Karthika Masam : కార్తీకమాసంలో నది స్థానం ఎందుకు చేయాలి… శాస్త్రం ఏం చెబుతోందంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Masam : కార్తీకమాసంలో నది స్థానం ఎందుకు చేయాలి… శాస్త్రం ఏం చెబుతోందంటే…!

Karthika Masam : కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా చెప్పుకుంటారు. ఇక ఈ నెలలో చేసే నది స్థానానికి దీప దానానికి మరియు శివ కేశవుల పూజకు ఎంతో విశిష్టత ఉంటుంది. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందుగానే ప్రవహించే నీటిలో నెలరోజుల పాటు స్నానం చేస్తారు. సాధారణంగా కార్తీక మాసం లోనే చలి తీవ్రత మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే చలికాలంలో శరీరం దృఢంగా ఉండడానికి అదేవిధంగా వాతావరణానికి అనుకూలంగా తనని తాను మలుచుకునేందుకు కార్తీక మాసంలో తెల్లవారుజామున […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 November 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Karthika Masam : కార్తీకమాసంలో నది స్థానం ఎందుకు చేయాలి... శాస్త్రం ఏం చెబుతోందంటే...!

Karthika Masam : కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా చెప్పుకుంటారు. ఇక ఈ నెలలో చేసే నది స్థానానికి దీప దానానికి మరియు శివ కేశవుల పూజకు ఎంతో విశిష్టత ఉంటుంది. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందుగానే ప్రవహించే నీటిలో నెలరోజుల పాటు స్నానం చేస్తారు. సాధారణంగా కార్తీక మాసం లోనే చలి తీవ్రత మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే చలికాలంలో శరీరం దృఢంగా ఉండడానికి అదేవిధంగా వాతావరణానికి అనుకూలంగా తనని తాను మలుచుకునేందుకు కార్తీక మాసంలో తెల్లవారుజామున నది స్థానం చెయ్యాలి అనే నియమాన్ని మన పెద్దలు పెట్టారు. అంతేకాకుండా చలిలో వేడి నీటితో కూడా స్నానం చేయవచ్చు. ఇకపోతే చలికాలంలో చల్లటి నీళ్ళు తో స్నానం చేయడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా నిల్వ ఉన్న నీరు ఎక్కువ చల్లగా ఉంటుంది. ఈ క్రమంలోనే భూగర్భం నుంచి వచ్చిన నీరు వెచ్చగా ఉంటుంది. స్నానం చేయడం వలన బద్ధకం తీరడమే కాకుండా శరీరం వెచ్చగా కూడా ఉంటుంది. అందుకే పెద్దలు ఈ నెలలో నది స్నానం చేయాలి అనే నియమం పెట్టి ఉండవచ్చు.

Karthika Masam : నది స్థానం ఔషధ గుణాలు

కార్తీక మాసంలో వచ్చే వరద నీరు అంతా కూడా తేటగా మారుతుంది. ఇక రాళ్ళని వృక్షాలను తాడుకుంటు సాగే నదులు ఆయా ఖనిజాలని మూలికలని తమలో కలుపుకుంటూ ప్రవహిస్తుంది. అలా నదీ జలాలలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో నది స్నానం చేయడం ఆరోగ్యపరంగా ఎంతో మంచిది.

Karthika Masam :  కార్తీక మాసంలో శక్తివంతంగా చంద్రుడు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నీటి మీద మరియు మనుషుల మనసు మీద చంద్రుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో చంద్రుడు చాలా శక్తివంతంగా ఉంటాడు. కనుక ఈ మాసాన్ని ” కౌముది మాసం ” అని కూడా పిలుస్తారు. చంద్ర కిరణాలతో మరియు ఔషధాలతో తడిచిన నదులలో సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వలన ఆరోగ్యం బాగుంటుందని పెద్దల నమ్మకం. ఈ సమయంలో నదులను దైవంగా భావిస్తారు. నదులలో దీపాలను విడిచిపెట్టి భక్తి శ్రద్ధలతో నీటిని పూజిస్తారు. నదిలో లేదా ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు ” గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి.. నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు ” అంటూ నదులను కీర్తిస్తూ ఈ మంత్రాన్ని పటిస్తూ స్నానమాచరిస్తారు.

Karthika Masam కార్తీకమాసంలో నది స్థానం ఎందుకు చేయాలి శాస్త్రం ఏం చెబుతోందంటే

Karthika Masam : కార్తీకమాసంలో నది స్థానం ఎందుకు చేయాలి… శాస్త్రం ఏం చెబుతోందంటే…!

ముఖ్యంగా కార్తీక మాసంలో తెల్లవారుజామున నిద్ర లేచి నదుల దగ్గరకు వెళ్లి స్నానం చేసి సంకల్పం చెప్పుకొని పితృదేవతలను తలుచుకుంటూ దానధర్మాలను చేస్తారు. అలాగే అరటి కాండంలో దీపాలను వెలిగించి నీటిలో వదిలి భగవంతుడిని పూజిస్తారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది