Zodiac Signs : అక్టోబర్ 03 సోమవారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే….?
మేషరాశి ఫలాలు: ధన లాభాలు వస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. మిత్రుల సహకారం లభిస్తుంది. అనుకోని చోట నుంచి ఆహ్వానాలు అందుతాయి. పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. అన్నదమ్ముల ద్వారా శుభవార్తలు అందుతాయి. శ్రీ శివాభిషేకం చేయించండి. వృషభ రాశి ఫలాలు : ఆత్మవిశ్వాసంతో ముందుకుపోతారు. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. విజయం కోసం క్రొత్త ఆలోచనలు చేస్తారు. ప్రయాణాలు సుఖవంతంగా చేస్తారు. మహిళలకు పనిభారం పెరుగుతుంది. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు: శారీరక అలసట పెరుగుతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. సాయంత్రం నుంచి ఆర్థికంగా బాగుంటుంది. అన్నింటా స్వల్పలాభాలు. అప్పులను తీరుస్తారు. ప్రేమికుల మధ్య అపోహలు తగ్గుతాయి. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్త. మహిళలకు ఆర్థిక లాభాలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు: ఆరోగ్యం బాగుంటుంది. అన్నింటా మీకు అనుకూలతలు పెరుగుతాయి. విద్యా, వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు లాభాదాయకమైన రోజు. శ్రీ దుర్గాసూక్తంతో ఆరాధన చేయండి.
సింహ రాశి ఫలాలు: ఉత్సాహంగా ఉంటుంది ఈరోజు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి. పొదుపు చేస్తారు. ఆదాయం కూడా పెరుగుతుంది. మీ ప్రేమ అనుకోని మలుపు తిరుగుతుంది. వ్యాపార భాగస్థులు సహకరిస్తారు. ఆఫీస్లో మీకు అనుకూలమైన రోజు. శ్రీ మహాకాళీ ఆరాధన చేయండి.
కన్యా రాశి ఫలాలు: కొంత స్తబ్దత ఉంటుంది కానీ మీ ఆలోచనల ద్వారా మీరు ముందుకుపోతారు. అప్పులను తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అనుకోని వివాదాలు వస్తాయి. వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లను పెట్టడానికి అనుకూలం. ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. అమ్మవారి ఆరాధన చేయండి.
తులా రాశి ఫలాలు: కొద్దిగా హుషారుగా ఉంటారు. అనుభవం ఉన్న వారి సలహాలు మీరు తీసుకుంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదాయం కోసం కొత్త ప్రయత్నాలు ఫలిస్తారు. ప్రముఖులతోను పరిచయాలు పెంచుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు. శ్రీ కాళీ, సరస్వతి, లక్ష్మీ ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు: కొద్దిగా ఇబ్బంది పడేరోజు. ఆదాయం కోసం ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు వస్తాయి. ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితుల ద్వారా మఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అమ్మ తరపు వారి నుంచి లాభాలు వస్తాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు: ఈరోజు సంతోషం నిండిన రోజు. అప్పులు చెల్లిస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు పెద్దగా ఫలించవు. అనుకోని ప్రయణాలు ఇబ్బంది పెడుతాయి. సాయంత్రం నుంచి వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
మకర రాశి ఫలాలు: ధనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు పెడుతారు. వ్యాపారాలలో అంత లాభాలు రావు. సమస్యలు ఎదురవుతాయి. మహిళలు పనిభారం. కష్టపడి పని చెయ్యడం, ఓర్పు వహించడం ద్వారా మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఈ రోజు మీ జీవితంలో వసంతం వంటిది. శ్రీ లక్ష్మీ సూక్తంతో పారాయణం చేయండి.
కుంభ రాశి ఫలాలు: చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. సమస్యలను తేలికగా ఎదురిస్తారు.పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. ప్రేమవ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. మహిళలకు చక్కటి రోజు. శ్రీ దుర్గాసూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు: ఊహించని ఆదాయం వస్తుంది. అన్నింటా సానుకూల ఫలితాలు. కొత్త పనులు ప్రారంభిస్తారు. పనులలో పురోగతి కనిపిస్తుంది. బందువులు లేదా మిత్రుల నుండి వచ్చిన ఫోన్ కాల్ ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీ సరస్వతి, దుర్గా ఆరాధన చేయండి.