Bhishma Niti : భార్యాభర్తలిద్దరూ ఒకే కంచంలో తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
Bhishma Niti : మన హిందూ పురాణ గాథల ప్రకారం.. ఎంతో ప్రముఖమైన పాత్ర భీష్ముడు. మహా భారతానికి వెన్నుముకగా నిలిచిన ఈయన సత్య వర్తనుడిగా, పరాక్రముడిగా ఖ్యాతి గడించాడు. భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు రాజ్య పాలన, రాజ ధర్మం… వంటి అనేక విషయాల గురించి పాండవులకు హిత బోధ చేశాడు. కురుపితామహుడు చేసిన ఉపదేశాలు నేటి పాలకులకు, ప్రజలకు కూడా మార్గ దర్శకంగా నిలుస్తున్నాయి. అయితే భార్యా భర్తల మధ్య ఉండే అనుబంధం.. వారిద్దరూ ఒకే విస్తరిలో ఆహారం తినడం వలన కలిగే ఇబ్బందులను గురించి భీష్ముడు ధర్మరాజుకి వివరించాడు. ఆహారానికి సంబంధించిన అన్ని నియమాలను చెబుతూ ఎలాంటి పరిస్థితుల్లో ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం, ఎప్పుడు అశుభం అని స్పష్టం చేశారు.
అలాగే దంపతులిద్దరూ కలిసి ఒకే కంచంలో భోజనం ఎందుకు చేయకూడదో స్పష్టం చేశాడు. అయితే భీష్ముడు పాండవులకు చెప్పిన ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.భార్యాభర్తలు ఒకే కంచంలో భోజనం చేస్తేవారి ప్రేమ పెరుగుతుందనేది నిజం. అయితే భీష్మ పితామహులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. కుటుంబానికి సంబంధించి ప్రతి వ్యక్తికి అనేక విధులు ఉంటాయని తెలిపారు. ఆ విధులను నిజాయితీగా నిర్వర్తించాలి అంటే కుటుంబ సభ్యులందరినీ ఒక్క తాటిపై ఉంచాలంటే… భార్యతో కలిసి ఒకే కంచంలో భోజనం చేయవద్దని ఆయన వివరించారు. భార్యతో కలిసి ఒకే కంచంలో ఆహారం తీసుకోవడం వల్ల కుటుంబంలోని ఇతర సంబంధాలతో పోలిస్తే భర్తకు భార్యపై ప్రేమ మరింత అధికమవుతుంది.
అంతే కాదు భార్య మనసు పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అప్పుడు తప్పుఒప్పుల మధ్య తేడా గుర్తించ లేడు. భార్య ప్రేమ ముఖ్యమని మాత్రమే అనుకుంటాడు. కుటుంబ సభ్యుల తప్పొప్పులతో పోలిస్తే.. భార్య తప్పు చేసినా పెద్దగా పట్టించుకోకుండా మిగతా వారి తప్పులను మాత్రం వేలెత్తి చూపిస్తాడు. అయితే దీని వల్ల కుటుంబ పెద్ద పార్షియాలిటీ చూపిస్తున్నట్లు అంతా భావిస్తారు. చిన్న చిన్న గొడవలే కుటుంబం విడిపోవడానికి కారణం అవుతుంది. అందుకే భార్యా భర్తలు ఇద్దరూ కలిసి ఒకే కంచంలో తిన కూడదని భీష్ముడు పాండవులకు వివరించాడు. మీరు కూడా ఇదే ధర్మాన్ని పాటించండి. భార్యపై ఎంత ప్రేమ ఉన్నప్పిటీక మనసులోనే దాచుకోవాలి. అందరి ముందూ ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అలా ప్రదర్శించడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి.