Blessings Of Saturn : శ‌ని అనుగ్ర‌హంతో ఈ రాశుల వారికి ధ‌న‌యోగం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Blessings Of Saturn : శ‌ని అనుగ్ర‌హంతో ఈ రాశుల వారికి ధ‌న‌యోగం

 Authored By prabhas | The Telugu News | Updated on :28 May 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Blessings Of Saturn : శ‌ని అనుగ్ర‌హంతో ఈ రాశుల వారికి ధ‌న‌యోగం

Blessings Of Saturn : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడికి ఇష్టమైన రాశులుంటాయి. ఆ రాశులు క‌లిగిన వ్య‌క్తుల‌పై ఆయన ఎల్ల‌ప్పుడు అనుగ్రహంగా ఉంటాడు. వారి జాతకంలో శని శుభస్థానంలో ఉంటే తిరుగుండదని చెప్పొచ్చు. ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో ఏలిన‌నాటి శని ప్రభావం అనుభవించాలి. శారీరకంగా, మానసికంగా ఇబ్బందుల‌కు గురవుతారు. వీటితో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను అందించే న్యాయ దేవుడైన శనివల్ల లాభపడే రాశుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Blessings Of Saturn శ‌ని అనుగ్ర‌హంతో ఈ రాశుల వారికి ధ‌న‌యోగం

Blessings Of Saturn : శ‌ని అనుగ్ర‌హంతో ఈ రాశుల వారికి ధ‌న‌యోగం

తులారాశి

ఈ రాశివారికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. దీనివల్ల వీరు అపార లాభాలు, ప్రయోజనాలు పొందుతారు. శని దేవుడి ప్రభావం వల్ల తులారాశి వారు అధిక‌ ధనం పొందుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. సంపదకు, ఐశ్వర్యానికి, అందానికి, విలాసవంతమైన జీవితానికి శుక్రుడు కారకుడు. ఆయన అనుగ్రహంతో డబ్బులు వచ్చేలా శని దేవుడు చూస్తాడు.

కుంభరాశి

కొన్నాళ్ల నుంచి వేధిస్తున్న మానసిక సమస్యలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. అందరూ కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు. ఎదుటివారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కావునా మాటతీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి

శని దేవుడికి ఈ రాశి అంటే ఎంతో ఇష్టం. మకర రాశికి అధిపతిగా వ్యవహరిస్తాడు. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి వీరు బయటపడేలా చూస్తాడు. శనిదేవుడి అనుగ్రహం వల్ల వీరు అనేకరకాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.

వృషభరాశి

వీరికి శనిదేవుడి దయవల్ల అనంతమైన ధనం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా వీరు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకున్నవారు ఈ సమయంలో పెడితే శని, శుక్రుడి మద్దతు లభిస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది