Rahu Transit In Aquarius : కుంభ రాశిలో రాహు సంచారం : వీరికి బంగారు కాలం వస్తోంది!
ప్రధానాంశాలు:
Rahu Transit In Aquarius : కుంభ రాశిలో రాహు సంచారం : వీరికి బంగారు కాలం వస్తోంది!
Rahu Transit In Aquarius : రాహువును క్రూరమైన దుష్ట గ్రహంగా పరిగణిస్తారు, అందుకే దాని పేరు వింటేనే ప్రజలు ఆందోళన చెందుతారు. జ్యోతిషశాస్త్రంలో రాహువు ఊహించని ఫలితాలను అందించే గ్రహంగా పిలువబడతాడు. ఈ గ్రహం నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒక వైపు, రాహువు కఠినమైన మాటలు, జూదం, దొంగతనం, అనైతిక పనులు మరియు చర్మ వ్యాధులను సూచిస్తాడు. మరోవైపు రాహువు అనుకూల ప్రభావంతో ఒక వ్యక్తి అన్ని రకాల భౌతిక సుఖాలు, కీర్తి, విలాసం, పరిపాలనా పాత్రలలో విజయం, రాజకీయ మరియు దౌత్య విజయాలు మరియు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అందువల్ల, రాహువు అన్ని గ్రహాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాడని, జీవితాన్ని సానుకూలంగా మరియు ప్రతికూలంగా ప్రభావితం చేసే అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడని మనం చెప్పవచ్చు. ఇప్పుడు, రాహువు తన రాశిచక్ర చిహ్నాన్ని మార్చుకోబోతున్నాడు. రాహువు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి నేటి నుండి అదృష్టం కలిసి రాబోతుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మేషరాశి
కుంభరాశిలో రాహువు సంచారం మేషరాశి జాతకులకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. మేషరాశి వారి ఆదాయం పెరుగుతుంది. వీరికి మంచి రోజులు వస్తున్నాయి.
మిధున రాశి
రాహువు సంచారం కారణంగా మిధున రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఈ సమయంలో మిధున రాశి వారు నూతన వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలు చేసే వారిని అన్ని విధాల శుభాలు చేకూరుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఎప్పటినుంచో పూర్తికాని పనులు పూర్తవుతాయి. మిధున రాశి వారికి ఇది అదృష్ట సమయం.
కర్కాటక రాశి
రాహువు సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులకు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వీరికి కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ఉద్యోగం చేసే వారికి పురోగతి కనిపిస్తుంది. ఆఫీసులో సహోద్యోగులు సహకారాన్ని అందిస్తారు. కొత్త పనులు మొదలుపెట్టి సక్సెస్ కావడానికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు రాహువు సంచారం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. రాహువు రాశి మార్పు ధనుస్సు రాశి వారికి మంచి లాభాలను చేకూరుస్తుంది . ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి అంతా సంతోషంగా ఉంటారు. ధనుస్సు రాశి వారికి ఇది శుభ సమయం.