
Trisha : త్రిషని టార్గెట్ చేసిన మాజీ ఎమ్మెల్యే .. చెప్పుతో కొడతా అంటూ రియాక్ట్ అయిన నిర్మాత చిట్టిబాబు...!
Trisha : నిర్మాత చిట్టిబాబు ఏదో ఒక విషయంపై స్పందిస్తూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. ఇటీవల ఆయన త్రిష గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎక్స్ ఎమ్మెల్యే అయినా ఏవీ రాజు త్రిష గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. 25 లక్షలు ఇస్తే నా గెస్ట్ హౌస్ కి వచ్చి త్రిష డాన్స్ ఆడింది అని మాజీ ఎమ్మెల్యే ఏవి రాజు అన్నారు.దీనిపై నిర్మాత చిట్టిబాబు మాట్లాడుతూ .. ఏదైనా ఫంక్షన్ కు సెలబ్రిటీలను రావాలని కోరుతారు.మీరు ఒక్క ఐదు నిమిషాలు వచ్చి ఫంక్షన్ లో ఉన్న చాలు అని సెలబ్రిటీలను కోరుతారు.మీరు వస్తే చాలు అని కాళ్ళ మీద పడతారు.తర్వాత బ్లాక్ మెయిల్ చేయడానికి హీరోయిన్స్ చాలా చీప్ గా వ్యాఖ్యానిస్తుంటారు. రెండు మూడు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే త్రిష ఆయన దగ్గరికి వెళ్లి 25 లక్షల కోసం డాన్స్ చేయాల్సిన కర్మ ఏంటి అని ప్రశ్నించారు.
సెలబ్రిటీ అవ్వడం కోసం మరో సెలబ్రిటీని టార్గెట్ చేస్తున్నారు.ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని ఇలాంటి చీప్ పనులను చేస్తున్నారు.ఆమధ్య త్రిషపై కాంట్రవర్సీ కూడా వచ్చింది.ఇలా త్రిషపై కాంట్రవర్సీలో రావడానికి ఆమె పాపులారిటీని కారణం.ఆమె రెండు భాషలలో సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు.ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లకు పైనే అవుతున్న ఆమె ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్గా ఆమె ఉన్నారు. అందుకే ఆమెపై ఎక్కువగా కాంట్రవర్సీలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో డిమాండ్ లో ఉన్న వారిని టార్గెట్ చేస్తే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవ్వవచ్చని చీప్ పనులను చేస్తుంటారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక న్యూస్ చానల్స్ కూడా తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్నాయి. ఎక్స్ ఎమ్మెల్యే అలా అన్నప్పుడు ఆధారాలు ఉన్నాయా లేవా అని సేకరించి అప్పుడు న్యూస్ లో వేయాలి. అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు దీని వలన సెలబ్రిటీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై త్రిష స్పందించాల్సి వస్తుంది. దారినబోయే ప్రతి వాడికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం సెలబ్రిటీలకు లేదు. ఇక త్రిష గురించి అందరికీ తెలుసు. ఆమె ప్రతి సినిమాలో ట్రెడిషనల్ గాని నటించారు. ఇప్పుడు ఎవడో బురద వేశాడని అది కడుక్కోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని అన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో త్రిషపై ఎక్కువ కాంట్రవర్సీలు వస్తున్నాయి. ఆమె ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమెపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.