
Shri krishna Janmashtami : కృష్ణాష్టమి రోజున ఏ వస్తువులను దానం చేస్తే... ఎలాంటి ఫలితాలు లభిస్తాయి...!
Shri krishna Janmashtami : వైదిక క్యాలెండర్ ప్రకారం చూస్తే, శ్రావణమాసంలో కృష్ణ పక్షంలోని అష్టమ తిధి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగలను మనం ఎన్నో ఏళ్లుగా జరుపుకుంటున్నాము. ఇదే మన సాంప్రదాయం కూడా. ఇదే రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు అని ఎంతో మంది భావిస్తారు. దీనివలన ఈ రోజున శ్రీకృష్ణుని బాల రూపాన్ని ఎంతో మంది పూజిస్తారు. అయితే ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను దానం చేయటం వలన కృష్ణుడు ప్రసన్నుడు అయ్యి భక్తుల కోరికలను తీరుస్తాడు అని ఎంతో మంది నమ్ముతారు. కావున శ్రీకృష్ణ అష్టమి రోజున ఏ వస్తువులను దానం చెయ్యాలో చూద్దాం…
అన్నదానం చేయడం లేక ఆకలితో ఉన్నటువంటి వ్యక్తులకు ఆహారం ఇవ్వడం అనేది గొప్ప దానంగా భావిస్తారు. అయితే జన్మాష్టమి రోజున పేదలకు మరియు ఆకలితో ఉన్నవారికి తినడానికి ఆహారం ఇవ్వడం అత్యంత పుణ్యం. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆహార కొరత అనేది ఉండదు. అంతేకాక ఈ టైంలో కుటుంబంలోని అన్ని దుఃఖాలు తొలగిపోయి జీవితం ఎంతో ఆనందంతో నిండి ఉంటుంది…
వెన్న దానం : లడ్డు గోపాలుడు అయినటువంటి కన్నయ్యకు వెన్న అంటే ఎంతో ఇష్టం. అయితే ఈ రోజున వెన్నదానం చేస్తే చాలా మంచిది. అలాగే జన్మాష్టమి రోజున వేన్న దానం చేయడం వలన శుక్ల దోషాలు అనేవి తొలగిపోతాయి. అంతేకాక కుటుంబంలో శాంతి మరియు సంతోషాలు కూడా నెలకొంటాయి. వీటితో పాటుగా సంపద కూడా ఎంతగానో పెరుగుతుంది…
వస్త్ర దానం : శ్రీకృష్ణుని జన్మాష్టమి రోజున పేదలకు మరియు నిరుపేదలకు బట్టలను దానం చేయడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా చేస్తే ఆ వ్యక్తి దుఃఖం మరియు పేదరికం నుండి ఉపశమనాన్ని పొందుతాడు. అలాగే శ్రీకృష్ణుని ఆశీస్సులు కూడా ఎప్పుడు వారికి లభిస్తాయి.
నెమలి ఈకలు దానం : శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే ఎంతో ఇష్టం. ఈ రోజున నెమలి ఈకలను దానం చేయటం వల్ల కూడా ఎంతో సంతోషం కలుగుతుంది. అంతేకాక ఈరోజున నెమలి ఈకులను కొని వాటిని దానం చేస్తే మంచిది. అలాగే నెమలి ఈకలను దానం చేయడం వలన ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి అవుతాయి అని నమ్ముతారు. అంతేకాక వృత్తి మరి వ్యాపారాలలో కూడా ఎంతో పురోగతి సాధిస్తారు.
Shri krishna Janmashtami : కృష్ణాష్టమి రోజున ఏ వస్తువులను దానం చేస్తే… ఎలాంటి ఫలితాలు లభిస్తాయి…!
మురళీ విరాళం : శ్రీకృష్ణుని జన్మాష్టమి రోజున మురళీ ని దానం చేయటం వల్ల ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అలాగే ఎంతో ప్రయోజనకరంగా చెబుతారు. మీరు ఈ రోజున చెక్క వేణువును దానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వలన ఇంట్లో ఐశ్వర్యం అనేది కలుగుతుంది అని నమ్మకం…
కామధేను ఆవు విగ్రహ దానం : ఈ రోజున కామధేను ఆకు విగ్రహాన్ని కూడా దానం చేయడం వలన ఎంతో మంచి ఫలితం ఉంటుంది. ఎందుకు అంటే అది శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైనది. ఈ రోజున ఖచ్చితంగా గోవుకు సేవ చేయాలి. ఈరోజు ఆవుకు పచ్చిగడ్డి లేక ఆహారాన్ని అందిస్తే చాలా మంచిది…
IND vs NZ, 1st T20I : న్యూజిలాండ్తో ప్రారంభమైన ఐదు టీ20ల సిరీస్లో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. నాగ్పూర్…
Wife Killed Husband : ఇటీవల వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. కట్టుకున్న భర్త /భార్య ఉండగానే మరొకరితో సంబంధం పెట్టుకొని…
Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న తరుణంలో సామాన్యులకు 'బంగారం' గుదిబండగా మారిన సంగతి…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 22 టుడే ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగాలతో…
AP Pasu Bima Scheme 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుపోషణ అనేది వ్యవసాయం తర్వాత ప్రధాన జీవనాధారం. ముఖ్యంగా ఆవులు,…
Onions for Diabetes : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. మారుతున్న…
Pressure Cooker : ఇళ్లలో వంట పనిని సులభం చేసిన అద్భుతమైన పరికరం ప్రెషర్ కుక్కర్. తక్కువ సమయంలో వంట…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
This website uses cookies.