Categories: Jobs EducationNews

TGSRTC లో1500 భారీ ఉద్యోగాల నోటిఫికేష‌న్‌.. జీతం 25000.. !

TGSRTC  : తెలంగాణ ఆర్టీసీలో Telangana RTC ఉద్యోగాల నియామ‌కాల‌పై ఎప్పుడు చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. ‘టీజీపీఎస్సీ’ కమిషన్‌ ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. దశాబ్దాలుగా అంతర్గత ఉద్యోగాల నియామకాలను సొంతంగా ఆర్టీసీ సంస్థనే చూస్తూ వచ్చింది. కానీ గత ప్రభుత్వం ఓ దశలో దీనిని ప్రశ్నించింది. ప్రభుత్వ సంస్థల్లో అన్ని రకాల నియామకాలను టీఎస్‌పీఎస్‌సీ పర్యవేక్షిస్తుండగా.. ఆర్టీసీ RTCలో మాత్రం ఆ సంస్థనే చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే.. కొత్త ప్రభుత్వం తొలిసారి ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన తరుణంలో తెలంగాణ పబ్లిక్‌ కమిషన్‌ ద్వారా ఆర్టీసీ ఉద్యోగాల నియామకాలు జరుగుతాయని అన్నారు.

TGSRTC లో1500 భారీ ఉద్యోగాల నోటిఫికేష‌న్‌.. జీతం 25000.. !

అయితే ఇప్పుడు ఆర్టీసీలో డ్రైవ‌ర్ల కొర‌త ఉన్న నేప‌థ్యంలో తొలిసారి ఔట్ సోర్సింగ్ ప‌ద్ద‌తిలో కొంత‌మంది డ్రైవ‌ర్స్‌ని నియ‌మించ‌బోతున్నారు. 1500మంది డ్రైవ‌ర్ల‌ని Drivers వెంట‌నే నియ‌మించుకొని రెండు వారాల శిక్ష‌ణ ఇచ్చి బ‌స్సులు అప్ప‌గించ‌నున్నారట‌. ప్ర‌స్తుతం ఆర్టీసీలో స‌గ‌టున నెల‌కి 50 మంది చొప్పున డ్రైవ‌ర్స్ రిటైర్ అవుతున్నారు. అలానే డ్రైవ‌ర్ల కొర‌త క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చింది. వేస‌వి సెల‌వులు వ‌స్తున్న నేప‌థ్యంలో బ‌స్సులు ఎక్కువ తిప్పాలి కాబ‌ట్టి 1500 మంది డ్రైవ‌ర్ల‌ని తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌.

ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్‌లో న‌మోదైన అర్హుల‌ని నేరుగా కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో Contract తీసుకోవాల‌ని ఆర్టీసీ భావిస్తుంది. మ్యాన్ ప‌వర్ స‌ప్ల్ల‌యింగ్ సంస్థ‌ల నుండి తీసుకుంటే ఔట్ సోర్సింగ్ ప‌ద్ద‌తిలో తీసుకుంటారు. హెవీ వెహిక‌ల్ లైసెన్స్ , భారీ వాహ‌నాలు న‌డ‌ప‌డంలో 18 నెల‌ల అనుభ‌వం ఉండాలి. ఎత్తు 160 సెం.మీకి త‌గ్గ‌కుండా ఉండాలి. ఏదైన ప్రాంతీయ భాష‌లో చ‌ద‌వడం, రాయ‌డం రావాలి. 60 ఏళ్ల లోపు వ‌య‌స్సు ఉండాల‌. వారికి 2024లో నిర్ధారించిన నెల‌వారీ కన్సాలిడేట్ రెమ్యున‌రేష‌న్ రూ.22415 చెల్లించ‌నున్నారు. జంట న‌గ‌రాల ప‌రిధిలో అయితే రూ. 200, బ‌య‌ట అయితే వంద రూపాయ‌ల చొప్పున చెల్లిస్తారు. డ్రైవ‌ర్ల అర్హ‌త‌లు ప‌రిశీలించేందుకు డిపో స్థాయిలో అధికారుల క‌మిటీ, డ్రైవింగ్ నైపుణ్యం అంచ‌నా వేసేందుకు ఓ టెక్నిక‌ల్ క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని సంస్థ నిర్ణ‌యించింది.

Recent Posts

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

2 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

3 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

5 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

7 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

9 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

11 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

12 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

13 hours ago