Induction Stove : ఇక మీదట గ్యాస్‌ స్టవ్‌తో పనిలేదు .. సరికొత్త ఇండక్షన్‌ స్టవ్‌ .. మల్టీ కుకింగ్ మోడ్స్‌.. !

 Authored By suma | The Telugu News | Updated on :16 March 2026,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Induction Stove : ఇక మీదట గ్యాస్‌ స్టవ్‌తో పనిలేదు .. సరికొత్త ఇండక్షన్‌ స్టవ్‌ .. మల్టీ కుకింగ్ మోడ్స్‌.. !

Induction Stove : దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో వంటగదుల్లో ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రజలు వెతుకుతున్నారు. ఈ పరిస్థితిలో ఇండక్షన్ స్టవ్‌లకు భారీ ఎత్తున డిమాండ్ పెరుగుతోంది. గ్యాస్ సిలిండర్ అందుబాటులో లేకపోయినా వంటలో అంతరాయం లేకుండా ఉండేందుకు అనేక మంది ఇండక్షన్ స్టవ్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్‌లోకి వచ్చిన ఒక ప్రత్యేకమైన ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. సాధారణ ఇండక్షన్ స్టవ్‌లలో లాగా ప్రత్యేకమైన ఇండక్షన్ పాత్రలు అవసరం లేకుండా ఏ గిన్నె అయినా దీనిపై పెట్టుకొని వంట చేయవచ్చు. అంతేకాదు గ్యాస్ స్టవ్‌పై వంట చేస్తున్నట్టే అనుభూతి కలుగుతుందని వినియోగదారులు చెబుతున్నారు. ఇలాంటి ప్రత్యేకతలతో అందుబాటులో ఉన్న ఉదితి ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆధునిక ఫీచర్లతో రూపొందించిన ఈ కుక్‌టాప్ ధర సుమారు రూ.2,999గా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

Induction stove price details

Induction Stove : ఇక మీదట గ్యాస్‌ స్టవ్‌తో పనిలేదు .. సరికొత్త ఇండక్షన్‌ స్టవ్‌ .. మల్టీ కుకింగ్ మోడ్స్‌.. !

Induction Stove : ఏ పాత్రనైనా ఉపయోగించే సౌకర్యం

సాధారణంగా ఇండక్షన్ స్టవ్‌లపై వంట చేయాలంటే ఇండక్షన్ బేస్ ఉన్న ప్రత్యేక పాత్రలే అవసరం అవుతాయి. కానీ ఈ ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ విషయంలో అలా కాదు. స్టీల్, అల్యూమినియం, రాగి, మట్టి పాత్రలు, గాజు పాత్రలు ఇలా ఇంట్లో ఉన్న దాదాపు అన్ని రకాల గిన్నెలను ఉపయోగించుకోవచ్చు. ఈ స్టవ్ 2200 వాట్ల హై పవర్ హీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో వంట చాలా వేగంగా పూర్తవుతుంది. టెంపరేచర్‌ను నియంత్రించేందుకు డిజిటల్ టచ్ బటన్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా వంట పూర్తయ్యాక ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే టైమర్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా ఈ స్టవ్‌పై భాగాన్ని సెరామిక్ గ్లాస్‌తో తయారు చేశారు. దీని వల్ల ఇది చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా శుభ్రం చేయడం కూడా సులభంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలను కూడా ఈ గ్లాస్ తట్టుకోగలదని కంపెనీ పేర్కొంది.

Induction Stove : వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు

ఈ ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్‌ను కొనుగోలు చేసే వారికి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే కొత్తగా ఇండక్షన్ పాత్రలు కొనాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో ఉన్న పాత పాత్రలనే నేరుగా వాడుకోవచ్చు. దీంతో అదనపు ఖర్చు తగ్గుతుంది. ఇంకా వేసవికాలంలో గ్యాస్ స్టవ్‌పై మంట ఉండటం వల్ల వంటగది ఎక్కువగా వేడిగా మారుతుంది. కానీ ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్‌లో మంట కనిపించదు. అందువల్ల వేడి తక్కువగా అనిపిస్తుంది. ఫ్యాన్ వేసుకున్నా మంట ఆరిపోతుందేమో అనే ఆందోళన కూడా ఉండదు. ఈ స్టవ్ ఇన్‌ఫ్రారెడ్ కిరణాల ద్వారా పాత్రను నేరుగా వేడి చేస్తుంది. దీంతో వేడి సమానంగా వ్యాపించి ఆహారం అన్ని వైపులా బాగా ఉడుకుతుంది. వంట సమయంలో ఆహారం స్టవ్‌పై పడినా లేదా ఒలికినా పెద్ద సమస్య ఉండదు. గ్లాస్ సర్ఫేస్ కావడంతో తడి బట్టతో సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

Induction Stove : మల్టీ కుకింగ్ మోడ్స్‌తో ప్రత్యేకత

ఈ కుక్‌టాప్‌లో అనేక రకాల కుకింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. దోశలు వేయడం, ఫ్రై చేయడం, పాలు వేడి చేయడం వంటి పనులకు వేర్వేరు మోడ్‌లను ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు చపాతీని పెనం లేకుండానే నేరుగా స్టవ్‌పై వేసి కాల్చే సౌకర్యం కూడా ఉందని కంపెనీ తెలిపింది. అయితే ఈ స్టవ్ ధర, ఫీచర్లు, ప్రయోజనాలు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే వెల్లడించబడ్డాయి. వినియోగదారులు కొనుగోలు చేసే ముందు ఫీచర్లు, ధర వంటి వివరాలను మరోసారి పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

 

 

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి