Karthika Deepam 2 March 17 Episode : దీప పతనమే నా లక్ష్యం అంటున్న జ్యోత్స్న.. దశరథ హోమం.. జ్యోత్స్న, దాసు మధ్య తీవ్ర వాగ్వాదం

 Authored By jagadesh | The Telugu News | Updated on :17 March 2026,8:37 am

Karthika Deepam 2 March 17 Episode : స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమవుతున్న ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 రోజురోజుకూ ఊహించని మలుపులతో, భావోద్వేగ భరిత సన్నివేశాలతో ఉత్కంఠగా సాగుతోంది. కార్తీక్, దీపల జీవితాల్లో ఎదురవుతున్న కఠిన పరీక్షలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా సుమిత్ర ప్రాణాలను కాపాడేందుకు దీప, కార్తీక్ తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. మరి ఈరోజు (మార్చి 17) ప్రసారమైన 620వ ఎపిసోడ్‌లో Karthika Deepam 2 Today Episode ఎలాంటి సంచలన విషయాలు చోటు చేసుకున్నాయో పూర్తి వివరాల్లోకి వెళదాం.

Karthika Deepam 2 March 17 Episode : దీప పతనమే నా లక్ష్యం అంటున్న జ్యోత్స్న.. దశరథ హోమం.. జ్యోత్స్న, దాసు మధ్య తీవ్ర వాగ్వాదం

Karthika Deepam 2 March 17 Episode : దీప పతనమే నా లక్ష్యం అంటున్న జ్యోత్స్న.. దశరథ హోమం.. జ్యోత్స్న, దాసు మధ్య తీవ్ర వాగ్వాదం

Karthika Deepam 2 March 17 Episode దీపకు కొండంత అండగా నిలబడ్డ కార్తీక్.. అసలు నిజం దాచేందుకే ఆ త్యాగం

ఎపిసోడ్ ప్రారంభంలో హాస్పిటల్‌లో కార్తీక్, దీపల మధ్య అత్యంత భావోద్వేగభరితమైన సంభాషణ జరుగుతుంది. “దీపా.. అత్తయ్యకు ఆపరేషన్ జరిగేంత వరకు ఈ సమాజం నుంచి, బంధువుల నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా మనం భరించాల్సిందే. వీళ్లందరికీ మనం కేవలం పుట్టబోయే బిడ్డను వద్దు అనుకుంటున్నామని మాత్రమే తెలుసు. కానీ, ఆ బిడ్డను మనం ఎందుకు వద్దు అనుకుంటున్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామో ఇప్పుడు వాళ్లకు చెప్పగలమా? చెబితే వాళ్లు ఈ నిజాన్ని అర్థం చేసుకోగలరా?” అని కార్తీక్ ఆవేదనగా అడుగుతాడు. అసలు నిజం బయటపడితే జరిగే అనర్థాన్ని కార్తీక్ వివరిస్తూ.. “అత్తయ్య (సుమిత్ర) ఉన్న మెంటల్ కండిషన్‌కు, తను ఇన్ని సంవత్సరాలు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న జ్యోత్స్న తన సొంత కూతురు కాదని తెలిస్తే తట్టుకోలేదు. ఆపరేషన్ జరగకపోయినా కాదు.. జ్యోత్స్న తన కన్నకూతురు కాదన్న నిజం తెలిసిన మరుక్షణమే అత్తయ్య చనిపోతుంది” అని కార్తీక్ చెప్పిన మాటలకు దీప షాక్ అవుతుంది. “ఈ పారు, జ్యోత్స్నలు నిన్ను రెచ్చగొట్టి ప్రశ్నలతోనే చంపేసేవాళ్లు. ఇప్పుడు మనకు అవసరమైన వాటిని మాత్రమే మనం మోయాలి. ముందుగా నీ కన్నతల్లి ప్రాణాలను కాపాడుకోవాలి. ఓ కూతురిగా నువ్వేం చేస్తావో అది చెయ్. నీ భర్తగా నీకు అండగా ఉంటూ నేనేం చేయాలో అది చేస్తా. ఈ సమాజం మొత్తం నిన్ను వేలెత్తి చూపించినా సరే, నేను నీ వెంటే ఉంటాను” అని కార్తీక్ భరోసా ఇస్తాడు. ఈ మాటలకు ఎమోషనల్ అయిన దీప కార్తీక్‌ను హత్తుకుని, “నీ రుణం తీర్చుకోవడానికి నేను మరో జన్మ ఎత్తాల్సిందే కార్తీక్ బాబు” అని కన్నీరు పెట్టుకుంటుంది.

Karthika Deepam 2 March 17 Episode గురువుగారి శరణుకోరిన దశరథ.. ప్రాణాల కోసం అఖండ హోమం

మరోవైపు కూతురు, భార్య, పుట్టబోయే బిడ్డ.. ఇలా ఎవరినీ కోల్పోలేక దశరథ మానసిక క్షోభ అనుభవిస్తుంటాడు. నేరుగా గురువుగారి దగ్గరకు వెళ్లి తన ఆవేదనను వెళ్లగక్కుతాడు. “గురువుగారూ.. నేను నా వాళ్లలో ఎవరినీ పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను” అని అంటాడు. దానికి గురువుగారు స్పందిస్తూ.. “జరగబోయే దాన్ని ఆపడం మీ వల్ల అవుతుందా? ఫలితం లేని ప్రయత్నం వృథా కదా” అని హితబోధ చేస్తాడు. అయినా దశరథ వినకుండా.. “జరిగేదానిని నేను అడ్డుకోలేకపోతున్నాను నిజమే.. కానీ అలా అని నా కళ్లెదురుగా జరుగుతున్న దారుణాన్ని మానసికంగా ఒప్పుకోలేకపోతున్నాను. ఒక ప్రాణం కోసం మరో ప్రాణం పోతుందని తెలిస్తే, ఆ ప్రాణాల కంటే ముందు నా ప్రాణం పోయినా పర్లేదు. నా కూతురు దీప బాగుండాలి, నా కూతురు కడుపులో పెరుగుతున్న పసిబిడ్డ బాగుండాలి, అలాగే నా భార్య సుమిత్ర బతకాలి. ఈ ముగ్గురిలో ఎవరికీ ఎలాంటి ఆపద రాకూడదు. అందుకు ఏదో ఒక దారి, మార్గం చూపించండి గురువుగారూ” అని ప్రాధేయపడతాడు. దశరథ ఆవేదనను అర్థం చేసుకున్న గురువుగారు.. “అయితే మీరు ఒక అఖండ హోమం చేయాలి. నిష్టగా, ఎటు కదలకుండా ఈ హోమాన్ని పూర్తి చేయాలి” అని సూచిస్తారు. దానికి అంగీకరించిన దశరథ, “మీరు హోమానికి ఏర్పాట్లు చేయండి.. కానీ ఈ నిజం కేవలం మన ఇద్దరి మధ్యే ఉండాలి” అని కోరతాడు. గురువుగారు సరేనని, భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని దీవిస్తారు.

అన్నయ్య నిర్ణయాన్ని సమర్థించిన స్వప్న.. విడాకులపై శ్రీధర్ సెటైర్లు

ఇంట్లో దీప బిడ్డను వదిలేసుకుంటోందని తెలిసి కావేరి రగిలిపోతుంటుంది. “దీపకు మతి పోయిందా? బిడ్డను వద్దు అనుకోవడం ఏంటి?” అని ప్రశ్నిస్తుంది. అప్పుడు స్వప్న కలుగజేసుకుని.. “అన్నయ్య (కార్తీక్) ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అందులో మనకు అర్థం కాని చాలా పెద్ద ప్రయోజనం ఏదో ఉండే ఉంటుంది. వదినకి, అన్నయ్యకి పిల్లలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. అలాంటి వాళ్లు తమ కడుపున పుట్టబోయే బిడ్డను వదులుకోవడానికి సిద్ధపడ్డారంటే ఎవరికీ చెప్పుకోలేని చాలా పెద్ద బలమైన కారణమే ఉండి ఉంటుంది” అని విశ్లేషిస్తుంది. కాశీ కూడా స్వప్న మాటలకు వంతపాడుతూ.. “నిజం చెప్పకపోయినా వాళ్లిద్దరూ ఎప్పటికీ తప్పు చేయరు. మీరు వాళ్లిద్దరినీ ఇలా అనుమానించొద్దు” అని కావేరికి చెబుతాడు. వీరిద్దరి మాటలు విన్న శ్రీధర్ వ్యంగ్యంగా చప్పట్లు కొడతాడు. “మీ ఇద్దరినీ చూస్తుంటే భలే ముచ్చటగా ఉంది. మనసులు కలవడం లేదు, మా అభిప్రాయాలు వేరు, ఆలోచనలు వేరు అని చెప్పి ఏకంగా విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టిన మీరే.. కార్తీక్, దీపల విషయంలో మాత్రం ఇంత ఏకాభిప్రాయంతో ఉన్నారు. వాళ్లు తప్పు చేస్తున్నారని నేను అంటుంటే, కాదు ఒప్పు చేస్తున్నారని మీరంటున్నారు. మరి వేరొకరి విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్న మీరిద్దరూ.. మీ సొంత జీవితాల విషయంలో మాత్రం ఎందుకు కలిసి ఉండటం లేదు? మీ తప్పుల్ని మాత్రం ఒప్పులుగా చూస్తున్నారా? ఒప్పుకోవడానికి మీ అహాలు అడ్డొస్తున్నాయా?” అని శ్రీధర్ నిలదీస్తాడు. ఆ మాటలకు కోపమొచ్చిన స్వప్న, దానికి దీనికి ముడిపెట్టొద్దని అరుస్తుంది.

ఆసుపత్రిలో శివన్నారాయణ ఎమోషనల్ రిక్వెస్ట్.. కరగని కార్తీక్ మనసు

హాస్పిటల్ లో శౌర్య ఇచ్చిన బొమ్మను చూస్తూ దీప ఎమోషనల్ అవుతుంటుంది. కార్తీక్ ఆ బొమ్మను బ్యాగ్‌లో దాచబోతుండగా శివన్నారాయణ, జ్యోత్స్న అక్కడికి వస్తారు. నిన్న జరిగిన వాదన వల్ల మీ ముఖాలు చూడకూడదు అనుకున్నానని, కానీ జ్యోత్స్న అడగడంతో మరోసారి ప్రయత్నిద్దామని వచ్చానని పెద్దాయన అంటాడు. “నేను మీ బంధువుగా, ఇంటి పెద్దగా ఇక్కడికి రాలేదు. ఈ వయసులో నాలాంటి వాడు కోరుకునేది తన చుట్టూ ఉన్న మనుషుల సంతోషం మాత్రమే. మీరు బిడ్డను పోగొట్టుకోవడానికి తీసుకున్న నిర్ణయాన్ని నేను ఏమాత్రం భరించలేకపోతున్నాను. దీపకి మళ్లీ పిల్లలు పుట్టరని డాక్టర్ గారు ఖరాకండిగా చెప్పారు. కొన్ని వదులుకున్నా మళ్లీ వస్తాయి.. కానీ ఇలాంటివి ఒక్కసారి వదులుకుంటే మళ్లీ తిరిగిరావు. ఈ నిర్ణయం మార్చుకోండి.. లేదంటే భవిష్యత్తులో చాలా బాధపడతారు” అని శివన్నారాయణ కన్నీటిపర్యంతం అవుతూ అడుగుతాడు. కానీ దీప, కార్తీక్ తమ నిర్ణయాన్ని మార్చుకోలేమని తేల్చి చెబుతారు.

దాసుకు జ్యోత్స్న వార్నింగ్.. దీప పతనమే నా లక్ష్యం అంటున్న విలనిజం

ఇదే సమయంలో జ్యోత్స్నకు దాసు నుంచి ఫోన్ వస్తుంది. బయటికి వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసిన జ్యోత్స్న.. ‘నాన్న’ అని పిలవకుండా “చెప్పు దాసు” అని పేరు పెట్టి పిలుస్తుంది. అలా పిలవడంతో దాసు షాక్ అవుతాడు. “తప్పులు చేసి తప్పించుకుని తిరుగుతున్నావ్, ఇక పాపాలు చేయకమ్మా” అని దాసు అంటాడు. దానికి జ్యోత్స్న పొగరుగా సమాధానమిస్తూ.. “నేను నిన్ను నాన్న అని పిలవడానికి నువ్వు నన్ను కనలేదు కదా. పోనీ బాబాయ్ అందామంటే నువ్వు మా నాన్న తమ్ముడివి కాదు. ఇలా పేరు పెట్టి పిలిస్తే గుచ్చుకున్నట్లు ఉందా? నువ్వు ఫీల్ అవుతున్నావంటే నువ్వే నా అసలైన తండ్రివి అన్నమాట! ఇదే కదా నువ్వు నన్ను నమ్మించాలనుకున్న నిజం” అని సెటైర్లు వేస్తుంది.

అప్పుడు దాసు సీరియస్ అవుతూ.. “దీపని ఇబ్బంది పెట్టొద్దమ్మా. అవకాశం దొరికింది కదా అని నువ్వు దీపని, కార్తీక్‌ని హాస్పిటల్ లో టార్చర్ చేయడం మొదలుపెట్టావంటే ఆ పాపం నిన్ను వదిలిపెట్టదు” అని వార్నింగ్ ఇస్తాడు. దానికి జ్యోత్స్న మరింత రెచ్చిపోతూ.. “పాపాలను చూడటం కూడా పాపమే దాసు. నువ్వు, మీ అమ్మ కలిసి ఎన్నో పాపాలు చేశారు. ఇప్పుడు వాటిని సరిచేయాలని నువ్వు ట్రై చేస్తున్నావు. కానీ అది నీ వల్ల కాదు. ఆట మీరు మొదలెట్టారు, దానిని నేను ముగిస్తా. దీప నా బద్ధ శత్రువు. దాని పతనమే నా ఏకైక లక్ష్యం. అసలు దీప ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది?” అంటూ రగిలిపోతూ సమాధానం ఇస్తుంది. ఈ ఉత్కంఠభరితమైన డైలాగ్స్ తో నేటి కార్తీక దీపం 2 Karthika Deepam 2 March 17th Episode ముగుస్తుంది.

తర్వాత ఎపిసోడ్‌లో దశరథ చేసే హోమం సఫలం అవుతుందా? కార్తీక్, దీప బిడ్డను నిజంగానే త్యాగం చేస్తారా? సుమిత్రకు నిజం తెలుస్తుందా? అనే విషయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి