Ekadasi 2024 : ఏకాదశి ప్రాముఖ్యత పూజా విధానం... ఈసారి ఎప్పుడు జరుపుకోవాలంటే...!
Ekadasi 2024 : హిందూమతంలో ప్రతి ఏకాదశి తీదికి ఎంతో ప్రాముఖ్యత చోటు చేసుకుంటుంది. అయితే కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్షంలోని ఏకాదశి స్థితిని దేవుత్తని ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు నాలుగు నెలల యోగా నిద్ర నుంచి మేల్కొంటాడు. ఇక దీనితో చాతుర్మాస్ ముగుస్తుంది. దీంతో మళ్లీ శ్రీమహావిష్ణువు విశ్వాసాన్ని నడిపించే బాధ్యతను స్వీకరించడం జరుగుతుంది. ఇలా ఈ రోజు నుంచి వివాహం గృహప్రవేశం నిశ్చితార్థం వంటి శుభకార్యాలు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా శుభకార్యాలకు శుభ ముహూర్తాలు పాటిస్తారు.
తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఏడాది కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిధి నవంబర్ 112024వ తేదీన సాయంత్రం 6:46 గంటలకు ఏకాదశి ప్రారంభమవుతుంది. అదేవిధంగా మరుసటి రోజు 12 నవంబర్ 2024న సాయంత్రం 4:04 గంటలకు ముగుస్తుంది. ఇక ఉదయ తిధి ప్రకారం నవంబర్ 12వ తేదీ మంగళవారం రోజున దేవుత్తని ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తారు.
దేవుత్తని ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలంటు స్నానం చేసిన తరువాత ధ్యానం చేయాలి. అనంతరం విష్ణువు కోసం ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చెయ్యండి. పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత శ్రీమహా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని స్మరించండి. తరువాత స్వామికి పంచామృతంతో స్నానం చేయించి పసుపు లేదా చందనంతో తిలకం దిద్దండి. ఇక పసుపు పువ్వులు , పండ్లు, తీపి పదార్థాలు ,తులసి దళాల మాలను శ్రీమహావిష్ణువుకి సమర్పించండి. ఆ తరువాత ” ఓం నమో భగవతే వాసుదేవాయ ” అనే మంత్రాన్ని లేదా విష్ణుకు సంబంధించిన మరొక మంత్రాన్ని జపించండి. శ్రీ మహా విష్ణుమూర్తి సహస్త్రాణం పఠించిన తర్వాత హారతిని ఇవ్వండి. ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో మేల్కొని విష్ణువు ని ప్రార్థిస్తూ భజనలు కీర్తనలను పఠిస్తూ ఉండండి. మరుసటి రోజు ఉదయం పూజ ముగించుకొని పారణ సమయంలో ఉపవాసాన్ని విరమించండి.
” వందే విష్ణు భవ భయ హరం సర్వలోకైక నాథమ్ ఓం శ్రీ విష్ణువే చ విద్మహే వాసుదేవాయ ధీమహి. తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం నమో నారాయణ ఓం నమో: భగవతే వాసుదేవాయ మంగళం విష్ణు, మంగళం గరుడధ్వజ ”
Ekadasi 2024 : ఏకాదశి ప్రాముఖ్యత పూజా విధానం… ఈసారి ఎప్పుడు జరుపుకోవాలంటే…!
దేవుత్తని ఏకాదశి రోజు నుండి అనేక శుభకార్యాలు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఈ రోజున తులసి మొక్కకు శాలిగ్రామంతో వివాహం జరిపిస్తారు. ఇలా తులసి శాలిగ్రామాన్ని పూజించడం ద్వారా పితృ దోషం తొలగిపోతుంది. ఇక ఈ రోజు ఉపవాసం ఉన్న వారి జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుంది.
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
This website uses cookies.