Spatika Mala : స్పటిక మాల ధరించి పూజిస్తే.. సకల లాభాలు మీతోనే!
Spatika Mala : మనం ఏ దేవుడికి పూజ చేయాలన్నా ముందుగా ఆ దేవుడికి ఏ పూలు ఇష్టం, ఏం ప్రాసాదం ఇష్టమో తెలుసుకొని వాటిని సిద్ధం చేసుకొని పూజలు, పునస్కారాలు చేస్తుంటాం. చివరకు వ్రతాలు చేస్తున్నప్పుడు కూడా అమ్మవారు లేదా స్వామి వారికి ఇష్టమైన వాటినే వండి నైవేద్యంగా సమర్పిస్తాం. మనకు మంచి కలగాలని కోరుకుంటూ… ఆ దేవుళ్లను సంతృప్తి పరిచేందుకు చాలా కష్టపడుతుంటాం. అయితే చాలా మంది లక్ష్మీ దేవి కటాక్షం కోసం పాకులాడుతుంటారు. సిరి సంపదలను ఇచ్చే ఆ అమ్మవారి కోసం ప్రత్యేక పూజలూ చేస్తుంటారు. అందులో భాగంగానే అమ్మవారికి ఇష్టమైన పూలు, పండ్లు, ప్రసాదాలతో ప్రతీ శుక్రవారం అమ్మవారిని కొలుస్తారు.
కానీ చాలా మందికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన స్పటిక మాల గురించి తెలియదు. లక్ష్మీ దేవికి స్పటిక మాల అంటే చాలా ఇష్టం. అయితే అమ్మవారి అనుగ్రహం మనపై ఉండి మన ఇంట్లో సిరి సంపదలు వెల్లి విరియాలంటే తప్పకుండా ఆ తల్లికి స్పటిక మాలతో పూజ చేయాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం స్పటిక మాల ధరించి అమ్మ వారికి పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్ల వేళలా మనపై ఉంటుంది. పర్వతాల పై ఉండే మంచు.. స్పటిక రూపంలో కింద పడుతూ ఉంటుంది. ఈ విధంగా తెల్లని స్వచ్ఛమైన స్పటిక మాల ధరించి అమ్మవారికి పూజ చేయాలని పండితులు చెబుతుంటారు.

spatika mala puja for laxmidevi
ఈ స్పటిక మాల వేసుకొని యోగ, ధ్యానం, దైవ స్తుతి వంటివి చేయడం వల్ల మనకు దేవుడి దయతో పాటు మనశ్శాంతి లభిస్తుందట. మన మనసు ఎల్లప్పుడు నిశ్చలంగా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుందట. అలాగే మన ఇంట్లో ఉండే లక్ష్మీ దేవి విగ్రహం లేదా చిత్ర పటానికి స్పటిక మాల వేసి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. మనం ధరించి పూజ చేసినా… అమ్మవారికి సమర్పించినా అంతే పూజాఫలం పొంద వచ్చని వివరిస్తున్నారు. అయితే అమ్మవారి ఫోటోకి ఎల్లప్పుడు ఇలాంటి స్పటిక మాల వేసి పూజ చేయటం వల్ల ఆ అమ్మ దయ మనపై ఉండి… ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తుందట. అంతే కాదండోయ్ కోరుకోకముందే సిరి సంపదలను అందజేస్తుందట.