Ashada Masam : ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి కారణం ఇదేనట..
Ashada Masam : ఆషాడ మాసం వచ్చింది అనగానే ప్రతి ఒక్కరు కూడా గోరింటాకు పెట్టుకోవటానికి ఎంతో ఇష్టపడతారు. ఈ ఆషాడ మాసంలో ఏ ఇంట్లో చూసినా గోరింటాకు సందడే కనిపిస్తుంది. అయితే అమ్మాయి చేతులయితే గోరింటాకుతో మెరిసిపోతుంటుంది. అయితే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గోరింటాకు సంబంధించిన వేడుకలు ఆకర్షిస్తున్నాయి. అలాగే సాంప్రదాయాలు మరియు ఆచార వ్యవహారాలలో ఏదో ఒక రకమైన రహస్యం దాగి ఉంటుంది. అయితే ఈ గోరింటాకు పండగకు కూడా ఒక రహస్యం ఉంది. తెలుగు లోగిళ్ళలో పండగ అయిన మరియు పబ్బమైన అమ్మాయి చేతులు మరియు కాళ్ళ గోరింటాకుతో మేరిసిపోతూ ఉంటాయి. ఇక ఆషాడ వచ్చిందంటే, గోరింటాకు నూరి చేతులకు పెట్టుకున్నట్లైతే శరీరానికి కూడా ఎంతో మంచిది అని అంటున్నారు. ఈ గోరింటాకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని పరిశోధనలో కూడా తేలింది. గ్రీష్మ రుతువు పోయి వర్ష రుతువు మొదలవుతుంది. అయితే గ్రీస్మరుతువులో మన శరీరంలో వేడి అనేది అధికంగా ఉండి, బయట వాతావరణం మాత్రం చల్లగా ఉంటుంది. దీనివలన బాడీ టెంపరేచర్ అనేది తగ్గి, జ్వరాలు మరియు అనారోగ్య సమస్యలు అధికంగా వస్తాయి. ఈ గోరింటాకు లో ఉన్న ప్రత్యేక గుణం వలన, శరీర ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. అందువలన ఆషాడంలో గోరింటాకును అరచేతిలో మరియు పాదాలకు పెట్టుకుంటూ ఉంటారు. అందువలన ఈ కాలంలో గోరింటాకును కచ్చితంగా పెట్టుకోవాలి అని అంటుంటారు…
ఆషాడ మాసం వస్తే చాలు హుస్నాబాద్ లో ప్రతి ఇంట్లో ఈ గోరింటాకు సందడే కనిపిస్తుంది. అక్కడ అక్కడ మెహేంది వేడుకలు కూడా జరుగుతాయి. సహజంగా పెరిగే గోరింట చేట్లకు ఉన్నటువంటి ఆకులను తీసుకొని రోట్లో వేసి మెత్తగా నూరుకొని మహిళలు చేతులకు, కాళ్లకు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా చేయటం వలన మహిళలకు ఆరోగ్యం మరియు సౌభాగ్యం వస్తుందని నమ్ముతారు.అయితే ఈ గోరింటాకు అలంకరణలో ఆక్యు ప్రెసి తెరపి అనేది ఉంటుంది అంటారు.అయితే మన శరీరంలో నాడులన్నీ, వేళ్ళ చివరలో అంతం అవుతాయని అక్కడ ఉన్నటువంటి నాడులన్నిటిని చల్ల భరిస్తే, శరీరమంతా కూడా చల్లబడుతుంది అనేది దీని ఉద్దేశం. దీనిని దృష్టిలో పెట్టుకొని మహిళలు అనాది కాలంగా కాళ్ళకు,చేతులకు, వేళ్ల కు గోరింటాకును పెట్టుకుంటారు. ఈ గోరింటాకును ముద్దలుగా చేసుకొని వేళ్ల కు పెట్టుకోవడం వలన వాటికి కొత్త అందం వస్తుంది అనేది కాదనలేని నిజం. కొందరైతే దిష్టి కోసం కూడా ఈ గోరింటాకును పెట్టుకుంటూ ఉంటారు.
Ashada Masam : ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి కారణం ఇదేనట..
ఈ గోరింటాకు పురాణాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. మన సంస్కృతిలో అయితే పడుచమ్మాయిల చేతులు గోరింటాకుతో ఎర్రగా పండినట్లయితే మంచి భర్త వస్తాడు అని అంటుంటారు. ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నామని ఇక్కడ మహిళలు అంటున్నారు. అయితే ఫాస్ట్ కల్చర్ లో పడిపోకుండా ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఈ ఆనవాయితిని ఏళ్లుగా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ ఆషాడ మాసంలో అందరూ ఒకచోట కూర్చొని హుస్నాబాద్ పట్టణంలో పద్మశాలి మహిళలు అందరూ కూడా ఈ గోరింటాకు వేడుకలు జరుపుతారు. అయితే ఈ గోరింటాకుతో వచ్చే అందం ఇతర మెహిందీలతో రాదు అని అంటున్నారు…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
This website uses cookies.