Vastu Dosh : వాస్తు దోషం ఉన్నవారు వెండి ఏనుగు విగ్రహాన్ని ఈ దిశలో పెట్టారంటే…!
ప్రధానాంశాలు:
Vastu Dosh : వాస్తు దోషం ఉన్నవారు వెండి ఏనుగు విగ్రహాన్ని ఈ దిశలో పెట్టారంటే...!
Vastu Dosh : వాస్తు శాస్త్రంలో వాస్తు దోషానికి సంబంధించిన నివారణలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో శాంతి ఆనంద శ్రేయస్సును పొందడానికి అనేక మార్గాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏనుగు విగ్రహాలకు వాస్తు శాస్త్రంలో పెద్దపీటనే వేశారు. ఎందుకంటే ఇంట్లో ఏనుగు విగ్రహాలు ఉంటే అనేక వాస్తు దోషాలు వీటి ద్వారా తొలగిపోతాయి. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఇంట్లో వెండి ఏనుగు విగ్రహాన్ని పెట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాలు వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పురాణ గ్రంథాల ప్రకారం ఏనుగు కి వినాయకుడికి మధ్య సంబంధం ఉంది. అలాగే ఏనుగు చాలా తెలివైనది మరియు జీవులలో దీర్ఘాయుష్షు ఉన్న జీవి. సాధారణ జీవుల కనిపించే ఏనుగు అప్పుడప్పుడు తన గంభీరత్వాన్ని కూడా చూపిస్తుంది. ఈ క్రమంలోనే ఇంట్లో వెండి ఏనుగును పెట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం వెండి ఏనుగును ఇంట్లో పెట్టుకోవడం శుభప్రదం. అలాగే జంట వెండి ఏనుగులను ఇంటికి ఉత్తర దిశలో పెట్టుకోవడం వలన ఇంట్లో సానుకూల శక్తి నెలకొంటుంది. అంతే కాదు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అలాగే వృత్తి వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది.
ముఖ్యంగా ఇంట్లో పిల్లలు చదువుకునే గదిలో ఈ వెండి ఏనుగు విగ్రహాన్ని పెట్టడం వలన వారికి ఏకాగ్రత చదువుపై ఆసక్తి పెరుగుతుంది. మరియు త్వరలోనే వారు విజయం సాధిస్తారని వాస్తు శాస్త్రం చెబుతుంది. అయితే వెండి ఏనుగు విగ్రహం లేనివారు ఇత్తడి ఏనుగుని ఇంట్లో పెట్టుకున్న చాలా మంచి జరుగుతుంది.
అదేవిధంగా ఇంట్లో పడకగదిలో ఏనుగు విగ్రహాలను ఉంచడం వలన భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. అంతేకాదు వివాహబంధం బలపడుతుందని విశ్వాసం. ఇక ఏనుగు విగ్రహాన్ని ఏ దిశలో పడితే ఆ దిశలో పెట్టకూడదు. అది ఇంటి పై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఏనుగు విగ్రహాలను కచ్చితంగా ఉత్తర దిశలో ఉంచడం మంచిది.