Shani : వెండి పాదంతో సంచరించనున్న శనీశ్వరుడు… ఈ రాశుల వారికి సిరులపంటే…!
ప్రధానాంశాలు:
Shani : వెండి పాదంతో సంచరించనున్న శనీశ్వరుడు... ఈ రాశుల వారికి సిరులపంటే...!
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని రాశుల వారి జీవితాలపై సానుకూల ప్రభావాలు కలుగుతాయి. ఈ నేపథ్యంలోనే శని గ్రహం తన రాశిని మార్చుకోవడం తో పాటు రాశిని బట్టి పాదం కూడా మారుస్తుంది.
Shani : వెండి పాదంతో నడిచే శని..
శనీశ్వరుడు నాలుగు పాదాలతో నడుస్తాడు. ఇక నాలుగు పాదాలు అంటే బంగారం రాగి వెండి మరియు ఇనుము. అయితే వేద శాస్త్రంలో వెండి పాదాలను చాలా పవిత్రంగా భావిస్తారు. ఇలా శని గ్రహం వెండి పాదంతో 2025 వ సంవత్సరంలో సంచరించడం వలన కొన్ని రాశుల వారికి సంపద మరియు పురోగతి లభిస్తుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
కర్కాటక రాశి : మీనరాశిలో శని వెండి పాదంతో సంచరించడం వలన కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఇక విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టిన అందులో ఆటంకాలు అన్ని తొలగి విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి జాతకులకు శని వెండి పాదంతో సంచరించడం వలన వీరికి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఇక ఈ సమయంలో నూతన ఆదాయం మార్గాలు తేరచుకుంటాయి. సమాజంలో గౌరవంతో పాటు పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి. ఈ రాశి వారు ఈ సమయంలో నూతన భవనాలను భూములు లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
కుంభరాశి : మీన రాశిలో శని వెండి పాదంతో సంచరించడం వలన కుంభరాశి వారికి కలిసి వస్తుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. గతంలో నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక మీరు జీవితంలో సంతోషం నెలకొంటుంది. అయితే ఈ రాశి వారు ఈ సమయంలో శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది.