Mogali Puvvu : మొగలి పువ్వు పూజకు ఎందుకు పనికిరాదో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mogali Puvvu : మొగలి పువ్వు పూజకు ఎందుకు పనికిరాదో తెలుసా?

 Authored By pavan | The Telugu News | Updated on :14 March 2022,6:00 am

Mogali Puvvu : దాదాపు హిందువులంతా ప్రతి రోజూ పూజలు చేస్తుంటారు. ఉదయం, సాయంత్రం దేవుడికి పూలు సమర్పించి దీపారాధన చేస్తూ.. ఆ భగవంతుడిని స్మరిస్తుంటారు. అయితే మనకు తెల్సినంత వరకు దేవుడి పూజలో చాలా రకాల పూలను ఉపయోగిస్తుంటాం. కానీ పుష్పాలలో ఒకటైన మొగలి పువ్వును మాత్రం ఆ భగవంతుడి ఏ పూజలోను వాడరు. ఎందుకలా ఉపయోగించకూడదనే అనుమానం మనకు వచ్చి పెద్దలను అడిగితే.. వాడకూడదు అంతే అని చెబుతారు తప్ప సరైన సమాధానం ఉండదు. అయితే ఇందకు కారణం వారికి కూడా సమాధానం తెలియకపోవడమే. అయితే అసలు మొగలి పువ్వును పూజకు ఎందుకు వినియోగించరు అందుకు గల కారణం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మన పురాణాల ప్రకారం ఒకరనాడు… బ్రహ్మ దేవుడు, శ్రీ మహా విష్ణువు నేను గొప్పంటే నేను గొప్ప అని వాదించుకున్నారట. అయితే ఆ విషయం తెలుసుకున్న పరమ శివుడు వారిద్దరి కళ్లు తెరిపించాలనే ఉద్దేశంతో వారి మధ్య లింగ రూపంలో పుట్టాడు.  నా శిరస్సు ఎక్కడుందో వెతికి తీసుకు రమ్మని బ్రహ్మ దేవుడికి తీసుకురమ్మన్నాడు. అదే విధంగా విష్ణుకు కూడా తన కాళ్లను వెతికి తీసుకురమ్మన్నాడు. అయితే శివుడి ఆజ్ఞ మేరకు బ్రహ్మ, విష్ణువులు ముల్లోకాలలో వెతికినప్పటికీ వారికి శివుడి తల, పాదాలు దొరకలేదు. ఇంక చేసేదేం లేక శివుడి వద్దకు వచ్చి ఇదే విషయాన్ని వివరించారు.  కానీ బ్రహ్మ దేవుడు మాత్రం ఎలాగైనా సరే గెలవానుకుని తన వెంట ఒక ఆవును, మొగలి పువ్వును తీసుకువచ్చాడు.

what is the reason behind mogali puvvu do not use in puja

what is the reason behind mogali puvvu do not use in puja

లింగం తల చూశానని మొగలి పువ్వుతో అబద్ధపు సాక్ష్యం చెప్పించాడు. బ్రహ్మ ప్రలోభాలకు లోనయిన మొగలి పువ్వు లింగం తల చూసినట్లు అబద్ధపు సాక్ష్యం చెబుతుంది. అదే విధంగా కామ దేనువుని అడగగా… అది తన తోకను అడ్డంగా ఊపుతూ… అబద్దమని అసలు విషయాన్ని బయటపెట్టింది. అయితే తాను ఓడిపోయేందుకు బ్రహ్మ దేవుడితో కలిసి అబద్ధం చెప్పినందున మొగలి పువ్వును శ్రీ మహా విష్ణువు శపించాడు. ఇప్పటి నుంచి నీవు ఏ పూజకు పనికిరావంటూ శాపం పట్టాడు. అదే విధంగా కామ దేనువు తన తోకతో సత్యం చెప్పింది కాబట్టి… కామ ధేనువు వెనుక భాగం పూజార్హమగుగాక అని వరం ఇస్తాడు. అప్పటి నుంచి మొగలి పువ్వును ఎటువంటి పూజలో ఉపయోగించరు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది