Delhi : చంద్రబాబు, న‌రేంద్ర‌ మోడీ, వైఎస్ జగన్.. ఈ ఢిల్లీ రాజకీయమేంటబ్బా.?

Advertisement
Advertisement

Delhi : ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ పాల్గొని, నీతి అయోగ్ ముందర రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల్ని ప్రస్తావించారు. నీతి అయోగ్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం వహించిన విషయం విదితమే. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ, వైఎస్ జగన్ మధ్య మాటా మంతీ జరిగింది. వైఎస్ జగన్ భుజం తట్టి మోడీ ప్రోత్సహిస్తున్నట్లుగా ఓ ఫొటో బయటకు వచ్చింది. అంతకు ముందు, ప్రధాని నరేంద్ర మోడీని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కలిశారు.

Advertisement

కేంద్ర ప్రభుత్వం, ఆజాదీ కా అమృత మహోత్సవ్ ఉత్సవాల్ని నిర్వహిస్తున్న దరిమిలా, దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య మాటా మంతీ నడిచాయి. చంద్రబాబుతో ప్రధాని నరేంద్ర మోడీ కరచాలనం కూడా చేశారు.
ఇక్కడ రెండు ముఖ్యమైన పొలిటికల్ డెవలప్మెంట్స్ రాష్ట్రానికి సంబంధించి ఢిల్లీలో జరిగాయి. ఒకటి ప్రధానితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ. ఇంకోటి అదే ప్రధానితో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి భేటీ. రెండూ అధికారిక కార్యక్రమాలే. రెండూ దేశానికి సంబంధించిన కార్యక్రమాలే. ఇవి పూర్తిగా అధికారిక కార్యక్రమాలు. ఈ సమావేశాల్లో రాజకీయాలకు తావుండదు.

Advertisement

Chandrababu, Narendra Modi and YS Jagan, Delhi Times.!

అయితే, ప్రధాని నరేంద్ర మోడీని చాలాకాలం తర్వాత చంద్రబాబు కలిశారనీ, బీజేపీ – టీడీపీ మధ్య మళ్ళీ స్నేహం చిగురిస్తోందనడానికి ఇదే నిదర్శనమనీ టీడీపీ అను‘కుల’ మీడియా ప్రచారం చేస్తోంది. అంతే కాదు, ‘ఢిల్లీకి వస్త వుండండి, నన్ను కలుస్తూ వుండండి..’ అని చంద్రబాబుతో నరేంద్ర మోడీ చెప్పినట్లుగా ఆ మీడియాలోనే వార్తలొచ్చాయి. ఇంతకన్నా భావదారిద్ర్యం ఇంకేమన్నా వుంటుందా.? ఇప్పుడేమీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగడంలేదు. పైగా, టీడీపీ అంటే బీజేపీకి ఒళ్ళు మంట.. అనే స్థాయిలో వుంది పరిస్థితి. ఓ అధికారిక కార్యక్రమంలో ప్రధాని, చంద్రబాబుని కలిశారంతే. ఇక్కడ రాజకీయ వైరాలు అప్రస్తుతం. మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అక్కడితో కథ అయిపోయింది. ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. అది వేరే సంగతి.

Advertisement

Recent Posts

Gajakesari Rajayoga : కార్తీక పౌర్ణమి రోజు ఏర్పడనున్న గజకేసరి రాజయోగం… ఈ రాశుల వారికి కనక వర్షం…!

Gajakesari Rajayoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో గ్రహాల సంచలనం వలన కొన్ని అద్భుతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. పవిత్రమైన…

4 mins ago

Mustard Oil : చలికాలంలో ఆవనూనెతో ఇలా చేస్తే చర్మ సమస్యలకు చెక్…!

Mustard Oil : వంటల్లోనే కాదు చర్మ సంరక్షణలో కూడా ఆవనూనె ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. అయితే చలికాలంలో ఆవనూనెతో…

1 hour ago

Karthika Purnima : కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగించాలి… చదవాల్సిన మంత్రం ఏంటంటే…!

Karthika Purnima : ఈ ఏడాది కార్తీక మాసంలో ఇప్పటికే రెండు సోమవారాలు ఏకాదశులు ముగిశాయి. ఇక్కడ నవంబర్ 15వ…

2 hours ago

Celebrity Couple : ఆ జంట విడాకులు తీసుకోబోతుందా.. కోర్టు మెట్లెక్క‌డానికి కార‌ణం ఏంటి ?

Celebrity Couple : ఇటీవలి కాలంలో చాలా మంది సెల‌బ్రిటీలు చిన్న చిన్న కార‌ణాల‌కి విడాకులు తీసుకుంటున్నారు. ఇన్నేళ్ల సంసారంలో…

10 hours ago

Bigg Boss Telugu 8 : నీపైన బ‌య‌ట నెగెటివ్ టాక్ ఉంది.. య‌ష్మీ,నిఖిల్‌ల‌కి పేరెంట్స్ క్లాస్

Bigg Boss Telugu 8 : ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఫ్యామిలీ వీక్ న‌డుస్తుంది. ఇవి చాలా ఎమోష‌న‌ల్‌గా…

11 hours ago

Brahmam Gari Kalagnanam : డిసెంబర్ నెలలో బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజం కాబోతుందా.. జరగబోయేది ఇదే…!

Brahmam Gari Kalagnanam : ప్రపంచంలో ఒకవైపు ప్రమాదాలు మరోవైపు భారీ నష్టం. ఎక్కడ చూసినా విధ్వంసమే. వరదలు భూకంపాలు అగోరీలు..…

12 hours ago

Electric Cycle : అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో ఎల‌క్ట్రిక్‌ సైకిల్‌.. రూ.10కే 100 కి.మీ మైలేజీ.. ఇప్పుడు ఆఫ‌ర్‌లో మ‌రింత చ‌వ‌క‌గా

Electric Cycle : మీరు ఉత్త‌మ‌ శ్రేణి, పనితీరు మరియు ఫీచర్ల యొక్క ఖచ్చితమైన సమ్మేళనాన్ని అందించే విశ్వసనీయ మరియు…

13 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌ల ఖ‌రారు స‌మ‌యంలో ఈ బిగ్ ట్విస్ట్ ఏంటి ?

Jamili Elections : కేంద్రం జమిలి దిశగా వేగంగా అడుగులు వేస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్ర, జార్ఖండ్ తో…

14 hours ago

This website uses cookies.