Deeparadhana : దేవుడికి ఏయే సమయాల్లో దీపం పెట్టాలి?
చాలా వరకు హిందువలంతా ప్రతి నిత్యం దీపారాధన చేస్తారు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు అంటే తమకు వీలు కల్గినప్పుడే పూజ చేసుకొని దీపం పెడుతుంటారు. కానీ అలా చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. దీపారాధనకు చాలా నియమాలు ఉన్నాయని అంటున్నారు. మనం వీలున్నప్పుడు నిద్ర లేచి స్నానం చేశాక సమయం లేకుండా దీపం పెట్టకూడదట. అలా పెట్టడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయట. అందుకే దీపారాధన నియమాలను తెలుసుకొని పూజా మందిరంలో దీపం వెలిగించాలని సూచిస్తున్నారు. అయితే ఆ నియమాలు ఏంటి ఏ సమయాల్లో దీపారాధన చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.పంచ లోహాలు లేదా వెండి, మట్టి ప్రమిదల్లో మాత్రమే దీపం వెలిగించాలట.
అంతే కాకుండా నిత్యం పూజ చేసే వాళ్లు మట్టి ప్రమిదలు వాడటం అంత మంచిదని కాదని పండితులు చెబుతున్నారు. తెల్లవారు జామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య దీపం వెలిగించడం సరైన సమయం అంట. 5 దాటిన తర్వాత నుంచి దీపం వెలిగించకూడదని వేద పండితులు సూచిస్తున్నారు. కానీ చాలా మంది ఆ సమయం దాటిన తర్వాతే దీపం వెల్గిస్తుంటారు. అది అంత మంచిది కాదు. నిత్యం పూజ చేసుకునేవాళ్లు వేకువ జామునే నిద్ర లేచి 5 గంటల లోపు దీపారాధన చేయాలి. పొద్దున వీలు కాకపోయినా లేదంటే సాయంత్రం కూడా దీపారాధన చేయాలి అనుకునే వాళ్లు సూర్యాస్తమయం తర్వాతే దీపం వెలిగించాలి. అంతే తప్ప సూర్యాస్తమయం కాకముందే దీపం వెలిగించకూడదు.
సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేసి మహాలక్ష్మికి పూజ చేస్తే కోరిన కోర్కెలు నెరవరుతాయట.అంతే కాదండోయ్… చాలా మంది దీపం వెలిగించేటప్పుడు దీపం కింద ఎలాంటి ఆధఆరం పెట్టరు, కానీ అలా ఆధారం లేని దీపాన్ని అస్సలే వెలిగించకూడదట. దీపం కింద కొద్దిగా బియ్యం లేదా రావి ఆకులు లేదా పువ్వు రేకులను వేసి దీపారాధన చేయాలి. ఉదయం దీపారాధన చేసిన తర్వాత ప్రమిదలో వాడిన ఒత్తులను తిరిగి సాయంత్రం వెలిగించకూడదు. ఇలా ప్రతిసారి దీపారాధన చేసినప్పుడు కొత్త వత్తులను వేసి దీపారాధన చేయాలి. అలా చేస్తేనే పూజా ఫలితం లభిస్తుంది. దీపారాధన చేసే సమయంలో ఇలాంటి నియమ, నిబంధనలు పాటించడం వల్ల శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.