Ugadi Pachadi : ఉగాది పచ్చడి ఉగాదినాడు ఎందుకు తినాలి..? దాని వలన కలిగే ఉపయోగాలు ఏమిటి.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ugadi Pachadi : ఉగాది పచ్చడి ఉగాదినాడు ఎందుకు తినాలి..? దాని వలన కలిగే ఉపయోగాలు ఏమిటి.?

Ugadi Pachadi ; ఈ నూతన సంవత్సరంలో ఉగాది ప్రత్యేకమైన పండగ గా జరుపుకుంటూ ఉంటారు. తెలుగు సంవత్సరంలో తొలి పండగ ఉగాదిగా చెప్పుకుంటారు.. జనవరి 1 మీ అందరిని ఏడాదికి మొదటి రోజున చెప్తూ ఉంటారు. అయితే మన తెలుగు రాష్ట్రాలలో ఉగాది నాడు కొత్త ఏడాది మొదలవుతుంది.. మన తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ఇతర రాష్ట్రాల్లోని ఉగాదిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆనాడు ఇష్టదైవాన్ని పూజించుకుని ఉగాది పచ్చడి ప్రసాదంగా పెడుతూ ఉంటారు. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :21 March 2023,12:00 pm

Ugadi Pachadi ; ఈ నూతన సంవత్సరంలో ఉగాది ప్రత్యేకమైన పండగ గా జరుపుకుంటూ ఉంటారు. తెలుగు సంవత్సరంలో తొలి పండగ ఉగాదిగా చెప్పుకుంటారు.. జనవరి 1 మీ అందరిని ఏడాదికి మొదటి రోజున చెప్తూ ఉంటారు. అయితే మన తెలుగు రాష్ట్రాలలో ఉగాది నాడు కొత్త ఏడాది మొదలవుతుంది..
మన తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ఇతర రాష్ట్రాల్లోని ఉగాదిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆనాడు ఇష్టదైవాన్ని పూజించుకుని ఉగాది పచ్చడి ప్రసాదంగా పెడుతూ ఉంటారు. ఈ పచ్చడి ఏమైనా ఇతర ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. ఆ రోజుల కలయికతో తయారుచేసి ఈ ఉగాది పచ్చడి ప్రత్యేకత చాలా విశిష్టమైనది. ఈ పచ్చడిలో ఆరు రుచులు జీవితంలోను కష్టసుఖాలను చూసిస్తాయి.పులుపు, ఉప్పు, వగరు, చేదు, కారం ,తీపు కలయికతో ఉగాది పచ్చడి తయారవుతుంది.

Why should you eat Ugadi Pachadi on Ugadi

Why should you eat Ugadi Pachadi on Ugadi

పచ్చిమిర్చి బెల్లం, చింతపండు, ఉప్పు, మామిడికాయ వేపపూత ఆనవాయితీగా పచ్చడిలో వాడుతూ ఉంటారు. చాలామంది ఎక్కువగా అరటిపండు, కొబ్బరి కోరు, పుట్నాల పప్పు లాంటివి కూడా దాంట్లో కలుపుతూ ఉంటారు. అది వారి వారి ఇష్టాన్ని బట్టి తయారు చేసుకుంటూ ఉంటారు. ఉగాది పచ్చడి నోట్లో వేసుకోగానే తీపి తగిలితే ఆ ఏడదంతా మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు. అది చేదు తగిలితే కష్టాలు వచ్చి అవకాశం ఉందని చెప్పుకుంటారు. పులుపు తగిలితే కష్టకాల కలయిక ఉంటుందని నమ్ముతుంటారు. అలాగే ఈ ఉగాది పచ్చడి తయార్లు ఒక అత్యధిక భావన కలిగి ఉంటుంది. ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు ఏ రుచి మీకు తెలుస్తుందో అంచనా వేయడం చాలా కష్టం. అలాగే జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చిన జీవితాన్ని ముందుకు నడిపించాలని భావన ఉగాది పచ్చడిలో దాగి ఉంటుంది.

ఉగాది పచ్చడి తయారీ విధానం: వేప పువ్వులు నీళ్లలో కడిగి శుభ్రం చేసుకోవాలి. చింతపండును కాస్త నీళ్లలో నానబెట్టాలి. బెల్లాన్ని మిరపకాయలను మామిడి కాయలు తురుముకోవాలి. చింతపండు పిప్పిని తీసి పడేసి ఆ రసాన్ని ఒక గిన్నెలో పోసుకోవాలి. ఆ చింతపండు పులుసు మామిడి తురుము, బెల్లం తురుము, పచ్చిమిరపకాయ తురుము, వేప పువ్వు , ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. వేప పూలు ఎక్కువగా వేయకూడదు చేదు ఎక్కువవుతుంది. మీరు కావాలనుకుంటే అరటిపండు ముక్కలు, జామ ముక్కలు, కొబ్బరి ముక్కలు కూడా కలుపుకోవచ్చు.. ఆరోగ్యానికి చాలా మంచిది; పచ్చడిలో వాడే ప్రతిపదార్థము మనలన్ని మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఈ కాలంలో వచ్చే వాతావరణ మార్పులు తట్టుకునే విధంగా ఈ పచ్చడి మనకు శక్తిని అందిన చేస్తుంది. ప్రకృతిలో చోటుచేసుకున్న మార్పులను మనం మన శరీరం తట్టుకునే విధంగా ఈ పచ్చడి తయారవుతుంది.

Ugadi Pachadi | Ugadi Pachadi Recipe | Sailaja | Flickr

వేప పువ్వు, మామిడికాయలు, బెల్లం, చింతపండు లాంటివి తినడం వలన ఎన్నో సమస్యలు దరిచేరవు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి విటమిన్ సి కూడా ఉంటుంది. వేప పువ్వు లో ఉండే చేదు గుణం వలన శరీరంలో ప్రవేశించి వైరస్లను అధిక కాలం ఉండలేవు. దీనిలో వాడే బెల్లం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పిత్త వాత సమస్యలను తగ్గిపోతాయి. శరీరంలో కొత్త కణాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. అలాగే పచ్చడిలో పంచదారను వాడకూడదు. రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచే గుణం బెల్లానికి తక్కువ. పులుపు కోసం చింతపండును వాడతాము. ఈ చింతపండు మన శరీరంలోని జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మలబద్ధకం సమస్య నుంచి రక్షిస్తుంది. మామిడికాయ వగరు కోసం పచ్చడిలో కలుపుతాం. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని అధికమయ్యేలా చేస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది