అపశకునం అనుకునేవి ఏవి కనిపించినా.. వెంటనే ఇలా చేయండి!
మనం ఏదైనా పని మీద బయటకు వెళ్లేటపుడు వితంతువు అంటే భర్త చనిపోయిన స్త్రీ ఎదురొచ్చినా అలాగే నల్ల పిల్ల ఎదురొచ్చినా అపశకునంగా భావిస్తాం. కనిపించిన చోటే కాసేపు ఆగి తర్వాత వెళ్తుంటాం. వీటితో పాటు గుడికి వెళ్లినపుడు మనం కొట్టిన కొబ్బరి కాయ కుళ్లిపోయినా లేదంటే మనం హారతి తీసుకునేటపుడు వెంటనే అది ఆరిపోయినా మనకేమైనా జరుగుతుందేమోనని తెగ బాధ పడిపోతుంటాం. అయితే ఇలాంటి వాటిని చూడటం వల్ల నిజంగానే మనకు అపశకునం కల్గుతుందా అనే అనుమానం మనలో చాలా మందికి వస్తుంటుంది. అయితే ఇటీవలే వైరల్ అయిన ఓ న్యూస్ గురించి మనందరికీ తెలుసు.భార్యాభర్తలిద్దరూ గొడవ పడడంతో.. భర్త ఆమెతో మాట్లాడకుండా వెళ్లిపోయాడు. ఆ తర్వా త ఆమె పూజ చేసుకుంటుంజగా.. హారతి ఆరిపోయింది. బొట్టు పెట్టుకునేటప్పుడు పొరపాటున చేజారిపోయింది.
అయితే ఇవన్నీ చూసిన ఆమెకు.. తన భర్త ఏమైనా చేసుకుంటాడేమోనన్న అనుమానం వచ్చింది. వీటినే అపశకునంగా భావించి సెల్ఫీ వీడియోలో ఇవన్నీ చెబుతూ ఆత్మహత్య చేసుకుంది. అయితే వీటిని అపశకునాల భావించిన ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. నిజంగానే ఇలాంటి అపశకునాల వల్ల మన నష్టపోతామా అని చాలా మంది తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. అయితే మనం కూడా ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.అయితే ఏదైనా ప్రమాదం సంభవించే ముందు ప్రకృతి ఇలాంటి సంకేతాలను పురాణ పురుషులు, రుషులకు మాత్రమే ఇచ్చేదట. అలా ప్రమాదాన్ని ముందే పసిగట్టి దేవతలు వీలయినంత వరకు జాగ్రత్త పడేవారట. అయితే ఆ పద్దతులు ఇప్పటి వరకూ అలాగే కొనసాగుతూ వచ్చాయి. అలాగే సునామీ వచ్చే ముందు జంతువులు వాటిని గ్రహణ శక్తి ద్వారా గుర్తించి వేరే ప్రాంతాలకు తరలి వెళ్తాయట. అలా వెళ్లి ప్రాణాలను రక్షించుకుంటాయని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ వాళ్లు కూడా తెలిపారు.
అయితే ప్రకృతిలో నివసించే జంతువులకు తమ, పర అనే బంధాలు ఉండవు. ఎటువంటి ద్వేషం కానీ కోపం కానీ ఉంచుకోవు. వాటికి ఆకలి వేసినపుడు ఇతర జంతువులను వేటాడి తినడం, పడుకోవడం వంటివి మాత్రమే చేస్తాయి. ఆకలి వేసినప్పుడు లేదా తమకు హానీ కల్గించే జంతువులు కనిపించినపుడు మాత్రమే అవి దాడికి సిద్ధం అవుతుంటాయి. అయితే మన పురాణ గ్రంథాల ప్రకారం… మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా స్వచ్ఛంగా ఉన్నవారికి మాత్రమే శకునాల గురించి తెలుస్తాయట. అయితే సామాన్య మానవులకు అది సాధ్యం కాదని చెబుతున్నాయి. ఒకవేళ మన మనసు స్వచ్ఛంగా ఉందని భావిస్తే… మనకు అడ్డుగా వచ్చిన నల్లి పిల్లిని, వితంతువును చూసి ద్వేషించకూడదు. కాసేపు ఆగి పనులు చేసుకుంటే సరిపోతుంది. మనకు అపశకునం వస్తుందని సూచనలు ఇచ్చే వారిని, వాటిని దూషిస్తే.. తర్వాత అవి మనకు అవి సంకేతాలు ఇవ్వవని కూడా వేద పండితులు చెబుతున్నారు.