veddhi potu effect on house
ఇంటికి ఎదురుగా నిలువుగా వుండే వీధి ఇంటి వరకూ వచ్చి ఆగిపోయినా, లేదా అక్కడ నుండి ఏదో వైపుకు తిరిగినా దానిని వీధిపోటుగా పేర్కొంటారు. ఇటువంటి వీధిపోటు వల్ల సదరు గృహస్తులకు కొన్ని మంచి ఫలితాలను, కొన్ని చెడు ఫలితాలను కలిగిస్తాయని వాస్తు చెబుతోంది.
ఇంటికి లేదా గృహానికి తూర్పు, ఈశాన్య భాగంలో ఎదురుగా వుండే వీధి వల్ల వీధిపోటు కలుగుతుంది. ఈ రకమైన పోటు వల్ల సదరు గృహంలో నివశించే పురుషులకు సర్వాధికారాలు లభిస్తాయి. వీరు మంచి ఆత్మ విశ్వాసాన్ని కలిగి వుంటారు. ఏ రంగంలో కాలు పెట్టినా పైచేయి సాధిస్తారు. అదేవిధంగా ఇంటికి ఉత్తర – ఈశాన్య భాగంలో వీధి వున్నప్పుడు కలిగే వీధిపోటు వల్ల ఆ ఇంట్లోని స్త్రీలకు అన్నివిధాలా మేలు కలుగుతుంది. సుఖ సంతోషాలతో పాటు కోర్కెలు తీరి ఆనందంగా వుంటారు. ఇంటి యజమానికి మానసిక ప్రశాంతత, ధన ఆదాయం బాగుగా ఉంటుంది. ఇంటికి పశ్చిమ – వాయువ్యంలో వీధి వున్నప్పుడు వీధిపోటు కలుగుతుంది. దీని వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇంటి యజమాని సమాజంలో గౌరవాన్ని, పలుకుబడిని పొందుతాడు. రాజకీయ నాయకులుగా కూడా రాణిస్తారు. ధనాదాయం బాగుంటుంది. ఇంటికి దక్షిణ – ఆగ్నేయ భాగంలో వున్న వీధి వల్ల కలిగే పోటుతో మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబం అంతా సుఖసంతోషాలతో, మానసిక ప్రశాంతతతో వుంటారు. బంధువుల ఆదరణ, శుభ కార్య నిర్వహణ వంటివి ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
veddhi potu effect on house
ఇంటికి ఉత్తర వాయువ్య భాగంలో నిలువుగా వీధి వుండుట వీధి పోటు కలుగుతుంది. ఈ తరహా వీధిపోటు వల్ల ఆ ఇంట్లోని స్త్రీలు తీవ్రమైన దుష్ప్రభావానికి లోనవుతారు. పెళ్లి సంబంధాలు కుదరక పోవడం, కుదిరిన సంబంధాలు కూడా చివరివరకు వచ్చి ఆగిపోవడం వంటి అనేక సమస్యలకు, చికాకులకు కలుగుతాయి.
ఇంటికి పశ్చిమ – నైరుతి భాగంలో వున్న వీధి వల్ల వీధిపోటు వస్తుంది. దీనివల్ల సదరు ఇంట్లోని వారికి శ్రమ అధికంగా వుంటుంది. ఎంత కష్టపడినా ప్రయోజనం వుండదు. చేతికి అందాల్సిన డబ్బు చేజారి పోతుంది. ఆర్థిక కష్ట, నష్టాలు తప్పవు. (ఇంటికి దక్షిణ) – నైరుతి భాగంలో వీధి వున్నప్పుడు వచ్చే వీధిపోటు వల్ల అనేక అశుభాలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి. ఏ పని మొదలు పెట్టినా ముందుకు సాగక పూర్తి ఇబ్బందులకు గురవుతారు.
ఇంటికి తూర్పు – ఆగ్నేయంలో వీధి వుండటం కలిగే పోటు వల్ల అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటారు. ఎన్నిరకాలుగా కష్టపడి సంపాదించినా అంతకు మించిన ఖర్చు ఏదో ఒక రూపేణా వచ్చిపడుతుంది. ఎప్పుడూ మానసిక ఒత్తిడితో శ్రమపడాల్సి వుంటుంది. కుటుంబ కలహాలు మరికొంత వేదనకు గురి చేస్తాయి.అదేవిధంగా ఇంటికి వీధిపోటు కలిగించే రోడ్డుకు మధ్యలో ఉన్న రోడ్డు పెద్దగా ఉంటే దోష తీవ్రత తగ్గుతుంది. అదేవిధంగా కరెక్ట్ డిగ్రీలతో వీధిపోటును చూడాలి.కేవలం వాస్తులో చెప్పిన వీధిపోటు గురించి కొంచెం శాస్త్రీయంగా ఆలోచిస్తే ఎదురుగా పెద్దరోడ్డు వస్తే కొన్ని దిక్కులకు ప్రమాదాలు కావు కొన్ని దిక్కులకు ప్రమాదం అన్నారు ఎందుకు అనేది ఆలోచిస్తే ఉత్తరం, ఈశాన్యంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి దీనివల్ల నష్టాలు రావు, అదే దక్షిణం,నైరుతి వీధిపోట్ల వలన ఎదురుగా వీధిపోటులో ఒక వాహనం వచ్చి నేరుగా ఆ ఇంటిని తగిలితే ప్రమాదం. కాబట్టి కొంత రోడ్‌సేఫ్టీ కోణంలో ఆలోచించినా పైన చెప్పిన వీధిపోటు ఫలితాలను అర్థం చేసుకోవచ్చు. మన పూర్వీకులు అనుభవంతో చెప్పిన వాస్తు నియమాలను పాటించి శుభఫలితాలను పొందండి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.