Maha Shivaratri 2025 Date : 2025 వ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు… సమయం మరియు తేదీలు ఎప్పుడు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Maha Shivaratri 2025 Date : 2025 వ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు… సమయం మరియు తేదీలు ఎప్పుడు…?

 Authored By ramu | The Telugu News | Updated on :21 February 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Maha Shivaratri 2025 Date : 2025 వ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు... సమయం మరియు తేదీలు ఎప్పుడు...?

Maha Shivaratri 2025 Date : ప్రతి సంవత్సరము కూడా మహాశివరాత్రి Maha Shivaratri 2025 Date నే హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ పండుగను మన హిందువులు, భక్తిశ్రద్ధలతో, జాగారాలతో కటిక ఉపవాసాలతో ఆ శివుని మహాశివరాత్రి Maha Shivaratri 2025 Date నాడు ఆరాధిస్తారు. ఈ మహాశివరాత్రి పండుగను ఆ శివయ్యకే అంకితం చేశారు. శివయ్య ఆధ్యాత్మిక శక్తికి ప్రతిక. ఆ రోజున భక్తులందరూ కూడా శివున్ని ప్రత్యేకంగా పూజించి ఆయన కృపకు ఆధ్యాత్మిక శక్తికి పాత్రులవుతారు. అయితే ఈ 2025 వ సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి 26 నాడా..లేదా 27 అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. అయితే మహాశివరాత్రి ఏ తారీఖున జరుపుకుంటున్నారు తెలుసుకుందాం….

హిందూ ధర్మంలో శైవ సంప్రదాయం ప్రకారం మహాశివరాత్రి Maha Shivaratri 2025 Date  రోజున శివుడు తన దివ్య నృత్యాన్ని చేశారని నమ్ముతారు. ఈ నృత్యం, సృష్టి, సంరక్షణ వినాశనాన్ని సూచిస్తుంది. కొంతమంది చెప్పే పురాణాల ప్రకారం శివుడు పార్వతి దేవిని వివాహం చేసుకున్న మహాపరమదినం అని చెబుతారు. రోజు భక్తులు ప్రగాఢ విశ్వాసంతో ఉపవాసం చేస్తారు. మహాశివుని ఆశీస్సులు పొందేందుకు రాత్రంతా జాగారంగా మేలుకొని శివా నామ స్మరణ చేస్తారు. రోజున భక్తులందరూ కూడా ఆలయాలకు వెళ్లి శివున్ని అభిషేకించి శివ దర్శనం చేసుకుంటారు. అయితే 2025లో మహాశివరాత్రి ఫిబ్రవరి 26 బుధవారం నాడు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మాఘమాసంలో క్లిష్టపక్షంలో చతుర్దశి తిధి అంటే 26 ఫిబ్రవరి 2025 బుధవారం ఉదయం 11:08 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మరుసటి రోజు సాయంత్రం ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8:54 గంటలకు ముగుస్తుంది. నిషిత కాల పూజ అంటే అర్థరాత్రి పూజ ఫిబ్రవరి 27న12:09 am నుండి12:59 am వరకు జరుగుతుంది. రోజు అర్ధరాత్రి నిషిత కాల పూజ జరుపుకోవడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తున్నారు.

Maha Shivaratri 2025 Date 2025 వ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు సమయం మరియు తేదీలు ఎప్పుడు

Maha Shivaratri 2025 Date : 2025 వ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు… సమయం మరియు తేదీలు ఎప్పుడు…?

Maha Shivaratri 2025 Date మహాశివరాత్రి ఎప్పుడు

అయితే మహాశివరాత్రి నాడు భక్తులు శివాలయానికి వెళ్లి శివలింగమునకు పాలు, తేనె, గంధం, బిలువ పత్రాలు, పువ్వులతో అభిషేకం చేస్తారు. పంచామృతులతో అభిషేక ప్రియునికి అభిషేకం చేస్తారు. ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి ఆ రోజు అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఆ శివుని యొక్క సేవ చేస్తే మనకు దోషాలు అన్ని తొలగిపోతాయి అని నమ్ముతారు. శాంతి కలుగుతుంది. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. శివుడి ఊరేగింపులు,హోమాలు, రుద్రాభిషేకం, కీర్తనలు జరుగుతాయి. రోజంతా జాగారం ఉండి భజనలు,కీర్తనలు చేస్తారు.

ఆ మహాశివరాత్రి రోజున భక్తులందరూ కూడా ఉపవాస దీక్షను పాటిస్తారు. పండ్లు పాలు తేనె వంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. సాయంత్రం లేదా ఉదయము ఉపవాస విరమణ చేస్తారు. ఈ పండుగ రోజున ఉపవాస దీక్షలు పాటిస్తే శివ భక్తులకు ఎంతో శక్తి లభిస్తుంది. చేసిన కర్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. శివ అనుగ్రహం లభిస్తుంది. భక్తి విశ్వాసంతో శివుని సేవిస్తే అన్ని కష్టాలు తొలగి మోక్షం సిద్ధిస్తుంది.అని పురాణాలు చెప్పబడుతున్నాయి. ఆ మహాశివరాత్రి రోజున మనసును శుభ్రంగా ఉంచుకొని భగవంతునిపై జ్ఞానం పెట్టి ఎంతో మంగళకరంగా ఆయనను పూజించాలి. అభిషేకించి ఉపవాస దీక్షలతో జాగారాలు చేస్తే ఆయన కృపకు మీరు పాత్రులు అవుతారు. ఆయన దీవెన మీకు ఎల్లప్పుడూ ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది