Shravana Masam 2024 : శ్రావణమాసం వచ్చింది.. బంగారం రేటు తగ్గింది… చేతిలో డబ్బు లేకున్నా బంగారం కొనేయొచ్చు.. ఎలానో తెలుసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shravana Masam 2024 : శ్రావణమాసం వచ్చింది.. బంగారం రేటు తగ్గింది… చేతిలో డబ్బు లేకున్నా బంగారం కొనేయొచ్చు.. ఎలానో తెలుసుకోండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :6 August 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Shravana Masam 2024 : శ్రావణమాసం వచ్చింది.. బంగారం రేటు తగ్గింది... చేతిలో డబ్బు లేకున్నా బంగారం కొనేయొచ్చు.. ఎలానో తెలుసుకోండి..!

Shravana Masam 2024 : శ్రావణ మాసం వచ్చింది అంటే తెలుగు లోగిళ్లలో పండుగ సంబరాలు మొదలైనట్టే. ఈ నెల నుంచి పండుగలు శుభారంభం అవుతాయి. ఐతే మన వాళ్లకు పండుగ అంటే చాలు ముందు బంగారాన్ని ఇంటికి తెచ్చుకుందాం అన్నట్టుగా ఉంటుంది. ఓ పక్క గోల్డ్ రేటు చూస్తే ఆకాశాన్ని తాకుతున్నాయి. మొన్నటిదాకా తులం 70, 75 వేల దాకా వెళ్లిన బంగారం రేటు కేంద్రం సుంకం తగ్గించడం వల్ల రేటు తగ్గింది. అంతేకాదు బులియన్ మార్కెట్ దూసుకుపోవడం వల్ల కూడా ఆ ఎఫెక్ట్ బంగారం మీద పడింది. ప్రస్తుతం 6 వేల దాకా తగ్గి 65 వేలకు అటు ఇటుగా ఉంది. ఐతే ఇలాంటి టైం లోనే శ్రావణ మాసం వచ్చింది కాబట్టి బంగారం కొనేందుకు ఇదే మంచి టైం అని అంటున్నారు. మళ్లీ రేటు పెరిగే వరకు వెయిట్ చేయకుండా బంగారు నగలు ఇంటికి తెచ్చుకుంటే బెటర్ అని అంటున్నారు. ఇదే కాదు వెండి మీద కూడా రేటు తగ్గింది. మొన్నటిదాకా కిలో లక్ష దాకా ఉన్న వెండి కొంత తగ్గుముఖం పట్టింది.

Shravana Masam 2024 పాత బంగారంతో కొత్త బంగారం కొనే ప్లాన్..

ఐతే చేతిలో డబ్బులు లేకపోయినా బంగారం ఎలా కొనాలంటే కొత్త ఐడియాలు ఇస్తున్నారు కొందరు నిపుణులు. ఏముంది ఇంట్లో పాత బంగారం ఉంటుంది. దాన్ని బ్యాంక్ లో పెట్టి లోన్ తీసుకుని ఆ డబ్బుతో కొత్త బంగారం తీసుకోవచ్చు అంటున్నారు. నెల నెల వడ్డీ కూడా ఖర్చు లేదు కాబట్టి బ్యాంక్ లో పెట్టిన బంగారం కోసం కొంత వాయిదా పద్ధతిలో పే చేస్తూ దాన్ని విడిపించుకోవచ్చు.

Shravana Masam 2024 శ్రావణమాసం వచ్చింది బంగారం రేటు తగ్గింది చేతిలో డబ్బు లేకున్నా బంగారం కొనేయొచ్చు ఎలానో తెలుసుకోండి

Shravana Masam 2024 : శ్రావణమాసం వచ్చింది.. బంగారం రేటు తగ్గింది… చేతిలో డబ్బు లేకున్నా బంగారం కొనేయొచ్చు.. ఎలానో తెలుసుకోండి..!

ఐతే పాత బంగారం ఎంత ఉందో దానికి ప్రస్తుతం ఇస్తున్న బ్యాంక్ రేటు సరిచూసుకుని లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఐతే బ్యాంక్ లోన్ తీసుకుని ఇప్పుడు తగ్గిన బంగారం రేటుతో కొనుగోలు చేస్తే రాబోయే రోజుల్లో రేటు పెరిగినా బాధపడాల్సిన అవసరం ఉండదు. సో చేతిలో డబ్బులు ఉన్నా లేకపోయినా ఈ నెల లో బంగారం కొనే ప్లాన్ చేయొచ్చని అంటున్నారు. ఐతే ఇలా లోన్ తీసుకుని ఉన్న బంగారం తాకట్టు పెట్టడం ఇష్టం లేని వారు తమ దగ్గర ఉన్న మొత్తం తో అయినా బంగారం కొనుగోలు చేయొచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది