Home » Devotional » Shani Saturn Transit With Silver These Zodiac Signs Get More Wealth
Devotional

Shani : వెండి పాదంతో సంచరించనున్న శనీశ్వరుడు… ఈ రాశుల వారికి సిరులపంటే…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: November 23, 2024, 8:04 am
Advertisement

Shani  : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని రాశుల వారి జీవితాలపై సానుకూల ప్రభావాలు కలుగుతాయి. ఈ నేపథ్యంలోనే శని గ్రహం తన రాశిని మార్చుకోవడం తో పాటు రాశిని బట్టి పాదం కూడా మారుస్తుంది.

Advertisement

Shani  : వెండి పాదంతో నడిచే శని..

శనీశ్వరుడు నాలుగు పాదాలతో నడుస్తాడు. ఇక నాలుగు పాదాలు అంటే బంగారం రాగి వెండి మరియు ఇనుము. అయితే వేద శాస్త్రంలో వెండి పాదాలను చాలా పవిత్రంగా భావిస్తారు. ఇలా శని గ్రహం వెండి పాదంతో 2025 వ సంవత్సరంలో సంచరించడం వలన కొన్ని రాశుల వారికి సంపద మరియు పురోగతి లభిస్తుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Shani : వెండి పాదంతో సంచరించనున్న శనీశ్వరుడు… ఈ రాశుల వారికి సిరులపంటే…!

Advertisement

కర్కాటక రాశి : మీనరాశిలో శని వెండి పాదంతో సంచరించడం వలన కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఇక విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టిన అందులో ఆటంకాలు అన్ని తొలగి విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి జాతకులకు శని వెండి పాదంతో సంచరించడం వలన వీరికి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఇక ఈ సమయంలో నూతన ఆదాయం మార్గాలు తేరచుకుంటాయి. సమాజంలో గౌరవంతో పాటు పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి. ఈ రాశి వారు ఈ సమయంలో నూతన భవనాలను భూములు లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Advertisement

కుంభరాశి : మీన రాశిలో శని వెండి పాదంతో సంచరించడం వలన కుంభరాశి వారికి కలిసి వస్తుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. గతంలో నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక మీరు జీవితంలో సంతోషం నెలకొంటుంది. అయితే ఈ రాశి వారు ఈ సమయంలో శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి