
you keep camphor in your pocket like this get wealth
Camphor : భగవంతుడి ఆరాధనలో కర్పూరానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. దేవుడిని పూజ చేసే సమయంలో కొన్ని వస్తువులను ఉపయోగిస్తారు. అందులో పసుపు, కుంకుమ, దీపం, పువ్వులతో పాటు కర్పూరాన్ని ఉపయోగిస్తారు. కర్పూర హారతి ఇస్తే దేవుడు ప్రసన్నమవుతాడని నమ్మకం. అందుకే రోజుకి రెండు సార్లు అయినా కర్పూర హారతి ఇవ్వాలని అంటుంటారు. ఇంట్లో ప్రతి మూలకు కర్పూర హారతి పొగ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. అయితే కర్పూరాన్ని పూజకు మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని పెంపొందించే ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు.
సాధారణంగా కర్పూరాన్ని పూజ గదిలో ఉంచుతారు. అయితే కర్పూరాన్ని మన దగ్గర ఉంచుకోవడం వలన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కర్పూరాన్ని జేబులో లేదా పర్సులో ఉంచడం వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి. చర్మ సమస్యలతో బాధపడేవారు కర్పూరాన్ని దగ్గర ఉంచుకోవడం వలన మంచి ప్రయోజనాలు కలుగుతాయి. చర్మ సమస్యలు బాధపెడితే జాతకంలో శుక్రుడు బలహీన స్థితిలో ఉన్నాడని అర్థం. ఇలాంటప్పుడు కర్పూరాన్ని తెల్లటి గుడ్డలో కట్టి మీ దగ్గర ఉంచుకోవాలి. శుక్రుడు సుగంధ ద్రవ్యాల పట్ల ఆకర్షితుడు అవుతాడు. దీంతో చర్మ సమస్యలనేవి తగ్గిపోతాయి. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు కూడా తమ దగ్గర కర్పూరాన్ని ఉంచుకోవాలి.
జాతకంలో సర్పదోషం, పితృ దోషం, రాహు కేతు దోషాలు ఉంటే మీ దగ్గర కర్పూర ఉంచుకోవాలి. ఒక చిన్న కర్పూరాన్ని కర్చీఫ్ లో కట్టి జేబులో కానీ పర్స్ లో కానీ ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు అనేవి కూడా ఏర్పడవు. శుక్ర గ్రహానికి అధిపతి శుక్రాచార్యుడు అతడు ఒక రాక్షసుడు. రాక్షసులు ఎప్పుడు చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు. అందుకే శుక్ర గ్రహం ఎప్పుడు అశాంతి గానే ఉంటుంది. శుక్రుడు ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని సువాసనలు ఉండాలి. కర్పూరం కూడా ఒక సుగంధ ద్రవ్యం. ఇది చాలా శుభప్రదమైనది. కర్పూరాన్ని ఉపయోగించి శుక్రుడిని శాంతింప చేయవచ్చు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.