
Sri Rama Navami : ఇక్కడ ప్రతి ఏటా శ్రీ రామ నవమి వేడుకలు... చుక్క ముక్కతో జరుపుతుంటారు... అది ఎక్కడో తెలుసా...?
Sri Rama Navami : మన తెలుగు పండగలలో శ్రీరామనవమి పండుగ కూడా ఎంతో గొప్పది. ఈ పండుగను అత్యంత వైభవంగా శ్రీరాముల వారి కల్యాణ వేడుకలను జరుపుకుంటారు. విషమంతటా శ్రీరామనవమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను జరుపుకుంటారు. ఊరేగింపులు, అన్నదాన కార్యక్రమాలు, ఇంకా ముఖ్యంగా శ్రీరామనవమి రోజున బెల్లం పానకం, పులిహోర, పాయసం, వడ పప్పు వంటి పదార్థాలను నైవేద్యంగా శ్రీరామునికి పెడతారు. ప్రజలందరూ కూడా ఆరోజున మాంసాహారాన్ని,మధ్యాన్ని ముట్టరు. ఆరోజు ప్రతి ఒక్కరు కూడా శాఖాహారాన్ని భుజిస్తారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా శ్రీరామనవమి వేడుకలను చాలా వెరైటీగా జరుపుకుంటున్నారు. శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చుక్క,ముక్క ఉండాల్సిందే. అందరూ విందు భోజనాలతో దావత్ చేసుకోవాల్సిందే. మన సాంప్రదాయానికి భిన్నంగా ఈ శ్రీరామనవమిన ఈ విధంగా జరుపుకునే గ్రామం ఎక్కడుందో తెలుసా.. ఈ వింతైన స్టోరీ ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం. తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం, సీతారామపురంలో శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ గ్రామస్తులు అంతా రామ భక్తులే… కానీ ఇక్కడ ప్రజలు శ్రీరామనవమి వేడుకలను వెరైటీగా జరుపుకుంటున్నారు. ఈ గ్రామంలో శ్రీరామనవమిని మాంసాహార వంటకాలు, విందు భోజనాలతో వేడుకలను వైభవంగా జరుపుకుంటారు. స్థానిక రామాలయంలో ఏకంగా ఐదు రోజులపాటు సీతారాముల కళ్యాణ ఉత్సవాలు జరుపుకుంటారు. ఆలయంలో రాముల వారి కళ్యాణం జరుగుతుండగా, గ్రామస్తులు మాత్రం ఇంట్లో వాళ్ళు యాటలు, కోళ్లు కోసుకొని, మద్యంతో విందు భోజనాలు చేస్తుంటారు. ఈ విషయం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది కదా.. కానీ ఇది నిజం.. ఇలా కూడా ఆ గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలని జరుపుకుంటారు.
Sri Rama Navami : ఇక్కడ ప్రతి ఏటా శ్రీ రామ నవమి వేడుకలు… చుక్క ముక్కతో జరుపుతుంటారు… అది ఎక్కడో తెలుసా…?
ఈ ఒక్కరు కూడా వివాహం అనంతరం విందులు వినోదాలు జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క ఊరిలో శ్రీరామనవమి రోజున దేవుని కళ్యాణం అనంతరం గ్రామంలో నాన్వెజ్ తో విందు భోజనాలు చేయడం గ్రామ ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ ప్రజలకు. శ్రీరామనవమి రోజున పూజల తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట వరకు సీతారాముల వారి కల్యాణాన్ని తిలకించి తరిస్తారు, తరువాత ఆర్థిక స్తోమతను బట్టి ఇంట్లో మేకలు, పూలతో నవమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. దేశంలో ఎక్కడా లేని వింత ఇక్కడ నాన్ వెజ్ ఆచారం. వందల ఏలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది.
