Zodiac Signs : ఈ రాశిఫ‌లాల వారికి జూన్ నెలలో శ‌ని దేవునితో ఇబ్బందులు త‌ప్ప‌వు…నివార‌ణ‌కు ఈ చ‌ర్య‌లు తీసుకోండి….

Authored By Krishna B | The Telugu News | Published on: June 6, 2022, 4:00 pm

Zodiac Signs : విశ్వానికి మూల పురుషుడైన సూర్య‌నారాయ‌ణుని పుత్రుడే ఈ శ‌నిదేవుడు. శ‌నిదేవుడు ఎంతో మ‌హిమ క‌ల‌వాడు. ఈ దేవుడిని త‌క్కువ మంది కొలుస్తారు. అయిన చాలా మ‌హిమ కల‌వాడు. ఈయ‌న‌ను ఆరాధించ‌డం వల‌న మ‌న జీవితంలో ద‌రిద్ర్యం తొల‌గిపోయి,సుఖ‌సంప‌ద‌లు క‌లుగుతాయి. అయితే,ఈ నెల కొన్ని రాశుల వారిపై శ‌ని ప్ర‌భావం వుంటుంద‌ని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. నివార‌ణ‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో తెలుసుకుందాం. జూన్ 5 నుంచి శ‌నీశ్వ‌రుడు తిరోగ‌మ‌న దిశ‌లో తిర‌గ‌నున్నాడు.

ఏప్రిల్ 29 శ‌ని గ్ర‌హంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. శ‌ని త‌న సొంత రాశి అయిన కుంభ‌రాశిలోకి చేరుకున్నాడు. తిరోగ‌మ‌న దిశ మొద‌లుకాగానే శ‌ని జులై 12 న మ‌క‌ర రాశిలోకి ప్ర‌వేశిస్తాడు. ఇలా ఈ రాశిలో జ‌న‌వ‌రి 17,2023 వ‌ర‌కు వుంటాడు. త‌ర్వాత య‌ధావిధిగా కుంభ‌రాశిలోకి చేరుకుంటాడు. శ‌నిదేవుడు మ‌క‌ర‌రాశిలోకి ప్ర‌వేశించే స‌మ‌యంలో కొన్ని రాశుల వారిపై దుష్ప్ర‌భావాన్ని చూపిస్తాడు. మ‌క‌ర‌,కుంభ‌,మీన రాశుల వారిపై ఈ శ‌ని ప్ర‌భావం వుంటుంద‌ని వాస్తు పండితులు అంటున్నారు. అయితే శ‌నీశ్వ‌రుడుని ఆరాధిస్తూ,కొన్ని నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు.

The saturn goes to bad effects in zodiac signs in these month

The saturn goes to bad effects in zodiac signs in these month

అది ఎలాగో చూడండి. ప్ర‌తి శ‌నివారం తల‌స్నానమాచ‌రించి,శ‌ నిగ్ర‌హాల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. శ‌నివారం రోజు నువ్వుల నూనెను ఎవ‌రికైన దానం చేయండి. మీరు ఆ రోజు నూనెను కొనుక్కోరాదు. ఎందుకంటే శ‌నిని మీరంత‌ట మీరు కొనుక్కున్న వారు అవుతారు. అందుకే శ‌నివారంనాడు ఎట్టి ప‌రిస్థితుల్లో నూనెను కొనుక్కోరాదు. అలాగే శివుడిని కూడా ఆరాధించ‌వ‌చ్చు. హ‌నుమాన్ చాలీసా,శ‌ని మంత్రాల‌ను జ‌పించ‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల‌న శ‌ని ప్ర‌భావం త‌గ్గుతుంది.

Krishna B

No bio available for this author.

  1. "Radhika Apte : 41 ఏళ్లలోనే నా శరీరం, కోరికలపై అసలైన క్లారిటీ వచ్చింది: రాధికా ఆప్టే"

  2. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  3. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  4. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  5. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  6. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  7. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp