ఏ దిక్కులో దీపం పెడితే ఏం ఫలితం ?
దీపారాధన.. అనేక శుభాలకు నిలయం. జ్ఞానానికి ప్రతీక. సాక్షాత్తు కార్తీకేయ స్వరూపంగా దీపాన్ని భావిస్తారు. హిందూ మతంలో దీపారాధన లేకుండా ఏ పని చేయరు. అలాంటి దీపారాధన చేసే సమయంలో అనేక సందేహాలు.. వాటిలో దీపం ఏ దిక్కులో పెట్టాలి. ఏ దిక్కులో పెడితే ఏం ఫలితం వస్తుంది. దీనికి పెద్దలు చెప్పిన విషయాలు తెలుసుకుందాం…
తూర్పు -కష్టములు తొలగును , గ్రహ దోషములు పోతాయి. పశ్చిమ దిక్కుకు అప్పుల బాధలు , గ్రహ దోషములు , శని దోషములు తొలగును. దక్షిణం – దీపము వెలిగించరాదు.. కుటుంబమునకు కష్టము కలుగును. ఉత్తరం : ధనాభివృద్ధి, కుటుంబము లో శుభ కార్యములు జరుగును. ఇక దేవుడికి ఎదురుగా రెండు దీపాలు పెడితే అవి ఏ దిక్కులో ఉన్నా ఇబ్బంది ఉండదు. దీపారాధన చేసినప్పుడు భక్తితో చేయాలి. ఒకే కుంది లేదా ప్రమిదలో నాలుగు దిక్కులకు వత్తులు వేసి నాలుగు వెలిగిస్తే దోషం ఉండదు. సకల శుభాలకు ప్రతీక. ఇక దీపం కుంది లేదా ప్రమిదలో దీపం ఊర్ధ్వ్ ముఖం అంటే ఏ దిక్కు కాకుండా మధ్యలో పైకి ఉంటే ఎటువంటి దోషం ఉండదు. శుభ ఫలితాన్నిస్తుంది.