
Zodiac Signs : చంద్రుడు కుజుడు కలయికతో ఏర్పడనున్న చంద్రమంగళ యోగం... ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం...
Zodiac Signs : జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 24 , 25 మరియు 26 తేదీల్లో కర్కాటక రాశిలో చంద్రుడు మరియు కుజుడి కలయిక కారణంగా చంద్రమంగళ యోగం అనే ధనయోగం ఏర్పడబోతుంది. అయితే ఈ యోగ ప్రభావం అనేది 27వ తేదీన నుండి కొనసాగుతుంది. అదేవిధంగా ఈ యోగం కారణంగా ఆదాయం పెరగడంతో పాటు అదనపు ఆదాయ మార్గాలు తెరచ్చుకుంటాయి. అలాగే ఆకస్మిత ధన లాభం మరియు రావాల్సిన సొమ్ము రావడం వంటివి జరుగుతాయి. ఇక ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ధనయోగాలు ఉన్నాయి మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
మేషరాశిలో చతుర్ధ స్థానంలో కుజ చంద్ర కలయిక కారణంగా వీరికి ఆస్తి వ్యవహారాలు మరియు ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతారు. అలాగే ఈ సమయంలో పూర్వీకుల ఆస్తి చేతికి అందుతుంది. దీనివల్ల భూలాభాలు కలుగుతాయి. సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇది మంచి సమయం. వీరికి అనేక విధాలుగా ఆదాయ మార్గాల లో తెరచ్చుకుంటాయి. ముఖ్యంగా స్పెక్యులేషన్స్ మరియు షేర్ల మీద మంచి లాభాలు ఉంటాయి. ఇక మొత్తం మీద మేషరాశి వారికి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.
Zodiac Signs : కర్కాటక రాశి : కర్కాటక రాశిలో రాశ్యదిపతి అయిన చంద్రుడు కుజుడి కలయిక కారణంగా వీరికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి వచ్చే వారసత్వపు ఆస్తి ద్వారా వీరికి మంచి లాభాలు ఉంటాయి. వీరి ఆస్తులు రెట్టింపు అవుతాయి. నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు చేసే వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్థులకు ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే షేర్లు కొనడానికి మరియు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం.
Zodiac Signs : కన్యారాశి : కన్యరాశిలో లాభ స్థానంలో కుజ చంద్రుల కలయిక కారణంగా ఆదాయం రెట్టింపు అవుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరగడంతో పాటు లాభదాయక పరిచయాలు కన్యారాశి వారికిి ఏర్పడతాయి. ఆస్తి గృహ ఒప్పందాలకు ఇది మంచి సమయం. అలాగే కన్యా రాశి వారికి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇక షేర్లు ఆర్థిక లావాదేవీలు వీరికి బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా ఆకస్మిత ధన ప్రాప్తి కలుగుతుంది.
Zodiac Signs : తులారాశి : తులారాశిలో దశమ స్థానంలో చంద్రమంగళ యోగం ఏర్పడడంతో ఉద్యోగులకు ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. ఈ సమయంలో వీరి ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాలలో అధిక ధన లాభం ఉంటుంది. అదేవిధంగా సెక్యూలేషన్స్ షేర్లు ఆర్థిక లావాదేవీలు వడ్డీ వ్యాపారాలు చేసేవారికి ఇది అనుకూల సమయం. మంచి లాభాలను పొందుతారు. ఆస్తి సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అలాగే తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు రావడంతో సంపద వృద్ది చెందుతుంది.
Zodiac Signs : వృశ్చిక రాశి : వృశ్చిక రాశిలో భాగ్య స్థానంలో చంద్ర కుజ కలయిక ఏర్పడడం వలన ఈ రాశి వారికి ధనయోగాలు ఉన్నాయి. భాగ్యాధిపతి అయిన చంద్రుడు రాశ్యధిపతి కుజుడి కలయిక కారణంగా ఈ రాశి వారికి ఆకస్మిత ధన లాభం ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి ఉద్యోగులకు ఈ సమయంలో జీతభత్యాలు పెరుగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతారు. అలాగే ఆర్థిక లావాదేవీలు పెట్టుబడి పెట్టే వారికి అధిక ధన లాభం కలుగుతుంది.
Zodiac Signs : చంద్రుడు కుజుడు కలయికతో ఏర్పడనున్న చంద్రమంగళ యోగం… ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం…
Zodiac Signs : మీన రాశి మీన రాశిలో పంచమ స్థానంలో చంద్రమంగళ యోగం ఏర్పడడంతో వీరికి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వీరు ఆదాయపరంగా ఏదైనా పని చేపట్టిన అందులో విజయం సాధిస్తారు. వీరికి అత్యంత శుభ ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా కోర్టు కేసులలో సానుకూల తీర్పులు వస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు చేపట్టడం వలన వీరికి ఆదాయం పెరుగుతుంది. అలాగే వృత్తి వ్యాపారాలలో లాభాలు అంచనాలను మించుతాయి. ఆదాయం అభివృద్ధి చెందడంతో పాటు రావాల్సిన సొమ్ము మీన రాశి వారి చేతికి అందుతుంది.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.