Diwali : దీపావళి రోజు ఈ జంతువులను చూస్తే ఏమవుతుంది…అదృష్టమా… దురదృష్టమా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diwali : దీపావళి రోజు ఈ జంతువులను చూస్తే ఏమవుతుంది…అదృష్టమా… దురదృష్టమా…!

Diwali : హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది అశ్వయుజ మాసంలో వచ్చే పండుగ దీపావళి పండుగ. పురాణాల ప్రకారం సత్యభామ నరకాసురుని వధించిన రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకునే పండుగ దీపావళి. ఇక ఈ దీపావళి పండుగను పిల్లలు నెల రోజుల ముందు నుండే జరుపుకుంటూ వస్తారు. వారికి ఇష్టమైన బాణాసంచా కాలుస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక దీపావళి పండుగ రోజు మహాలక్ష్మి […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 October 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Diwali : దీపావళి రోజు ఈ జంతువులను చూస్తే ఏమవుతుంది...అదృష్టమా... దురదృష్టమా...!

Diwali : హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది అశ్వయుజ మాసంలో వచ్చే పండుగ దీపావళి పండుగ. పురాణాల ప్రకారం సత్యభామ నరకాసురుని వధించిన రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకునే పండుగ దీపావళి. ఇక ఈ దీపావళి పండుగను పిల్లలు నెల రోజుల ముందు నుండే జరుపుకుంటూ వస్తారు. వారికి ఇష్టమైన బాణాసంచా కాలుస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక దీపావళి పండుగ రోజు మహాలక్ష్మి దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో నిష్టతో పూజిస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో దీపాలని వెలిగించి లక్ష్మీదేవి అమ్మవారికి తమ కోరికలను చెప్పుకుంటారు. అంతేకాక రాత్రి సమయంలో కొత్త బట్టలు ధరించి టపాసులు కాలుస్తూ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ దీపావళి రోజున కొన్ని రకాల జంతువులను చూడడం జ్యోతిష్య శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించడం జరిగింది. మరి దీపావళి పండుగ రోజు ఏ జంతువులను చూడడం శుభప్రదం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Diwali గుడ్లగూబ

గుడ్లగూబ అనేది లక్ష్మీదేవి వాహనం అని అందరికీ తెలిసిందే. అందుకే దీపావళి పండుగ రోజు గుడ్లగూబని చూడడం అనేది శుభప్రదం అని పెద్దలు చెబుతుంటారు. పండుగ రోజు గుడ్లగూబను చూసిన వారికి అత్యంత శ్రేయస్సు సంపద లభిస్తుందని నమ్మకం. మరీ ముఖ్యంగా దీపావళి పండుగ రోజు గుడ్లగూబను చూసినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉంటుందని అర్థం.

ఆవు : హిందూ సాంప్రదాయాలలో ఆవును గోమాతగా భావించి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అంతేకాక ఆవును చాలా పవిత్రంగా చూసుకుంటారు. ఇక దీపావళి పండుగ రోజు గోమాతను చూసిన లేదా ఆవు మీ ఇంటికి వచ్చిన ఎంతో శుభప్రదం అని చెప్పుకోవచ్చు. దీంతో మీ జీవితంలో సానుకూన మార్పులు ఏర్పడతాయి.

పిల్లి : ఏదైనా సందర్భంలో బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురుగా వస్తే అశుభంగా భావిస్తారు. అలా వెళ్లే సమయంలో పిల్లి ఎదురు వస్తే వెళ్లేచోట పనులు జరగవని నమ్మకం. కానీ దీపావళి పండుగ రోజు మాత్రం పిల్లి మీకు ఎదురుగా వస్తే అది శుభ శకునం అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దీపావళి పండుగ రోజు పిల్లి ని చూస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం లభించినట్టేనని తెలియజేస్తున్నారు.

ఏనుగు : తెలివైన జీవులలో ఏనుగు కూడా ఒకటి. అంతేకాక హిందూ సాంప్రదాయంలో ఏనుగుని మొదటి పూజలు అందుకునే విజ్ఞేశ్వరుడు గా కొలుస్తారు. అలాంటి ఏనుగు దీపావళి పండుగ రోజు మీకు కనిపించినట్లయితే మీ జీవితంలో సమస్యలన్నీ తొలగి మంచి మార్పులకు దారితీస్తుందని సంకేతం.

Diwali దీపావళి రోజు ఈ జంతువులను చూస్తే ఏమవుతుందిఅదృష్టమా దురదృష్టమా

Diwali : దీపావళి రోజు ఈ జంతువులను చూస్తే ఏమవుతుంది…అదృష్టమా… దురదృష్టమా…!

చిట్టెలుక : దీపావళి పండుగ రోజు చిట్టేలుక కనిపించడం అనేది సుభ సంకేతమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దీపావళి పండుగ రోజు చిట్టెలకని చూడడం వలన ఆదాయం పెరుగుతుందట. అలాగే వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతారు. అంతేకాక శకున్ శాస్త్రం ప్రకారం ఎలుక దర్శనం డబ్బు మీ దగ్గరకు రావడానికి సూచిక అని తెలియజేయడం జరిగింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది