Home » Entertainment » Are These Flash Back Scenes In Vakeel Saab
Entertainment

Vakeel saab : వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఇవేనా..?

Authored By
vamana sai
The Telugu News | Published on: April 1, 2021, 8:30 am
Advertisement

Vakeel saab : పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కటి ఎంతో పవర్ ఫుల్ గా ఉండాలి. ఆయన స్టామినాకి ఎవరూ సాటిరారని మరోసారి వకీల్ సాబ్ ట్రైలర్ తో ప్రూవ్ అయింది. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే అది ఏ రేంజ్ లో ఉండాలో అంతకు మించిన రేంజ్ లో దిల్ రాజు – దర్శకుడు వేణు శ్రీరాం ప్లాన్ చేశారు. హీరో ఎలివేషన్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. సాంగ్స్.. యాక్షన్ సీన్స్ ఇలా ప్రతీ దాంట్లో దర్శకుడు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు. ఈ సినిమాని దర్శకుడిగా మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ అభిమానిగా తెరకెక్కించినట్టు చెప్పిన సంగతి తెల్సిందే.

Advertisement

are-these-flash-back-scenes-in-vakeel-saab

అయితే వకీల్ సాబ్ సినిమాని బాలీవుడ్ పింక్ సినిమాకి రీమేక్ గా రూపొందించారు. ఆ సినిమాలో ఫైట్స్..సాంగ్స్..ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వంటివి ఉండవు. కానీ తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు స్క్రిప్ట్ లో ఇవన్నీ జోడించాడట దర్శకుడు వేణు శ్రీరాం. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం..ఫ్లాష్ బ్యాక్ లో లా కాలేజీ స్టూడెంట్ గా కనిపించే పవన్ హీరోయిన్ శృతిహాసన్ ల మధ్య లవ్ ట్రాక్ ఉంటుందట. స్టూడెంట్ లీడర్ గా వ్యవహరించే పవన్.. పేదవారికి సాయం చేయడం.. ఆపదలో వున్నవారిని ఆదుకునే సన్నివేశాలన్నీ ఈ ఎపిసోడ్ లో ఉంటాయట.

Advertisement

Vakeel saab : ఇదే డ్రైవ్‌లో గనక వకీల్ సాబ్ కథ సాగితే గ్యారెంటీగా ఇండస్ట్రీ హిట్ ఖ్యాయమని ఫిక్స్ అవ్వాల్సిందే.

ఈ క్రమంలోనే హీరోయిజం ఎలివేట్ చేసే ‘సత్యమేవ జయతే’ సాంగ్.. పవన్ కళ్యాణ్ – శృతిహాసన్‌ల మధ్య ‘కంటిపాపా’ సాంగ్ ఉండేలా డైరెక్టర్ వేణు శ్రీరాం స్క్రిప్ట్ లో జత చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు టీజర్.. ట్రైలర్ లో ప్రధానంగా హైలేట్ అయిన వాచీ కూడా హీరోయిన్ శృతి హాసన్…పవన్ కళ్యాణ్‌కి గిఫ్ట్ గా ఇస్తుందని సమాచారం. కాగా తన లైఫ్ లో కొన్ని అనుకోని సంఘటనల వల్ల కోర్టుకు దూరమయిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ముగ్గురు అమాయకమైన అమాయిలను కాపాడేందుకు కోటు ధరించి కోర్టులో ప్రత్యక్షమవుతాడని తెలుస్తోంది. ఇదే డ్రైవ్‌లో గనక వకీల్ సాబ్ కథ సాగితే గ్యారెంటీగా ఇండస్ట్రీ హిట్ ఖ్యాయమని ఫిక్స్ అవ్వాల్సిందే.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి