Zodiac Signs : కన్యా రాశిలోకి కేతువు ప్రవేశం…ఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు సొంతం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : కన్యా రాశిలోకి కేతువు ప్రవేశం…ఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు సొంతం…!

Zodiac Signs : నవగ్రహాలలో ప్రధానమైన గ్రహం కేతువు. అయితే కేతువు తిరోగమన దిశలోనే సంచరిస్తూ ఉంటాడు. అలాగే కేతువు నెమ్మదిగా కదులుతాడు. అందుకే కేతువు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరించడానికి దాదాపు 18 నెలల సమయం పడుతుంది. కేతువు అక్టోబర్ నెల 2023 లో కన్య రాశిలోకి ప్రవేశించాడు. ఇక ఈ ఏడాది మొత్తం కన్యరాశిలో సంచరించి వచ్చే ఏడాది మే లో వేరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో కేతువు ప్రభావం కొన్ని […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 October 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : కన్యా రాశిలోకి కేతువు ప్రవేశం...ఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు సొంతం...!

Zodiac Signs : నవగ్రహాలలో ప్రధానమైన గ్రహం కేతువు. అయితే కేతువు తిరోగమన దిశలోనే సంచరిస్తూ ఉంటాడు. అలాగే కేతువు నెమ్మదిగా కదులుతాడు. అందుకే కేతువు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరించడానికి దాదాపు 18 నెలల సమయం పడుతుంది. కేతువు అక్టోబర్ నెల 2023 లో కన్య రాశిలోకి ప్రవేశించాడు. ఇక ఈ ఏడాది మొత్తం కన్యరాశిలో సంచరించి వచ్చే ఏడాది మే లో వేరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో కేతువు ప్రభావం కొన్ని రాశుల వారిపై పడుతుంది. ముఖ్యంగా ఈ మూడురాశుల వారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Zodiac Signs : మేషరాశి

కేతువు సంచారం కారణంగా మేష రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు మెరుగుపడతాయి. అలాగే పెండింగ్ లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వీరు ఏ పని చేసినా అందులో విజయాలను సాధిస్తారు. మేష రాశి జాతకులకు ఈ సమయంలో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే వీరి దాంపత్య జీవితం బాగుంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క సలహాలు సంప్రదింపుల వలన చేసే పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా వీరికి బాగా కలిసి వస్తుంది.

Zodiac Signs : కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి కేతువు సంచారం కారణంగా వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. విదేశీ ప్రాంతాలలో వ్యాపారాలను విస్తరిస్తారు. అయితే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే వారి సహ ఉద్యోగుల నుంచి మరియు అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది.

Zodiac Signs కన్యా రాశిలోకి కేతువు ప్రవేశంఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు సొంతం

Zodiac Signs : కన్యా రాశిలోకి కేతువు ప్రవేశం…ఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు సొంతం…!

Zodiac Signs : వృశ్చిక రాశి

కేతువు సంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి అద్భుతమైన జ్ఞానం పెరుగుతుంది. ఈ సమయంలో ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కనబడుతుంది. వృశ్చిక రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే ఇది శుభ సమయం. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అలాగే పెట్టుబడులు పెట్టే వారికి మంచి లాభాలు ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో తీర్థయాత్రలకు లేదా విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది