Cancer : క్యాన్సర్ వచ్చే ముందు మన శరీరంలో వచ్చే మార్పులు ఇవే…!
Cancer : వయసు పైబడి కొద్దీ మన అవయవాల పనితీరులో కూడా మార్పులు సంభవిస్తాయి అందుకని 35 లేదా 40 ఏళ్లు కచ్చితంగా ఆరోగ్యం పై మరింత దృష్టి పెట్టాలి. ఈ మధ్యకాలంలో చాలా విచిత్ర మరణాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందరో ప్రాణం పోసిన డాక్టర్లు సైతం అకస్మాత్తుగా గుండె జబ్బుతో మృతి చెందడం అలాగే ఎన్నో రకాల క్యాన్సర్ రోగులకు చికిత్స చేసిన డాక్టర్లు కూడా అదే క్యాన్సర్ తో మరణించడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దీని అంతటికి ఏంటి కారణం వారికి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా.. లేకపోతే వారికి శుభ్రత లేదా ఆహారం పట్ల అవగాహన లేదా అంటే ఇవేవీ కావు.. కొన్ని రకాల వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. కాబట్టి వాటిని తగిన సమయంలో గుర్తించగలిగితే నయం చేసుకునే అవకాశాలుంటాయి. అలాకాకుండా కొంతమంది వచ్చిన వ్యాధి వచ్చినట్టు తగ్గిపోతుంది. అన్నట్టుగా నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ని ముందుగా గుర్తించడం ఎలా వాటి సిస్టమ్స్ ఎలా ఉంటాయి? ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్లు ఉంటాయి.
అలాగే క్యాన్సర్ లో ఎన్ని దశలుంటాయి. ఏ దశలో మనం గుర్తిస్తే తొందరగా ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు.. అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం. క్యాన్సర్ అనగానే అదేదో చికిత్స లేని జబ్బు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటి అధునాతన విధానాలతో తొలి దశలో గుర్తించగలిగితే కొన్ని రకాల క్యాన్సర్లకు మెరుగ్గా చికిత్స అందించవచ్చు. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది. కాక ఆ తర్వాత స్థానం క్యాన్సర్ ది అసలు క్యాన్సర్ అంటే ఏంటి సాధారణంగా మన శరీరంలో తన విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. అయితే కొన్ని కారణాలవల్ల ఆ కణాలు నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది తన సమూహాలను ఏర్పరుస్తాయి. ముందుగా నియంత్రించ గలిగేటి అంటే పొగాకు మధ్యపానం ఊబకాయం ఆహారపు అలవాట్లు ఇన్ఫెక్షన్లు ఈకోవక చెందుతాయి.
మనదేశంలో క్యాన్సర్ కారకాల్లో 70% అందులో 40% పొగాకు సంబంధించినవి మద్యపానం వల్ల పేగు, రొమ్ము, నోరు, స్వర పేటిక అన్నవాహిక కాలేయం కడుపుతో పాటు ఆరు రకాల క్యాన్సర్ల ముప్పును ఆల్కహాల్ పెంచుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లు ఎటువంటి సంకేతాలు లేకుండా మనిషిని మింగేస్తుంటాయి. మహిళలు పాతిక సంవత్సరాల తర్వాత పాప్స్ నియర్ పరీక్ష చేయించుకోవాలి. ప్రతి మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి. ఇక తెల్ల స్రావం, పొత్తికడుపులో నొప్పి నెలసరి కి మధ్య రక్తస్రావం తర్వాత రక్తస్రావం అంటే లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. నోట్లో ఏదైనా చిన్న పుండు లాగా అయ్యి అది మానకపోతే నిర్లక్ష్యం చేయకుండా పరీక్ష చేయించుకోండి.
సడన్గా బరువు తగ్గడం కానీ పెరగడం కానీ రక్తహీనత నీరసం లేదా ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోండి. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే 40,ఏళ్లు దాటిలోపే ఒకసారి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. కాబట్టి క్యాన్సర్ ముప్పులను తగ్గించుకుంటూ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేసుకుని వైద్యుల సలహా మీద తగిన చికిత్స పొందాలి. ఇలా ముందుగా మేలుకుంటే క్యాన్సర్ ముప్పు నుంచి మనం చాలా వరకు బయటపడొచ్చు…