Today is Jaishta Purnima Saturday at 9:15 PM
Jyeshtha Purnima 2023 : ఈరోజే జైష్ట పూర్ణిమ శనివారం రాత్రి తొమ్మిది గంటల 15 నిమిషాలకు ఈ పూర్ణిమ శనివారం రోజున కొడుకులు ఉన్నవారు చేయవలసినటువంటి ఆ పరిహారం ఏంటి.. ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఏం జరుగుతుంది.. ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి.. ఇలాంటి విషయాలని మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ పవిత్రమైన రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు పరుగుతాయని చాలామంది నమ్ముతారు. ఏడాదిలో ప్రతినెలా పౌర్ణమి వచ్చినప్పటికీ జేష్ఠ మాసం ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పర్వదినాన సత్యనారాయణకి లక్ష్మీదేవికి ,విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉపవాస దీక్షను ఆచరిస్తారు.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం జూన్ మూడవ తేదీ శనివారం నాడు ఉదయం 11:16 నిమిషాల తర్వాత పౌర్ణమి ప్రారంభమవుతుంది.
ఆ మరుసటి రోజు జూన్ 4వ తేదీన ఆదివారం ఉదయం తొమ్మిది గంటల 11 నిమిషాల వరకు ముగుస్తుంది. ఈ పవిత్రమైన సమయంలో పవిత్రమైన ప్రవహించే నదిలో స్నానం చేయడానికి ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు. ఈ రోజున శుభకార్యాలు చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈసారి వచ్చిన పౌర్ణమి రోజున మూడు పవిత్రమైన శుభయోగాలు ఏర్పడును.. ఇదే రోజున అనురాధ నక్షత్రం రాత్రంతా ఉంటుందని పండితులు చెప్తున్నారు. 9గంటల 48 నిమిషాలకు ప్రారంభమై రాత్రంతా ఉంటుంది. ఈ రోజున తీర్థయాత్ర నదిలో స్నానం చేయడం వల్ల శుభం కలుగుతుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా పవిత్రమైన తిధిగా చెప్పారు. అంతేకాకుండా ఆనందం, శాంతి మీకు కలుగుతాయి. అలాగే కొడుకులు ఉన్న ప్రతి ఒక్క తల్లి చేయవలసిన టిప్స్ ప్రతి తల్లి ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచిది.
Today is Jaishta Purnima Saturday at 9:15 PM
మరి ఒక జీవితంలో వారు ఉన్నత పదవులకి వెళ్లడమే కాకుండా వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులలో స్థిరపడతారని చెప్పబడుతుంది. మరి చేయవలసిన పరిహారం ఏంటి అంటే.. జేష్ట పౌర్ణమి రోజు సాయంత్రం అంటే రాత్రి 9:15 నిమిషాల్లోపు చక్కగా మీ సింహద్వారానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసి ఇరువైపులా కూడా అష్టదళ పద్మ ముగ్గు వేసి దానిపైన చక్కగా చిల్లులు కానీ కన్నాలు కానీ లేదంటే ఎటువంటి మచ్చలు కానీ లేనటువంటి రావి ఆకులను రెండు తీసుకురండి. ఆ రెండు రావి ఆకులను తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మానికి అంటే సింహద్వారానికి ఇరువైపులా పెట్టండి. అంటే ప్రమిదలో ప్రమిద అలాగే రెండు వైపులా కూడా ప్రమిదలో విప్ప నూనె పోసి దీపాలను పెట్టండి. ఈ పరిహారాన్ని చేస్తే కనుక వారి యొక్క పుత్రుల జీవితాలకు చాలా చక్కటి ఉజ్వల భవిష్యత్తును ఇచ్చిన వారు అవుతారు..
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
This website uses cookies.