Categories: DevotionalNews

Maha Shivaratri : శివరాత్రి రోజున చిలకడదుంప్పే తినాలా… జాగారం ఉపవాసాల తర్వాత… దీన్ని తింటే…?

Maha Shivaratri : మన సంస్కృతిక ఆచారాలలో పండుగలకు ఎంతో ప్రతిష్ట ఉంది. అందులో మహాశివరాత్రి Maha Shivaratri కూడా ఎంతో ప్రఖ్యాతను పొందింది. మహా శివరాత్రి Maha Shivaratri పర్వదినాన ఆ మహా శివుని , భక్తిశ్రద్ధలతో అభిషేకిస్తూ, ఉపవాస దీక్షలు, జాగారాలు చేసినచో ఆ శివుని యొక్క కటాక్షం తమ భక్తులపై ఎల్లప్పుడూ ఉంటుంది. కోరిన కోరికలన్నీ తీరుతాయి. అయితే ఆ మహాశివరాత్రి రోజున ప్రజలు ప్రజలు ఉపవాస దీక్షను పాటిస్తారు. అయితే ఉపవాసం అనంతరం తీసుకునే ఆహారంలో ముఖ్యంగా చిలకడదుంపలు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ విషయం గురించి మీకు తెలుసా…? అయితే చాలామంది భక్తులు శివరాత్రి రోజున చిలకడ దుంపలు తినడంలో ఎంతో ఆసక్తిని చూపిస్తారు. మరి భక్తులు ఎక్కువగా ఈ చిలకడదుంపలను ఉపవాస దీక్షను విరమించిన తరువాత ఎక్కువగా తీసుకోవడానికి గల కారణాలు తెలుసుకుందాం..

Maha Shivaratri : శివరాత్రి రోజున చిలకడదుంప్పే తినాలా… జాగారం ఉపవాసాల తర్వాత… దీన్ని తింటే…?

భక్తులు మహా శివరాత్రి Maha Shivaratri నాడు ఉపవాసము మరియు జాగారాలను విరమించుకున్న తరువాత. చిలకడ దుంపలను ఆహారంగా తీసుకుంటారు. ఎందుకంటే ఆరోగ్యకరమైన కారణాలు కూడా ఉన్నాయి.ఈ చిలకడదుంపలను ప్రాంతాల బట్టి, ఆయా ప్రాంతాలలో ధనసుగడ్డలు, రత్నపురి గడ్డలు ఆంటీ పేర్లతో పిలవడం జరుగుతుంది. అయితే ఈ స్వీట్ పొటాటో లో ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈజీగా లభ్యమవుతున్నాయి. ఈ చిలకడదుంపలను తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అనే నిపుణులు చెబుతున్నారు. మరి చిలకడదుంపలు బెస్ట్ ఫుడ్ గా కూడా చెప్పబడినది. ఇది దాదాపు 5000 సంవత్సరాల నుంచి మన ఆహారంలో భాగంగా చేరుతుంది. వరి, గోధుమ, మొక్కజొన్న, బంగాళదుంపలతో పాటు ప్రధానమైన పంటల్లో చిలకడదుంప కూడా ఒకటి. శివరాత్రి రోజున భక్తులు ఉపవాసాన్ని పాటిస్తారు. చిలకడ దుంపలను ఆరోజు తినడం వలన కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఈ చిలకడ దుంపలు శరీరానికి ఎక్కువ సేపు శక్తిని కూడా అందిస్తాయి. శివరాత్రి రోజు రాత్రిపూట జాగారం చేసే భక్తులకు నిద్ర లేకుండా ఉండడానికి ఈ చిలకాడ దుంపలను ఆహారంగా చేర్చుకుంటారు. దుంపల్లో పోషకాలు కూడా అనేకం. వీటిలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ, సి, b6, పొటాషియం, ఫైబర్ ఇవి కలిగి ఉండడం వల్ల పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అవునా శరీర బరువును కూడా తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. సర్ కణాలతో పోరాడగల శక్తి కూడా కలిగి ఉంటుంది.

ఈ చిలకడ దుంపల వల్ల పీచు పదార్థాన్ని కలిగి ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా బాగుంటుంది. ఫలితంగా మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఇందులో ఉండే ఖనిజాల వలన కండరాలు మరియు వాటి కదలికలు, ఎముకల బలానికి సహాయపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి ద్వారా క్యాన్సర్ వ్యాధుల నుంచి మరియు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతుంది.
ఈ చిలకడదుంపలలో విటమిన్ ఏ ఉండడం వల్ల కళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కావున కంటికి సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. పొటాషియం కూడా ఉంటుంది కాబట్టి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. తద్వారా రక్తపోటును కూడా నియంత్రించవచ్చు. చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. చిన్నపిల్లలకు జీలకర్ర దుంపలను పరిచయం చేస్తే చాలా మంచిది. పిల్లల్లోని శారీరక మరియు మానసిక ఎదుగుదలను ఎంతో బాగా సహాయపడుతుంది. ఇంకా గర్భిణీలకు కూడా చిలకడదుంపల ఆహారం చేర్చుకుంటే ఇంకా మంచిది. గర్భంలో ఉన్న శిశువును ఎంతో ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ చిలకడదుంపలు చర్మానికి మరియు జుట్టుకు కూడా మంచిది. దీంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి కాంతివంతమైన చర్మాన్ని ఇస్తుంది. ఇందులో విటమిన్ ఏ ఉండడం వల్ల జుట్టును బలంగా ఉంచగలదు. అధిక బరువుతో బాధపడే వారు కూడా ఈ చిలకడ దుంపలను ట్రై చేయవచ్చు. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు పదార్థాన్ని కలిగి ఉంటుంది. దీంతో కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఎక్కువసేపు శక్తిని అందించడమే కాకుండా నీరసం, అలసట తగ్గిస్తుంది. మరి చిలకడ దుంపలను మీరు ఉపవాస దీక్ష రోజున ఉపవాసం విరమించిన తరువాత దీన్ని గనక తీసుకుంటే. ఇప్పటివరకు మీరు అలసిపోయి ఉన్నా మీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఎన్నో పోషక విలువలు అన్ని అందించే శక్తి ఉంటుంది. కాబట్టి మహాశివరాత్రి రోజున ఆరోగ్యకరమైన ఈ దుంపలను తప్పకుండా ఆహారంగా చేర్చుకుంటే మీకు మంచి ఆరోగ్యము ఉంటుంది. ఆ పరమశివుని యొక్క దీవెన కూడా ఉంటుంది.

Recent Posts

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

17 minutes ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

1 hour ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

3 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

5 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

7 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

9 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

10 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

11 hours ago