గరుడ ముద్దుల కోసం : ఈ గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఐదు రోజులపాటు ఘనంగా వేడుకలను జరుపుకుంటారు. శ్రీరాముని కళ్యాణం రోజున గరుడ ముద్ద ( అన్నం ముద్దలు) ఎగరవేయడం ఇక్కడ ఆనవాయితీ. అలా ఎగరేసిన ముద్దలు కోసం గ్రామస్తులు ఎగబడతారు. గరుడ ముద్దులు అంటారు. ఈ గరుడ ముద్రలను అందుకొని తిన్నవాళ్ళకు శుభాలు కలుగుతాయని గ్రామస్తుల నమ్మకం.
ఈ ఊరి శ్రీరామనవమి చరిత్ర : గరుడ ముద్దులు తినడం వల్ల ఎన్నో ఏళ్ల నుంచి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అక్కడ ప్రజల నమ్మకం. అయితే, వందల ఏల క్రితం సంతానం లేని ఇద్దరూ బ్రాహ్మణులు దేశ పర్యటన చేస్తూ ఇక్కడికి వచ్చి సీతారాముల విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు. ఆలయం ముందు రెండు రాతి స్తంభాలను నిలబెట్టే ప్రయత్నం చేసినా.. వారికి అదే సాధ్యం కాలేదు. రాత్రి స్వామి వారు బ్రాహ్మణుల కలలోకి వచ్చి ఇలా సూచించినట్లుగా తడి బట్టలతో రాతి స్తంభాలను నిలబెట్టి సీతారాముల కళ్యాణం జరిపారట. కళ్యాణానికి గరుడ ముద్దా ప్రసాదంగా స్వీకరించడంతో ఆ బ్రాహ్మణ దంపతులకు సంతానం కలిగిందని ప్రచారంలో ఉంది. సీతా రామచంద్ర స్వామి ఆలయం ఉండడం వల్లే ఈ గ్రామానికి సీతారాంపురం అనే పేరు వచ్చింది. ఆలయంలో మండపం సహ మూడు గర్భగుడులు ఉన్నాయి. సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలతో పాటు సంతాన గోపాల స్వామి, ఆండాలమ్మ, గోదాదేవి, గరుత్మంతుడు కొలువై ఉన్నారు. పిల్లలు లేని వాళ్ళు తడి బట్టలతో ఆలయ ప్రతిక్షణ చేసి సంతాన గోపాల స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని ఇక్కడ గ్రామస్తుల విశ్వాసం.
అనాదిగా వస్తున్న సాంప్రదాయం : ఇక్కడ ప్రజలు ఎన్నో ఏళ్ల క్రితం గ్రామంలో దొరలు, స్వాములు శ్రీరామనవమి రోజున స్వామి వారి కళ్యాణం వాళ్లే జరిపించేవాళ్లు. కల్యాణాన్ని చూసేందుకు భూస్వాములు, పెత్తందారుల కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చేవారు. రాముల వారి పెండ్లి ని కూడా ఇంట్లో పెండ్లి గానే భావించి, యాటలు, కోళ్లు కోసి వండి పెట్టేవాళ్ళు. అదే అక్కడ వెరైటీ కల్చర్ గా ఆ గ్రామంలో నేటికీ కొనసాగుతూ వస్తుంది. ఆలయంలో రాముల వారి కళ్యాణం జరుగుతుండగా, రామస్తులు మాత్రం ఎవరి ఇళ్లల్లో వాళ్ళు యాటలు, కోళ్లు కోసుకొని మందుతో విందు భోజనాలు చేస్తుంటారు.
అసలు సాధారణంగా శ్రీరామనవమి నాటికి ప్రకృతిలో వడగండ్ల వానలు వచ్చి రైతులు అధికంగా పంటలు నష్టపోయేవారు. కానీ ఈ గ్రామంలో ఇప్పటివరకు ఒక్కరోజు కూడా వనగండ్ల వాన గ్రామ పరిస ప్రాంతాల్లో పడలేదని, ఇంత దేవుని దయగా గ్రామస్తులు భావిస్తుంటారు. మరోవైపు రాములోరి కళ్యాణం రోజున గ్రామంలో ఈ ఆనవాయితికి స్వస్తి పలికేందుకు గ్రామ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.