Zodiac Signs : సూర్యుడు శని దేవుడు సంచారంతో ఏర్పడనున్న సంసప్తక యోగం..ఈ రాశుల వారికి అదృష్టం…!
Zodiac Signs : సూర్యుడి కుమారుడిగా పిలవబడే శని దేవుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే సూర్యుడు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు దాదాపు 180 డిగ్రీల దూరంలో సంచారం చేస్తున్నట్లుగా జ్యోతిష్యం పండితులు చెబుతున్నారు. సూర్యుడు మరియు శని దేవుడు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన సంసప్తక యోగం ఏర్పడిందని , దీని ప్రభావం వచ్చే నెల 16వ తేదీ వరకు ఉంటుందని తెలియజేస్తున్నారు. అయితే దాదాపు మూడు […]
ప్రధానాంశాలు:
Zodiac Signs : సూర్యుడు శని దేవుడు సంచారంతో ఏర్పడనున్న సంసప్తక యోగం..ఈ రాశుల వారికి అదృష్టం...!
Zodiac Signs : సూర్యుడి కుమారుడిగా పిలవబడే శని దేవుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే సూర్యుడు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు దాదాపు 180 డిగ్రీల దూరంలో సంచారం చేస్తున్నట్లుగా జ్యోతిష్యం పండితులు చెబుతున్నారు. సూర్యుడు మరియు శని దేవుడు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన సంసప్తక యోగం ఏర్పడిందని , దీని ప్రభావం వచ్చే నెల 16వ తేదీ వరకు ఉంటుందని తెలియజేస్తున్నారు. అయితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సూర్యుడు ఈ దశలోకి వచ్చాడు. ఇలాంటి పరిణామాల వలన కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. మరి ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Zodiac Signs కుంభరాశి…
సూర్యుడు మరియు శని దేవుడు 180 డిగ్రీల దూరంలో సంచారం చేస్తున్నందున కుంభరాశి వారికి కాస్త కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు సానుకూల పరిస్థితులు నెలకొంటారు. అదేవిధంగా వైవాహిక జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ సమయంలో సులభంగా విముక్తి పొందుతారు. ఆరోగ్యవంతులవుతారు. ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పనులన్నీ పూర్తి అవుతాయి. ఏ పని మొదలుపెట్టిన ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయగలుగుతారు.
Zodiac Signs మిధున రాశి…
సంసప్తక యోగం ఏర్పడడం వలన మిధున రాశి వారికి అదృష్టం పట్టనుంది. ఈ సమయంలో కొత్తగా ఇళ్ల నిర్మాణం చేయడంతో పాటు , భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి దుబారా ఖర్చులు పెట్టరాదు. అన్ని రంగాలలో పురోగతి సాధిస్తారు. సంపద దినాభివృద్ధి చెందుతుంది.
మేషరాశి…
సంసప్తక యోగం కారణంగా మేష రాశి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆదాయం పెరగడంతోపాటు , కొత్త ఆదాయ వనరులు వస్తాయి. పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది మంచి శుభ సమయం. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ సమయంలో ఆరోగ్యవంతులవుతారు. శుభవార్తలను వింటారు.