Sravana Sukravaram : భక్తితో వేడుకుంటే వరాల అందించే తల్లి వరలక్ష్మి దేవి.. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, ముడుపులు అవసరం లేదు.. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు.. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది.. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది.. సకల శుభాలు కలుగుతాయి.. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి.. శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి .. ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారం లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు.. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది.. సువాసినీయులందరూ చేసే ప్రాభావ వ్రతం.. శ్రీ వరలక్ష్మి నమస్తు వసుప్రదే, సుప్రదే..
శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీ వ్రతంలో ధన, కనక, వస్తు , వాహనాది సమృద్దులకు మూలం శ్రావణ శుక్రవారం తో పాపాలు.. శ్రావణ శుక్రవారం వ్రతాలతో పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.. లక్ష్మీదేవి సంపదల నిచ్చే తల్లి.. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి వరా అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది అటువంటి వరలక్ష్మి దేవిని పూజించేటప్పుడు ఈ రంగు గల చీర కట్టుకుంటే అమ్మవారి దయ మన మీద ఉంటుందట ఇంతకీ ఆ చీర రంగులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. పెళ్లయిన స్త్రీలందరూ ఈ వ్రతాన్ని ఆచరించాలి అని అనుకుంటారు.. తమ భర్త ఆయురారోగ్యం కోసం ఈ వ్రతాన్ని చేస్తారు.. అటువంటివారు అమ్మవారికి ఇష్టమైన రంగు చీర ధరిస్తే అమ్మవారి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు.. ఎన్ని నోములు నోచిన ఎన్ని వ్రతాలు చేసినా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మాకు కలగడం లేదు అని.. బాధపడేవారు కొన్ని విధి విధానాలను తప్పక పాటిస్తే అమ్మవారి అనుగ్రహం దక్కుతుంది..
పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజున పసుపు, పచ్చ, ఆరంజ్ అదే సింధూరం రంగు చీర కట్టుకొని అమ్మవారిని పూజించాలి.. ఈ మూడు రంగులలో ఏ రంగు చీరనైనా కట్టుకొని అమ్మవారిని పూజించవచ్చు అమ్మవారికి ఈ మూడు రంగులలో బాగా ఇష్టమైన రంగు చీర ఏది అంటే పసుపు రంగు.. పసుపు రంగు చీర అది కూడా ప్లేన్ చీర కట్టుకోకూడదు పెళ్లి అయిన ఆడవాళ్లు అసలు ప్లేన్ చీర అనేది కట్టుకోకూడదు.. పసుపు రంగు చీరకి పెద్ద పెద్ద బోర్డర్ ఉన్న చీర కట్టుకోవడం మంచిది.. ఈ మూడు రంగుల చీరల్లో అరచేయి మందం ఉన్న బోర్డర్ ఉన్న చీరలు మాత్రమే కట్టుకోవాలి ఇలా ఈ రంగు చీరలు కనుక కట్టుకొని అమ్మవారిని పూజిస్తే అనుగ్రహం తప్పక మన పైన ఉంటుంది.. పసుపు రంగు చీర లేదు అనుకుంటే పరవాలేదు.. ఆకుపచ్చ రంగు ఈ చీర రంగులకి ఏ రంగు బార్డర్ ఉన్నా కూడా పరవాలేదు.. ఈ రెండు రంగులు కూడా లేకపోతే సింధూరం కలర్ కూడా కట్టుకోవచ్చు.. ఈ రంగుల చీరలతో కనుక కట్టుకొని శ్రావణ శుక్రవారం రోజు ఆ అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం మీ ఇంట కచ్చితంగా ఉంటుంది.. మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి..
ఇక ఆ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అన్నింటిని సమర్పించండి.. ఎన్ని రకాల పూలను అయితే మీరు పెట్టగలరో ఆ అన్ని రకాల పూలను అమ్మవారికి పెట్టండి.. ఇది ఉంది ఇది లేదు అనకుండా అమ్మవారికి కొరత అనేది లేకుండా.. మన శక్తి కొలది పూజిస్తే ఆ అమ్మవారి దయ మన మీద ఖచ్చితంగా ఉంటుంది.. ఈ పూజా విధానం పాటించేటప్పుడు స్త్రీలందరూ నుదిటిపైన కుంకుమ పెట్టుకోవాలి. చేతికి నిండుగా గాజులు ధరించాలి. కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలాగే కాళ్లకు, మెట్టెలు పట్టీలు కచ్చితంగా పెట్టుకోవాలి.. ఒక మాటలో చెప్పాలంటే ఆ అమ్మవారిని చూస్తే ఎలా తలపిస్తారో.. అచ్చం ఇంట్లో స్త్రీలు కూడా అంతే చక్కగా రెడీ అవ్వాలి.. శ్రావణమాసం అంతా కూడా ఇంతే నిండుదనంగా ఉంటే ఆ శ్రావణ లక్ష్మి మన ఇంట్లో తిరుగుతున్నట్టుగా ఉంటుంది.. ఈ చిన్న చిన్న రెమెడీస్ కనుక మీరు గుర్తుంచుకొని అమ్మవారిని పూజించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం తప్పక మీ పైన ఉంటుంది..
Celebrity Couple : ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకుంటున్నారు. ఇన్నేళ్ల సంసారంలో…
Bigg Boss Telugu 8 : ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఇవి చాలా ఎమోషనల్గా…
Brahmam Gari Kalagnanam : ప్రపంచంలో ఒకవైపు ప్రమాదాలు మరోవైపు భారీ నష్టం. ఎక్కడ చూసినా విధ్వంసమే. వరదలు భూకంపాలు అగోరీలు..…
Electric Cycle : మీరు ఉత్తమ శ్రేణి, పనితీరు మరియు ఫీచర్ల యొక్క ఖచ్చితమైన సమ్మేళనాన్ని అందించే విశ్వసనీయ మరియు…
Jamili Elections : కేంద్రం జమిలి దిశగా వేగంగా అడుగులు వేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్ర, జార్ఖండ్ తో…
Face Packs : ఈ మధ్యకాలంలో అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే సంగతి తెలిసిందే. అందులో ఆడవాళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Sukumar : పుష్ప 1 వచ్చి 3 ఏళ్లు అవుతుంది. ఆ సినిమా సీక్వెల్ గా పుష్ప 2 అసలైతే…
Colon Cancer : మీరు మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.? ఏదైనా తిన్న వెంటనే కడుపు నిండుగా అనిపిస్తుందా. మీ సమాధానం…
This website uses cookies.