Jaganmohini Kesava : రోజురోజుకీ రాక్షసుల అరాచకాలు శృతిమించుతుండడంతో భయపడిన దేవతలు శ్రీ మహా విష్ణువు వద్దకు చేరి తమను అసురుల వారి నుంచి రక్షించి వారితో పోరాడే శక్తిని ప్రసాదించమని శరణు కోరుతారు. దేవతల మెరను ఆలకించిన విష్ణుమూర్తి క్షీరసాగర మధనం చేసి దానిలో నుండి వచ్చే అమృతాన్ని సేవిస్తే మీరు అమరులవుతారని దానువులు ఎదిరించే శక్తి వస్తుందని అంతవరకు గొడవలకు దిగకుండా వారితో సఖ్యంగా ఉండి ఈ క్షీరసాగర మదనానికి వారి సహాయం కూడా తీసుకోమని చెబుతాడు. దీంతో ఇంద్రుడు దానవుల దగ్గరకు వెళ్లి క్షీరసాగరాన్ని మదిస్తే అమృతం పుడుతుందని అది తాగితే మృత్యు దరిచేరదని మీరు అమరులు కావచ్చని వారిని నమ్మిస్తాడు. ఇంద్రుడి చెప్పిన విషయానికి ప్రేరేపిస్తులైన రాక్షసులు దేవతలకు సహాయం చేయడానికి ఒప్పుకుంటారు. ఒకానొక శుభముహూర్తాన దేవతలు దానవులు కలిసి వాసుకి అనే పాముని తాడుగా మండల గిరిని కవంగా చేసుకుని పాలు సముద్రాన్ని చిలకడం ప్రారంభిస్తారు. అలా దేవదానములు ఇద్దరు కలిసి పాలు కడలిని చిలకగా చిలకగా దాని నుంచి హాలో హలము ఐరావతము కామధేనువు, కల్ప వృక్షము లక్ష్మీదేవి అప్సరసలు వంటి వారు ఉద్భవించగా చివరిగా ధన్వంతరి అమృత కలశాన్ని చేతిలో ఉంచుకుని బయటకు వస్తాడు. ధనవంతుని చేతిలో ఉన్న అమృత కలశాన్ని చూడగానే రాక్షసులంతా దేవతలందరినీ పక్కకు తోసేసి అమృత కలశాన్ని లాక్కుని ముందు నా కంటే నాకుని ఒకరితో ఒకరు వారిలో వారే కలిగించుకోవడం మొదలుపెడతారు.
విశాల వదనంతో ఉన్న దేవతల బాధలు అర్థం చేసుకున్న మహా విష్ణువు జగన్మోహిని అవతారం దాల్చి దానవుల మధ్యలోకి వస్తాడు. అడుగు వేస్తే కందిపోతాయా అన్నట్లుగా స్తుతి మెత్తగా వయ్యారాలు తిరుగుతూ నడిచి వస్తున్న అందాల రాసిన చూసి దానవులందరూ ఒక్కసారిగా నిచ్చేస్తులై ఆమె వైపు చూసి గుటకలు వేస్తూ అలా నిలబడిపోతారు.ఆమె కోసం తహతహలాడుతుండగా మోహిని వారిని తన వలపు వలలో బంధించి దానుల కన్ను కప్పి అమృతం మొత్తాన్ని దేవతలకు పంచి అక్కడి నుండి అదృశ్యం అవుతుంది. ఇదిలా ఉండగా కలహభోజనుడైన నారదుడు కైలాసనికి చేరుకుని క్షీరసాగర మదనం సమయంలో ఏం జరిగిందో వివరిస్తూ పనిలో పనిగా జగన్మోహిని అందచందాల గురించి కూడా శివుడి చెవులో వదులుతాడు. నీలాంటి విగ్రహం లేని వారు ఆమె అందానికి దాసోహం అవుతారని ఈ సృష్టిలో ఉన్న ఎలాంటి సౌందర్యం వంచించలేదని చెబుతాడు. శివుడు గంభీర్యానికి మనసులో నవ్వుకున్న నారదుడు మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు. నారదుడు అలా కైలాసం నుండి బయటకు వెళ్ళగానే శివుడికి నిజంగా మోహిని అంత అందంగా ఉంటుందా.. నన్ను కూడా సమూహించగలిగే శక్తి ఆమెకు ఉందా అని మనసులు అనుకుంటూ మోహిని గురించి పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలు పెడతాడు. అలా నిరంతరం మోహిని మోహావేశానికి శివుడు ఇక ఏమాత్రం ఆగలేక చూడాలని మనసులో నిశ్చయించుకుని విష్ణు దగ్గరకు వెళ్లి ఒక్కసారి నీ మోహిని రూపాన్ని ప్రదర్శించమని అడుగుతాడు.
పరమేశ్వరుడు అంత ఆత్రంగా అడగడంతో కాదని లేకపోయిన పరంధాముడు మరొకసారి శివుని ముందు మోహిని రూపాన్ని దాల్చాడు. బ్రహ్మ కైనా బ్రహ్మ తెగులు పుట్టించగల అసాధారణ సౌందర్య రూపానికి ముక్తుడైన పరమశివుడు తనను తాను మహిమరిచిపోయి మోహిని పట్ల శృంగారపార్వస్యానికి లోనై ఆమె కోసం వెంటపడతాడు. మోహిని శివుని కవ్విస్తూ ముందుకు కదులుతుండగా శంకరుడు ఆమెను వెంబడిస్తూ వస్తుంటాడు. జగన్మోహిని అలా అలా శంకరుని తన అందచందాలతో మైమరిపిస్తూ భూలోకానికి చేరుకొని ఒకరు ఒక ప్రదేశంలో శివుని చేతికి చిక్కి అక్కడే శిలా రూపొందాల్సి ఉంటుంది.
మోహిని అలా శిలారూప దాల్చిన ప్రదేశమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ర్యాలీ గ్రామంలో వేంచేసిన జగన్మోహిని చెన్నకేశవ స్వామి దేవాలయం ప్రాంతాన్ని రత్నపురి అని పిలిచేవారు. 11 శతాబ్ద కాలంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అరణ్యంగా ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని చూడ చక్రవర్తి అయినా రాజా విక్రమ దేవుడు పరిపాలించేవాడు. ఒకరోజు ఈ అరణ్యంలో వేటుకు వచ్చిన విక్రమ దేవుడు అలసి ఒక పొన్న చెట్టు కింద సేన తీరుతాడు. విక్రమ దేవుడి కలలో కనిపించి ఓ రాజా నీ రథం ఫీల ఎక్కడైతే పడిపోతుందో ఆ ప్రదేశంలో తవ్వి చూడు అక్కడ మీకు నా విగ్రహం కనిపిస్తుంది. నాకు ఒక ఆలయాన్ని నిర్మించు. నీ జన్మ చరిత్ర గృహల్లో జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం బయటపడుతుంది. దీంతో ఎంతో సంతోషించిన మహారాజు అక్కడే ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు. ఆ దేవాలయమే ఇప్పుడు మనం చూస్తున్నాం జగన్మోహిని చెన్నకేశవ స్వామి ఆలయం..
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.