Rishabh Pant : ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. 25 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్..!
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు సాధించి, ఒకే టెస్ట్‌లో డబుల్ సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. టెస్ట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇంతకముందు 2000లో జింబాబ్వే ఆటగాడు ఆండీ ఫ్లవర్ మాత్రమే ఈ ఫీట్‌ను సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పంత్, రెండో ఇన్నింగ్స్‌లో 129 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
Rishabh Pant : ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. 25 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్..!
మ్యాచ్ నాలుగో రోజు 90/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో భారత్ ఆరంభించగా, తొందర్లోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అవుట్ అయ్యాడు. అయితే ఆ తరువాత పంత్, రాహుల్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఇద్దరూ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్ 202 బంతుల్లో సెంచరీ చేయగా, పంత్ దూకుడుగా ఆడి 83 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం పంత్ 118 పరుగులు చేసి ఔట్ కాగా, వీరి భాగస్వామ్యం వల్ల భారత్ 300 పరుగుల ఆధిక్యం దాటగలిగింది. మూడో సెషన్‌లో పంత్ ఒంటి కన్ను సెలెబ్రేషన్ తో తన సెంచరీ జరుపుకున్నారు, ఇది అభిమానులను ఆకట్టుకుంది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 465 పరుగులతో సమాధానం ఇచ్చింది. దీంతో భారత్‌కు స్వల్పంగా 6 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో పంత్, రాహుల్ సెంచరీలతో భారత్ భారీ స్కోర్ చేసింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 300 పరుగులు దాటడం, మ్యాచ్‌ను టీమిండియా పూర్తిగా తమవైపు తిప్పుకున్నట్లు సూచిస్తోంది.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.