావున మీరు శని దేవునికి పూజించేటప్పుడు ఉపయోగించండి.

Puja Flowers on Hibiscus flower in Shami flower bell flower

Puja Flowers on Hibiscus flower in Shami flower bell flower

3) శివుని కోసం గంట పువ్వు… గంట పుష్పం కేవలం శివునికి మాత్రమే కాదు.. దేవుళ్ళు అందరికీ ప్రీతికరమైనవి.. దైవిక దృక్కోణం నుంచి ఇది శివునికి అత్యంత ఇష్టమైన పువ్వుగా అంటుంటారు. శివున్ని పూజలో ఈ పుష్పం సమర్పించడం వలన కోరుకున్న సంపదలను లభిస్తాయని నమ్ముతూ ఉంటారు. శివున్ని పూజించేటప్పుడు ఈ పువ్వుని పెట్టడం వలన అన్ని కోరికలు నెరవేరుతాయి. అని నమ్ముతుంటారు.

4) లక్ష్మీదేవి పూజలో తామర పువ్వు… లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన ఇంట్లో పేదరికం ఏనాటికి కలగదు. లక్ష్మీదేవికి తామర పువ్వులు అంటే చాలా ప్రీతికరం మీ ఇష్టానుసారం లక్ష్మీదేవికి ఏ పుష్పమైన సమర్పించవచ్చు అని తెలియజేస్తూ ఉంటారు. కానీ మీరు లక్ష్మీదేవికి సమర్పించే పువ్వులు ఎప్పుడు చెడిపోకూడదు… పొడిబారకుండా ఉండాలని గుర్తుపెట్టుకోండి..

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది