Vastu Dosh : వాస్తు శాస్త్రంలో వాస్తు దోషానికి సంబంధించిన నివారణలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో శాంతి ఆనంద శ్రేయస్సును పొందడానికి అనేక మార్గాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏనుగు విగ్రహాలకు వాస్తు శాస్త్రంలో పెద్దపీటనే వేశారు. ఎందుకంటే ఇంట్లో ఏనుగు విగ్రహాలు ఉంటే అనేక వాస్తు దోషాలు వీటి ద్వారా తొలగిపోతాయి. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఇంట్లో వెండి ఏనుగు విగ్రహాన్ని పెట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాలు వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పురాణ గ్రంథాల ప్రకారం ఏనుగు కి వినాయకుడికి మధ్య సంబంధం ఉంది. అలాగే ఏనుగు చాలా తెలివైనది మరియు జీవులలో దీర్ఘాయుష్షు ఉన్న జీవి. సాధారణ జీవుల కనిపించే ఏనుగు అప్పుడప్పుడు తన గంభీరత్వాన్ని కూడా చూపిస్తుంది. ఈ క్రమంలోనే ఇంట్లో వెండి ఏనుగును పెట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం వెండి ఏనుగును ఇంట్లో పెట్టుకోవడం శుభప్రదం. అలాగే జంట వెండి ఏనుగులను ఇంటికి ఉత్తర దిశలో పెట్టుకోవడం వలన ఇంట్లో సానుకూల శక్తి నెలకొంటుంది. అంతే కాదు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అలాగే వృత్తి వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది.
ముఖ్యంగా ఇంట్లో పిల్లలు చదువుకునే గదిలో ఈ వెండి ఏనుగు విగ్రహాన్ని పెట్టడం వలన వారికి ఏకాగ్రత చదువుపై ఆసక్తి పెరుగుతుంది. మరియు త్వరలోనే వారు విజయం సాధిస్తారని వాస్తు శాస్త్రం చెబుతుంది. అయితే వెండి ఏనుగు విగ్రహం లేనివారు ఇత్తడి ఏనుగుని ఇంట్లో పెట్టుకున్న చాలా మంచి జరుగుతుంది.
అదేవిధంగా ఇంట్లో పడకగదిలో ఏనుగు విగ్రహాలను ఉంచడం వలన భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. అంతేకాదు వివాహబంధం బలపడుతుందని విశ్వాసం. ఇక ఏనుగు విగ్రహాన్ని ఏ దిశలో పడితే ఆ దిశలో పెట్టకూడదు. అది ఇంటి పై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఏనుగు విగ్రహాలను కచ్చితంగా ఉత్తర దిశలో ఉంచడం మంచిది.
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
Gautam Adani : రూ. 2,110 కోట్ల లంచం కేసులో Billionaire industrialist Gautam Adani అదానీ గ్రూప్ ఛైర్మన్…
Nokia x200 5G : ఒకప్పుడు కీ బోర్డ్ ఫోన్లలో రారాజుగా మార్కెట్ ని శాసించిన నోకియా స్మార్ట్ ఫోన్…
Gautam Adani : అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్, బిలియనీర్ గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురు ఎగ్జిక్యూటివ్‌లు…
Foods : ప్రతి ఒక్క అమ్మాయి అందంగా కనిపించాలి అని ఖచ్చితంగా కోరుకుంటుంది. అయితే దానికి మీరు ఏం చేస్తున్నారు అన్నది…
Stock Market : భారత స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం లాభాలతో సానుకూలంగా ప్రారంభమైన తర్వాత ప్రతికూల స్థాయికి జారుకుని…
This website uses cookies.