
Numerology : ఈ తేదీలలో పుట్టిన వారు మహర్జాతకులు... పట్టిందల్లా బంగారమే...!
Numerology : 6వ నెంబర్ లో పుట్టిన వ్యక్తులు ఎవరు..? వారి లక్షణాలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి..? ఈ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. 6వ నెంబర్ లో పుట్టిన వారు అంటే ఏ నెలలో అయిన 6 ,15 , 24 ,తేదీలలో పుట్టిన వారిని 6వ నెంబర్ జాతకులు అంటారు. ఈ 6వ నెంబర్ అనేది శుక్రుడు కారకత్వంతో కలిగి ఉంటుంది. శుక్ర గ్రహం వృక్ష స్థానంలో ఉండి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో 6వ నెంబర్ లో పుట్టిన వారు అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. వీరు ఆకర్షణీయంగా ఉంటారు. అందమైన స్వరూపం కలిగి ఉంటారు మరియు బోలా మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు తీసుకున్న బాధ్యతలను సవ్యంగా నిర్వహించగలుగుతారు. వీరికి నెమ్మదిగా చెబితే ఏ పనైనా చేస్తారు కాని ఆర్డర్ వేసి చెబితే మాత్రం దానిని చెయ్యరు. ప్రేమతో చెబితే ఏ పనైనా చేస్తారు వీరు ప్రేమ తత్వానికి బానిస. వీరు మంచి మనస్తత్వం కలవారు అలాగే మంచి పనులు చేయడానికి ముందుంటారు.
వీరు చెడుకి దూరంగా ఉంటారు. వీరికి చెడు చేయాలనే ఆలోచన కూడా ఉండదు. 6వ నెంబర్ లో పుట్టినటువంటి స్త్రీలు ఇంటిని పిల్లలని భర్తని చూసుకోవడంలో ఒక ఇల్లాలుగా సమర్థవంతమైన పాత్రను పోషించగలగడంలో ముందుంటారు. కాకపోతే వీరి పేర్లలో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి. రాంగ్ నెంబర్ ఉంటే అందాల్సిన అదృష్టం అందకుండా పోతుంది. కాబట్టి అందులో జాగ్రత్త వహించాలి. అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లో అప్పులు చేయకుండా ఉండాలి ఒకవేళ వీరు అప్పులు చేస్తే అప్పుల వల్ల కష్టాలను కొనితెచ్చుకున్నవారు అవుతారు. అందుకోసమే అప్పులు చేయకుండా ఉండటం ఉత్తమమైన మార్గం. అయితే వీరు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అంటే 6వ నెంబర్ లో పుట్టినటువంటి మగవారు వారి ఇంట్లో ఆడవాళ్లను వారిని చులకన చేసి గాని తప్పు చేస్తే గాని మాట్లాడకూడదు. ముఖ్యంగా భార్యలను బాధ పెట్టకుండా చూసుకోవడం వలన వీరికి జీవితంలో బాగా కలిసి వస్తుంది. అలాగే ఆడవాళ్లు భర్తను ఎదురించకుండా గౌరవంగా చూసుకుంటే బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే శుక్రుడికి భార్య భర్తల మధ్య కీచులటా గొడవలు అంటే ఇష్టం ఉండదు. కాబట్టి 6వ నెంబర్ లో పుట్టిన వారు భార్య భర్తల మధ్య గొడవలు లేకుండా చూసుకోవడం వలన వీరి జీవితంలో అన్ని రకాలు గా వృద్ధిలోకి వస్తారు.
Numerology : ఈ తేదీలలో పుట్టిన వారు మహర్జాతకులు… పట్టిందల్లా బంగారమే…!
6వ నెంబర్ లో పుట్టిన వారు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం పూజించడం మరియు ధ్యానించడం జపించడం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈశ్వర అభిషేకం మరియు శివాలయ సందర్శనం అర్చన అభిషేకం చేయడం వలన వీరికి అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.