Chanakya Niti stay in such places is not wrong for anyone
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవన నైపుణ్యాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. చాణక్యుడి ప్రకారం, ఈ సూత్రాలు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనవి. కాబట్టి జీవితంలో వీటిని ఎప్పుడూ గౌరవించాలని ఆయన నమ్మారు. ఆచార్య చాణక్య గొప్ప ఆర్థికవేత్త, సాయుధ వ్యూహకర్త. పలు నైతిక విలువలను బోధించి ప్రజలకు మంచి మార్గదర్శకత్వాన్ని చూపించాడు. అతని విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి.సమాజంపై ఆయనకు లోతైనా అవగాహన ఉంది. చంద్ర గుప్త మౌర్యుడు మగధకు చక్రవర్తి కావడంలో చాణక్యుడు కీలక పాత్ర పోషించారు. ఆయన రాసిన నీతిశాస్త్రం ప్రకారం..
సంతోషకరమైన జీవితాన్ని గడపాలంటే జీవితంలో కొన్ని సూత్రాలు, క్రమశిక్షణ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి తన జీవితంలో చాణక్యుడి విధానాలను అవలంబిస్తే, వారి జీవితం సంతోషంగా, ప్రశాంతంగా గడిచిపోతుందని వివరించారు.మనిషికి కష్టాలు సహజం. జీవితంలో తన కలలను సాకారం చేసుకోవాలంటే ఆ కష్టాలను ధైర్యంగా ఎదర్కోవాలి. తెలివిగా పరిష్కరించుకోవాలి. అప్పుడే తన కలలను నెరవేర్చుకోగలుగుతాడు. ధైర్యంగా లేకుంటే లక్ష్యసాధన అంత సులువు కాదని చాణక్యుడు తెలిపారు.చాణక్య నీతి ప్రకారం కోపాన్ని అదుపు చేసుకోలేని వారు జ్ఞానం ఉన్నప్పటికీ అజ్ఞాని లాంటివాడు. ఎందుకంటే కోపంగా ఉన్నప్పుడు ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. కాబట్టి తన కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి.
remember these things of chanakya Niti then life will be spent peacefully
అత్యాశ అనేది వ్యక్తిని చెడు కర్మల వైపుకు నెట్టివేస్తుంది. ఒక వ్యక్తి యొక్క మనస్సులో చేరిన అత్యాశ అతనిని తప్పుడు దారి పట్టిస్తుంది. అందుకే అత్యాశ అనే భావం ఉండకూడదు. అత్యాశను ప్రతిఒక్కరూ నియంత్రించడం ముఖ్యం. మనసులో జ్ఞాన సముపార్జనపై అత్యాశ ఉండాలి.మీరు ఎంత సంపాదించినా మీలో అహం ఉన్నట్లయితే గౌరవాన్నితగ్గిస్తుంది. అహం ఉన్న వ్యక్తి ఆనందానికి దూరం అవుతాడు. ఇతరులను చిన్నవారిగా భావిస్తాడు. అలాంటి వారు నాశనమవడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాగే జీవితం సంతోషంగా ఉండాలంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అనారోగ్యకరమైన శరీరం కలల సాధనలో అడ్డుపడుతుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చాణక్య తన నీతి శాస్త్రంలో బోధించాడు.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.