Home » Devotional » What Does Astrology Say About The Benefits Of Men Getting Their Ears Pierced
Devotional

Male Ear Piercing : జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే…. పురుషులు చెవులు కుట్టించుకుంటే… కలిగే లాభాలు, మీకు తెలుసా…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 24, 2025, 6:00 am
Advertisement

Male Ear piercing : మన నాగరికతలో చెవులు కుట్టించే కార్యక్రమాన్ని ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ఉదాహరణకు భారతదేశంలో అమ్మాయిలు చెవులు కుట్టించుకుంటూ ఉంటారు. అయితే అలాగే అబ్బాయిలు కూడా సాంప్రదాయకంగా కర్ణ వేద అని పిలవబడే వేడుకలో చెవులు కుట్టడం జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. వీటిని కర్ణ వేద ముహూర్తం ప్రకారం జన్మదిన వేడుకలు సందర్భంగా నిర్వహిస్తుంటారు. పురుషులు చెవులు కుట్టించుకుంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం,జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుంది తెలుసుకుందాం…

Advertisement

Male Ear Piercing : జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే…. పురుషులు చెవులు కుట్టించుకుంటే… కలిగే లాభాలు, మీకు తెలుసా…?

Male Ear Piercing పురుషులు చెవులు కుట్టించుకుంటే కలిగే లాభాలు

పురాణాలు ఏమి చెబుతున్నాయి అంటే పురుషులు చెవులు కుట్టించుకుంటే వారిపై చెడు దృష్టి ఉంటే అది తొలగిపోతుందని నమ్ముతారు. చెడు దృష్టి నుంచి తప్పించుకోవచ్చు. చెవి కుట్టించుకున్నప్పుడు బంగారం, లేదా రాగి చెవి పోగులు ధరిస్తే, ప్రతికూల శక్తి దూరమవుతుందట. దీనివల్ల,ఆ వ్యక్తి తరచుగా అనారోగ్యానికి గురి కాకుండా ఉంటాడని నమ్మకం. ఇంకా ఆరోగ్యంగా ఉంటాడట. అయితే, పురుషులు ఎడమ లేదా కుడి వైపున చెవులు కుట్టించడం వల్ల జాతకంలో రాహువు, కేతువు ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని జ్యోతిష్యం చెబుతుంది. 9 గ్రహాల స్థానం బలపడుతుందట.రాహువు, కేతువులు బలపడినప్పుడు ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు. సమాజంలో మరింత గౌరవాన్ని కూడా పొందగలడు.

Advertisement

శరీరంలో అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో చెవి కూడా ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా చెవులు కుట్టించుకుంటే వారి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. పురుషులు ఇవి కుట్టించుకోవడం వల్ల కలిగే మరో ముఖ్యమైన జ్యోతిష్య శాస్త్రం ప్రయోజనం ఏమిటో తెలుసా… ఇది తలలో తిరుగుతున్న ప్రతికూల ఆలోచనలు తొలగించగలదు. అందంగాను,చెవి కుట్టించుకున్నది అబ్బాయిలు మరింత ధైర్యంగాను ఉంటారు. వారి ఉత్సాహం కూడా పెరుగుతుంది.జ్యోతిష్యశాస్త్రము ప్రకారం.. పురుషులు ఎడమ చెవి,లేదా కుడిచేవి కుట్టించుకున్నట్లయితే. ఆధ్యాత్మిక వృద్ధి కూడా పెరుగుతుంది. పవిత్ర శబ్దాలు దానికి సహకరిస్తుంది. అలాగే, పాపాన్ని నివారించే ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతారు. చెవిలోబులో రాగి లేదా బంగారం ధరిస్తే శరీరం, విద్యుత్ ప్రవాహాన్ని సులభతరం చేస్తుందని నమ్ముతారు. చెవిలోబ్, మూడవ కంటి మానసిక బిందువు లేదా స్థానం కాబట్టి కొన్ని సాంస్కృతిక నమ్మకాలు అక్కడ బంగారు ఆభరణాలను మాత్రమే ధరించాలని నిర్దేశించాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి