Karthika Deepam 2 March 12th 2026 Episode : దీప పుట్టుకపై నిజాన్ని బయటపెట్టిన దశరథ.. ఆస్తి కోసం దీపను కాల్చేసిన జ్యోత్స్న!

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: March 12, 2026, 8:30 am

Karthika Deepam 2 March 12th 2026 Episode : బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న ‘కార్తీక దీపం 2’ సీరియల్ అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. మార్చి 12వ తేదీన ప్రసారమైన 616వ ఎపిసోడ్‌లో ఇన్నాళ్లూ దాచిన నిజాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ముఖ్యంగా దీప పుట్టుక వెనుక ఉన్న రహస్యం, ఆస్తి కోసం జ్యోత్స్న చేసిన ఘాతుకం ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తున్నాయి.

Karthika Deepam 2 March 12th 2026 Episode : దీప పుట్టుకపై నిజాన్ని బయటపెట్టిన దశరథ.. ఆస్తి కోసం దీపను కాల్చేసిన జ్యోత్స్న!

Karthika Deepam 2 March 12th 2026 Episode : దీప పుట్టుకపై నిజాన్ని బయటపెట్టిన దశరథ.. ఆస్తి కోసం దీపను కాల్చేసిన జ్యోత్స్న!

Karthika Deepam 2 March 12th 2026 Episode హస్పిటల్ డ్రామా.. రిపోర్ట్స్ కోసం ఉత్కంఠ!

ఎపిసోడ్ ప్రారంభంలో, దీప ఆరోగ్యంపై అనుమానంతో జ్యోత్స్న, శివన్నారాయణ ఆమెకు టెస్టులు చేయిస్తారు. రిపోర్ట్స్ వచ్చే వరకు ఎవరూ ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదని జ్యోత్స్న కండిషన్ పెడుతుంది. కార్తీక్ ఎంత వారించినా శివన్నారాయణ వినడు. దీంతో కార్తీక్ – దీపలు తీవ్ర ఆందోళనకు గురవుతారు. అబద్ధం ఎక్కడ బయటపడుతుందో అని కార్తీక్ తలపట్టుకుంటాడు.

Karthika Deepam 2 March 12th 2026 Episode స్వప్న – కాశీల పెళ్లి రోజు.. దాస్ ఎమోషనల్ స్పీచ్!

మరోవైపు, స్వప్న ఉన్న చోటకి దాస్ వస్తాడు. ప్రసాదం ఇచ్చి బొట్టు పెట్టుకోమని చెప్పగా, స్వప్న నుదుటిన సింధూరం పెట్టుకుంటుంది. అది చూసి దాస్, కావేరిలు ఆశ్చర్యపోతారు. ఈ క్రమంలోనే దాస్ ఒక చేదు నిజాన్ని గుర్తు చేస్తాడు. “ఈరోజు మీ మొదటి పెళ్లి రోజు.. ఒకప్పుడు అమర ప్రేమికులుగా ఉన్న మీరు, ఇప్పుడు విడిపోయిన దంపతులుగా మిగిలారు” అంటూ దాస్ ఆవేదన వ్యక్తం చేస్తాడు. కనీసం పెళ్లి రోజు కూడా గుర్తులేనంతగా మీరు మారిపోయారా అని ప్రశ్నించడంతో స్వప్న, కాశీలు మౌనంగా ఉండిపోతారు.

దశరథ ఇంటికి చేరిన పంచాయితీ..

దీప, కార్తీక్, మిగిలిన కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగానే దశరథ కంగారు పడతాడు. “గుడికి వెళ్లకుండా హస్పిటల్‌కి ఎందుకు వెళ్లారు?” అని ప్రశ్నిస్తాడు. నిజాలు తేల్చడానికే వెళ్లామని శివన్నారాయణ బదులిస్తాడు. కార్తీక్, దీపలు బిడ్డ విషయంలో అబద్ధం ఆడుతున్నారని పారిజాతం, జ్యోత్స్నలు దశరథను రెచ్చగొడతారు. “తల్లి, బిడ్డ ప్రాణాల మీదకి వస్తుందని వాడు బాధపడుతుంటే, మీరు ఎంక్వైరీలు చేస్తారా?” అని దశరథ ఫైర్ అవుతాడు.

డాక్టర్ ఫోన్ కాల్.. బయటపడ్డ అబద్ధం!

సరిగ్గా అప్పుడే జ్యోత్స్నకి గైనకాలజిస్ట్ నుండి ఫోన్ వస్తుంది. “దీప కడుపులోని బిడ్డ వల్ల ప్రాణాపాయం ఉందన్నది పూర్తిగా అబద్ధం. ఎవరో తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చి మిమ్మల్ని భయపెట్టారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు” అని డాక్టర్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. కార్తీక్ చెప్పింది అబద్ధమని తేలడంతో శివన్నారాయణ, శ్రీధర్ తీవ్రంగా మండిపడతారు. “మా ఇంట్లో మా అమ్మ పుడుతుందని ఆశపడుతుంటే, ఇలాంటి అబద్ధాలతో మమ్మల్ని ఎందుకు వంచించారు?” అని నిలదీస్తారు.

బిగ్ ట్విస్ట్: దీప పుట్టుక వెనుక నిజం చెప్పేసిన దశరథ!

అందరూ దీపను, కార్తీక్‌ను దోషులుగా నిలబెట్టేసరికి దశరథ ఇక భరించలేకపోతాడు. కార్తీక్ వద్దు అంటున్నా వినకుండా, “నేను ఈరోజు నిజం చెప్పే తీరుతాను” అని ప్రకటిస్తాడు. “దీప కడుపులోని బిడ్డకు ప్రమాదం ఉందన్నది నిజమే.. కానీ అది నా భార్య సుమిత్ర ప్రాణాలను కాపాడటం కోసం! సుమిత్ర బతకాలంటే దీప తన బిడ్డను త్యాగం చేయాలి. ఎందుకంటే దీప ఎవరో కాదు.. సుమిత్ర కన్నకూతురు!”

ఈ మాట వినగానే పారిజాతం, శివన్నారాయణ, జ్యోత్స్నల కాళ్ల కింద భూమి కదిలినట్లవుతుంది. “నాకు, సుమిత్రకు పుట్టిన అసలైన వారసురాలు దీప. పుట్టగానే ఆసుపత్రిలో బిడ్డలను మార్చేసి, ఈ ఇంటి వారసురాలిని అనాథను చేసింది పారిజాతం పిన్ని” అని దశరథ కుండబద్ధలు కొడతాడు. జ్యోత్స్న ఈ ఇంటి బిడ్డ కాదు, ఆమె దాస్ కూతురు అని నిజం బయటపెట్టడంతో పారిజాతం వణికిపోతుంది.

దీపపై తూటా పేల్చిన జ్యోత్స్న..

దశరథ నిజం చెప్పాక, “దీప ఈ ఇంటి వారసురాలు. జ్యోత్స్న తన తండ్రి దాస్ దగ్గరికి వెళ్లిపోవాలి” అని స్పష్టం చేస్తాడు. దీంతో తట్టుకోలేని జ్యోత్స్న, తన ఆస్తి, హోదా పోతుందన్న భయంతో కిరాతకానికి ఒడిగడుతుంది. “ఈ ఇంటికి ఒక్కరే వారసురాలు ఉండాలి.. అది నేనే అవ్వాలి. దీప బతికుంటే కదా మీరు తనని వారసురాలిని చేసేది” అంటూ తన దగ్గరున్న గన్‌తో దీపను షూట్ చేస్తుంది. రక్తపు మడుగులో పడిపోయిన దీపను చూసి అందరూ కేకలు వేస్తుండగా ఎపిసోడ్ ముగుస్తుంది.

కార్తీక దీపం 2 చరిత్రలో ఇది అత్యంత కీలకమైన ఎపిసోడ్. దీప తను ఎవరో తెలుసుకునే లోపే జ్యోత్స్న ప్రాణాంతక దాడి చేయడం ఇప్పుడు తదుపరి ఎపిసోడ్లపై ఉత్కంఠను పెంచుతోంది. దీప బతుకుతుందా? జ్యోత్స్న జైలుకు వెళ్తుందా? అనేది రేపటి ఎపిసోడ్‌లో చూడాలి.

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp